న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సినీయర్ నేతలు పార్టీ నుంచి తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిలో రుచి గుప్తా కూడా చేరారు. విద్యార్థుల విభాగం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీకి ఇంచార్జీగా తన పదవికి రుచి శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు రుచి గుప్తా ఓ సందేశం విడుదల చేశారు. పార్టీ సంస్థాగత మార్పులలో జాప్యం కారణంగానే తాను కాంగ్రెస్ పార్టీని విడానన్నారు. ‘ప్రియమైన అందరికి.. నేను రాజీనామ చేసినట్లు ప్రకటించడం కోసమే ఈ లేఖ రాస్తున్నాను. పార్టీలో ముఖ్యమైన సంస్థాగత మార్పులు చాలా కాలం నుంచి పెండింగ్‌లో పడుతున్న విషయం తెలిసిందే. దాదాపు 1 సంవత్సరం 3 నెలలుగా దీనిపై జాతీయ కమిటీ నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాలు నెలల తరబడి పెండింగ్‌లో పడుతూనే ఉన్నాయి. (చదవండి: అసమ్మతి నేతలతో సోనియా భేటీ)
కొత్త కార్యకర్తలకు పార్టీలో స్థానం కల్పించేందుకు ఇతర రాష్ట్ర యూనిట్లు వేచి చూస్తున్న క్రమంలో జీఎస్(ఓ) నిరంతర జాప్యాలు పార్టీని దెబ్బతీస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు పదే పదే జాప్యం చేయడం కూడా సరైనది కాదు’ అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రుచి గుప్తా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌పై అసహనం వ్యక్తం చేశారు. సంస్థాగత మార్పులు తరచూ వాయిదా పడటానికి అతడే ప్రధాన కారణమని గుప్తా ఆరోపించారు. అయినప్పటికీ ఈ విషయం పార్టీ అధ్యక్షురాలు సోనియాకు ఎప్పటికి చేరలేవన్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరగాలని సోనియా గాంధీకి సినీయర్ నాయకులు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగతంపై చర్చిందుకు పార్టీ సినీయర్ నాయకులతో సోనియా ఇవాళ భేటి అయ్యారు. (చదవండి: పరువు నష్టం: సారీ చెప్పిన సీనియర్ నేత)
Comments
Please login to add a commentAdd a comment