
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, గ్రామంలో మట్టి తవ్వకాలపై చలో అనుమర్లపూడికి ధూళిపాళ్ల పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో చలో అనుమర్లపూడికి అనుమతి లేదంటూ పోలీసులు.. గ్రామంలో 144 సెక్షన్ అమలలో ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆయన.. గ్రామంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. దీంతో, తప్పుడు ప్రచారం చేస్తున్న ధూళిపాళ్లపై గ్రామస్తులు ఆగ్రహం వ‍్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీ సంఖ్యలో మోహరించారు. అనంతరం, ధూళిపాళ్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: రుణ ఎగవేత కేసులో కేశినేనికి డీఆర్‌టీ సమన్లు
Comments
Please login to add a commentAdd a comment