Madras High Court Reiterated That Whatsapp Group Admin Are Not Liable for Members Posts - Sakshi
Sakshi News home page

WhatsApp: వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్స్‌పై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..!

Published Wed, Dec 29 2021 5:01 PM | Last Updated on Wed, Dec 29 2021 5:46 PM

Madras High Court Reiterated That Whatsapp Group Admin Are Not Liable For Members Posts - Sakshi

వాట్సాప్‌ గ్రూప్స్‌లో చేసే మెసేజ్స్‌పై పూర్తి బాధ్యత గ్రూప్స్‌ అడ్మిన్‌దేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. వాట్సాప్‌ గ్రూప్స్‌ మెసేజ్స్‌ విషయంలో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. 

బాంబే హైకోర్డుతో ఏకీభవిస్తూ..!
గతంలో బాంబే హైకోర్టు వాట్సాప్‌ గ్రూప్‌ మెసేజ్స్‌ విషయంలో గ్రూప్‌ అడ్మిన్‌ను బాద్యుడిని చేయలేమని ఇచ్చిన తీర్పును మరోకసారి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆ తీర్పును పునరుద్ఘాటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. వాట్సాప్‌ గ్రూప్‌ సభ్యులు పోస్ట్ చేసిన అభ్యంతరకర కంటెంట్‌కు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ బాధ్యులు కాదని వెల్లడించింది. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ బాంబే హైకోర్టు కిషోర్ వర్సెస్ స్టేట్ మహారాష్ట్ర తీర్పును మద్రాస్‌ హైకోర్టు ప్రస్తావించింది

గ్రూప్‌లో మెసేజ్‌ పెట్టినవారే..!
వాట్సాప్‌ గ్రూప్స్‌లో అడ్మిన్‌ కాకుండా గ్రూప్ సభ్యులు చేసిన నేరంలో అతను ఎలాంటి పాత్ర పోషించనట్లయితే నిందితుడి జాబితా నుంచి తప్పక తొలగించాలని పేర్కొంది. ఒకవేళ అడ్మిన్ నేరంలో ప్రమేయం ఉన్నట్లు చూపించే సాక్ష్యాలను సేకరించినట్లయితే అతణ్ణి చట్ట ప్రకారం విచారించవచ్చని కోర్టు వెల్లడించింది.

వ్యక్తిగత ప్రయోజనాల కోసం..!
ఆయా వాట్సాప్‌ గ్రూప్స్‌లోని వ్యక్తులు గ్రూప్‌ అడ్మిన్‌పై కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా అడ్మిన్‌ను ఆయా సభ్యుల స్వార్థం కోసం ఇరికించే అవకాశం ఉన్నట్లు మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా వాట్సాప్‌ గ్రూప్‌లో అడ్మిన్‌ కేవలం యాడ్‌, రిమూవ్‌ చేసే అధికారాన్నే కల్గి ఉంటారని పేర్కొంది.  గ్రూప్ సభ్యులు పంపే సందేశాలకు అడ్మిన్‌ బాధ్యత వహించలేడని పిటిషన్ పేర్కొంది.

గతంలో బాంబే కోర్టు కూడా..
వాట్సాప్ గ్రూప్ లో సభ్యులు చేసే పోస్టులకు అడ్మిన్లను బాధ్యులను చేయలేమని బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ పేర్కొంది. సభ్యులు చేసే తప్పిదాలకు అడ్మిన్లపై క్రిమినల్ నేరం మోపలేమని అభిప్రాయపడింది. 

కోర్టుకెక్కిన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!
కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాలను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొత్త ఐటీ చట్టాలను సవాల్‌ చేస్తూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ న్యాయస్థానాలకు ఆశ్రయించాయి. ఈ చట్టాలతో తమ ఖాతాదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన ప్రైవేటు సమాచారాన్ని ఇవ్వమని ప్రభుత్వం కోరడం రాజ్యంగ స్ఫూర్తికి  విరుద్ధమని పేర్కొన్నాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తాము ఖాతాదారులకు హామీ ఇచ్చామని,. దాన్ని ఉల్లంఘించలేమంటూ అప్పట్లో  న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. 

చదవండి : WhatsApp: గూగుల్‌ మ్యాప్స్‌లోనే కాదు..వాట్సాప్‌లో కూడా వెతికేయచ్చు..! ఎలాగంటే..?


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement