
గ్రామస్తుల సమక్షంలో యువకుడికి కౌన్సెలింగ్ ఇస్తున్న సీఐ రంజితారెడ్డి
అలంపూర్ రూరల్ : మండలంలోని ఉట్కూరుకు చెందిన ప్రవీణ్ తన వాట్సాప్‌కు ఎవరో మెసేజ్ పంపారని చెప్పి ‘పిల్లలను ఎత్తుకెళుతున్నారు.. చంపేస్తున్నారు.. జాగ్రత్తగా ఉండండి..’ అంటూ వాయిస్ మెసేజ్ ఫొటోలు అనేక మందికి పంపి ఆందోళనకు గురిచేశాడు. ఈ విషయం తెలుసుకున్న సీఐ రంజితారెడ్డి బుధవారం సాయంత్రం ఆ గ్రామానికి వెళ్లి సదరు యువకుడిని పిలిపించి మందలించారు.
ఆ పోస్ట్ చేసింది నీవేనా? ఎందుకు చేశావ్.. అని ప్రశ్నించారు. తనకు ఎవరో పంపారని అందరినీ అప్రమత్తం చేసేందుకు తాను ఫార్వర్డ్ చేశానని తెలపగా మరోసారి ఇలా చేయొద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు. ముఖ్యంగా వాట్సాప్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలన్నారు.
సోషల్ మీడియాను మంచికి మాత్రమే వాడాలని ఆమె సూచించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ ఎక్కడా ఇలాంటి సంఘటనలు జరగడం లేదని అందరూ ప్రశాంతంగా ఉండాలన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ శరణప్ప తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment