అధికార పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సోదరుడిపై రాజధాని ప్రాంత మత్య్సకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న అధికారం అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న సురేంద్రపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి మత్య్సకారులు ప్రయత్నించారు. అయినా వారిని కలిసేందుకు చంద్రబాబు సమయం ఇవ్వలేదు.