బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలంపూర్ మండలం గుండిమల్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
ఆలంపూర్ (మహబూబ్‌నగర్) : బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలంపూర్ మండలం గుండిమల్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శైలజ(28) తన కూతురు మాధురి(2)పై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పంది.
ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రగాయాలతో మృతిచెందారు. కుటుంబకలహాలే ఆత్మహత్యకు కారణమని సమాచారం. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.