తుంగభద్రలో పడి కర్నూలువాసి మృతి | kurnool person dead in tungabhadra river | Sakshi
Sakshi News home page

తుంగభద్రలో పడి కర్నూలువాసి మృతి

Published Sun, Dec 6 2015 5:56 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

kurnool person dead in tungabhadra river

అలంపూర్: మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ప్రమాదవశాత్తూ తుంగభద్ర నదిలో పడి మృతిచెందాడు. కర్నూలు వివేక్నగర్‌కు చెందిన రమేష్‌బాబు(52), శారద(47) దంపతులు జోగులాంబ దర్శనార్థం ఆదివారం అలంపూర్ వచ్చారు.

తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు దిగిన రమేష్‌బాబు ప్రమాదవశాత్తూ కాలుజారి కాలువలో పడ్డాడు. వెంటనే ఒడ్డున కూర్చున్న శారద కేకలు వేయడంతో అక్కడున్నవారు రమేష్‌బాబును కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతిచెందాడు. రమేష్‌బాబు కర్నూలు జిల్లా కానాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య శారద అదే గ్రామంలో టీచర్‌గా పనిచేస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement