సాక్షి, గుంటూరు: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు. ఈ నెల నాలుగో తేదీన ఆయన ప్రెస్‌మీట్ పెట్టి డ్రగ్స్ రవాణా వ్యవహారంలో ప్రభుత్వానికి, పోలీసులకు గంజాయి వ్యాపారులతో సంబంధం ఉందంటూ చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. కాకినాడ నుంచి గుంటూరు జిల్లా చింతలపూడిలోని నరేంద్ర ఇంటికి వచ్చి పోలీసులు నోటీసును అందజేశారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను వారం రోజుల్లో అందజేయాలని నోటీసులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment