సాక్షి, చెన్నై (సేలం): సేలంలో ఓ మహిళ వేగంగా వస్తున్న బస్సుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడి కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బు అవసరం పడడమే అందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. వివరాలు.. సేలం జిల్లాకు చెందిన పాప్పాతి (39) తన కుమార్తె, కుమారుడితో నివాసముంటోంది. స్థానిక కలెక్టర్ ఆఫీసులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తూ అతికష్టం మీద కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.
భర్త లేకపోవడంతో 15 ఏళ్లుగా ఒంటరిగా పిల్లల్ని పోషిస్తోంది. పాప్పాతి కుమార్తె ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, కుమారుడు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. ఈ స్థితిలో పాప్పాతి రోడ్డుపై వేగంగా వస్తున్న బస్సుకు ఎదురెళ్లి ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దీన్ని తొలుత ప్రమాదంగా భావించారు. అయితే కుమారుడికి కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బు తన దగ్గర లేకపోవడంతో తెలిసిన వారిని సహాయం అడిగినా ఎక్కడా అప్పు పుట్టలేదని తెలిసింది.
తాను చనిపోతే ప్రభుత్వం కొంత డబ్బును పరిహారంగా కుటుంబానికి అందిస్తుందనే ఆశతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. అక్కడున్న సీసీ కెమెరాల్లో పాపాత్తి బస్సుకు ఎదురెల్లడం రికార్డు అవ్వడంతో ఆత్మహత్యగా తేల్చారు. ఇదిలా ఉండగా తన తల్లిపై వస్తున్న వార్తలను కుమారుడు ఖండించాడు. తన ఫీజు కట్టేందుకు తన బంధువులు సాయం చేశారని చెప్పినట్లు తెలిసింది.
చదవండి Yamuna Floods At Taj Mahal: 45 ఏళ్ల తర్వాత.. తాజ్ మహల్‌ను తాకిన యమున వరద.. మళ్లీ డేంజర్ బెల్స్
Comments
Please login to add a commentAdd a comment