నాలుగు కేజీల స్వర్ణాభరణాలు స్వాధీనం  | Police Seized Nearly Four kg Gold at Alampur | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 31 2018 3:09 AM | Last Updated on Wed, Oct 31 2018 3:09 AM

Police Seized Nearly Four kg Gold at Alampur - Sakshi

అలంపూర్‌: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్‌ వద్ద పోలీసులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లో నాలుగు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నగదు, మద్యం రవాణాను నియంత్రించడానికి తెలంగాణ – ఏపీ రాష్ట్రాల కు సరిహద్దుగా ఉన్న పుల్లూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద చెక్‌ పోస్టు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌–2 బృందం అధికారి పాండురంగరావు ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన తనిఖీల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న నరసింహారావు, అమర్‌నాథ్‌ కారును పరిశీలించగా బంగారు ఆభరణా లు ఉన్నట్లు గుర్తించారు. అయితే, సరైన పత్రా లు లేకపోవడంతో 4 కిలోల బంగారు ఆభరణా లను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement