Mannuru
-
టీడీపీలో అసమ్మతి సెగలు
-
టీడీపీలో అసమ్మతి సెగలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. తాజాగా తిరుపతి టీడీపీలో అసమ్మతి రాజుకుంది. స్థానిక ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మకు టిక్కెట్ ఇవొద్దంటూ వ్యతిరేక వర్గం గట్టిగా గళమెత్తింది. ఆమెకు వ్యతిరేకంగా తుడా చైర్మన్ నరసింహ యాదవ్ సహా 50 డివిజన్ల అసమ్మతి నాయకులు శనివారం సమావేశమయ్యారు. సుగుణమ్మ వైఖరితో పార్టీ నష్టపోతుందని అసమ్మతి వర్గం నేతలు పేర్కొన్నారు. ఆమెకు టిక్కెట్ ఇస్తే సహకరించబోమని స్పష్టం చేశారు. రెండు వర్గాల అధిపత్యపోరుతో టీడీపీలో లుకలుకలు వీధికెక్కాయి. ఈ పరిణామాలు కచ్చితంగా పార్టీపై ప్రభావం చూపుతాయని టీడీపీ నాయకులు భయపడుతున్నారు. మరోవైపు తిరుపతి అసెంబ్లీ టిక్కెట్‌ను అధినేత చంద్రబాబు ఎవరికీ కేటాయిస్తారనే దానిపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా, చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ నగర అధ్యక్షుడితో పాటు ఆరుగురు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చిత్తూరు టీడీపీ నేతల్లో ఆందోళన మొదలయ్యింది. (పెరుగుతున్న వైఎస్సార్సీపీ బలం) -
యువతి పట్ల అనుచిత ప్రవర్తన
ఇరు వర్గాల మధ్య ఘర్షణ రాజంపేట రూరల్: రాజంపేట పట్టణంలో గురువారం ఓ యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారనే కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మన్నూరుకు చెందిన ఓ యువతిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడాడనే కారణంగా ఆమె సంబంధీకులు భువనగిరిపల్లెకు చెందిన యువకుడిని మందలించారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో యువతిని కామెంట్ చేసిన యువకుని సోదరుడు గురువారం బోయనపల్లెలో ఓ వసతి గృహం వద్ద ఉండగా యువతి తరపు వారు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న భువనగిరిపల్లెకు చెందిన యువకుని సంబంధీకులు బైపాస్ రహదారిలోని ఓ కల్యాణ మండపం వద్ద ఉన్న యువతి సంబంధీకులపై దాడికి దిగారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాలు ఆసుపత్రి వద్ద మోహరించడంతో పోలీసులు అప్రమత్తమై ఆసుపత్రి గేట్లు మూసి వేశారు. ఏఎస్ఐలు ఎంవీ సుబ్బయ్య, పీవీ రమణ విలేకర్లతో మాట్లాడుతూ ఘర్షణలో మన్నూరుకు చెందిన బండారు వెంకటసాయి, బండారు బాలయ్య, ముకందరగడ్డకు చెందిన అహమ్మద్‌బాషా, మరో వర్గానికి చెందిన కొరివి బ్రహ్మయ్య, కొరివి సిద్ధయ్య, వెంకటలక్షుమ్మ, జయచంద్రలు గాయపడ్డారన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.