మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ తుంగభద్ర నదిలో మంగళవారం పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జాలర్లు నీట మునిగి మరణించారు.
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ తుంగభద్ర నదిలో మంగళవారం పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జాలర్లు నీట మునిగి మరణించారు. ఈ రోజు ఉదయం జాలర్లు తుంగభద్రలో చేపల వేటకు వెళ్లారు. ఆ క్రమంలో నదిలో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దాంతో పడవ అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు జాలర్లు నీటిలో మునిగిపోయారు. వారిని రక్షించేందుకు సహచర జాలర్లు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో సహచర జాలర్లు నది ఒడ్డుకు చేరుకున్నారు. మృతి చెందిన ఇద్దరు జాలర్ల మృతదేహాలను తుంగభద్ర నుంచి వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. మృతుల్లో ఒకరు స్థానికుడు కాగా, మరోకరు కర్నూలు జిల్లాకు చెందిన వాడని సహాచర జాలర్లు తెలిపారు.