పుష్కర హారతి ఇస్తున్న సీఎం కేసీఆర్
పాత హామీలతో సరి!
Published Fri, Aug 12 2016 6:21 PM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
– నిరాశపరిచిన సీఎం పర్యటన
– అడుగడుగునా పోలీసుల ఆంక్షలు
– ప్రజలను పలకరించని కేసీఆర్
అలంపూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అలంపూర్ క్షేత్రానికి రావడంతో ఈ ప్రాంత అభివద్ధిపై ఆశలు చిగురించాయి. నల్లగొండ జిల్లాలోని యాదాద్రిని అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్న సీఎం అదే తరహాలో శక్తి పీఠమైన జోగుళాంబ అమ్మవారి క్షేత్రాన్ని అభివద్ధిపరుస్తారని ఆకాంక్షించారు. సీఎం హోదాలో మొదటిసారి అలంపూర్ ఆయన వచిన్నా పర్యటన సాదాసీదాగా ముగిసింది. కేసీఆర్ ఎలాంటి వరాల జల్లులు కురిపించలేదు. ఆలయాల అభివద్ధికి అడ్డంకిగా ఉన్న పురావస్తు నిబంధనల సడలింపునకు యత్నిస్తానని మాత్రమే పేర్కొన్నారు. ఆంధ్రా పాలకుల పాలనలో అలంపూర్ క్షేత్రం నిరాదరణకు గురైందని చెప్పిన కేసీఆర్ స్వయంపాలనలో ప్రత్యేక నిధులు విదల్చకపోవడంపై భక్తులు పెదవి విరుస్తున్నారు. ఇక ఆర్డీఎస్ నాలుగు దశాబ్దాలుగా నలుగుతున్న సమస్య. దీని పరిష్కారానికి ఉన్న రెండు మార్గాలు గత ప్రభుత్వాల హయాం నుంచి చెబుతున్న హామీలే. ప్రస్తుత సీఎం సైతం తుమ్మిళ్ల ఎత్తిపోతలతో రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. అలంపూర్‌లో ఆర్టీసీ బస్‌డిపో లేదు. రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతం కావడంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత బస్సుల నిర్వహణ సమస్యగా మారింది. దీంతో డిపో ఏర్పాటు చేయాలని స్థానికంగా విన్నపాలు ఉన్నాయి. ఇదిసాధ్యం కాదని గతంలోనే కంట్రోల్ పాయింట్ ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి. ఇప్పుడూ అదే పరిశీలిస్తామని సీఎం చెప్పారు.
అలంపూర్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తామన్నా హామీ సైతం గతంలోనే మంత్రులు ప్రకటించిందే. ఇదిలాంటే సీఎం రాక సందర్భంగా అలంపూర్‌లో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. దాదాపు వేయి మందితో సీఎం బందోబస్తు ఏర్పాటుచేశారు. రోడ్డుపై ట్రాఫిక్ ఆంక్షలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీనికితోడు కేసీఆర్‌ను చూడానికి స్థానికులు, ప్రజాప్రతినిధులు టూరిజం హోటల్‌కు చేరుకున్నారు. అయితే లోపలికి ఎవరినీ అనుమతించలేదు. సీఎం బయటికి వచ్చిన సమయాల్లో కనీసం పలకరించడానికి, వారిని కలవడానికి, అభివాదం వంటివి చేయకపోవడం నిరాశ పర్చింది. సీఎం రాక, కష్ణా పుష్కరాలను పురస్కరించుకుని మీడియాకు డీపీఆర్‌ఓ ద్వారా పాస్‌లు జారీ చేసినా కవరేజీకి అనుమతించలేదు.
Advertisement