Dissopointed people
-
పరీక్షలంటే కోపం అంటున్న నటుడు
సాక్షి, ముంబై : ఇటీవల నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తూ, త్వరలోనే పదో తరగతి, ప్లస్ టూ విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహిస్తామని సీబీఎస్ఈ ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్ష పేపర్లు లీకయిన నేపథ్యంలో మళ్లీ పరీక్షలు నిర్వహించబోవడంపై పలువురు బాలీవుడ్ నటులు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. ఫర్హాన్ అక్తర్ : ‘వారి తప్పేం లేకున్నా విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తుంది. ఇది దురదృష్టకరమైన విషయం. దీన్ని ఎదుర్కొవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు. వివేక్ ఒబేరాయ్ : ‘పేపర్ లీక్ అవ్వడం అన్యాయం. ఇన్నాళ్లు కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరిగింది. రెండోసారి పరీక్ష రాసేవారికి మరో అవకాశం లభించినట్లు. గతంలో కంటే ఈ సారి ఇంకా బాగా పరీక్ష రాయండి’ అని పేర్కొన్నారు. రాహుల్ ధోలకియా : ‘పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని తెలిసి నేను చాలా నిరాశచెందాను. పరీక్షలంటేనే నాకు చాలా కోపం. విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తామంటే నాకు చాలా కోపం వస్తుంది. పేపర్ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని’ అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం 16,38,428 విద్యార్థులు పదో తరగతి కోసం, 11,86,306 మంది విద్యార్థులు ప్లస్ టూ తరగతి బోర్డు పరీక్షలకు నమోదు చేసుకున్నారు. వీరికి తిరిగి పరీక్షలు ఏ తేదీలలో నిర్వహిస్తారనే అంశం, ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఒక వారంలోపు సీబీఎస్ఈ వెబ్సైట్లో పెడతామని బోర్డు తెలిపింది. ప్లస్ టూ ఎకనామిక్స్ పేపర్, పదో తరగతి మ్యాథ్స్ పేపర్లు లీక్ అయ్యాయి. ఈ పేపర్స్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు అంటూ పరీక్షలకు కొద్ది రోజుల ముందు చేతితో ప్రశ్నలు రాసి ఉన్న పేపర్ సోషలో మీడియాలో వైరల్ అయింది. అందులో ఉన్న ప్రశ్నలే సీబీఎస్ఈ తయారు చేసిన ప్రశ్న పత్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. -
పాత హామీలతో సరి!
– నిరాశపరిచిన సీఎం పర్యటన – అడుగడుగునా పోలీసుల ఆంక్షలు – ప్రజలను పలకరించని కేసీఆర్ అలంపూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అలంపూర్ క్షేత్రానికి రావడంతో ఈ ప్రాంత అభివద్ధిపై ఆశలు చిగురించాయి. నల్లగొండ జిల్లాలోని యాదాద్రిని అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్న సీఎం అదే తరహాలో శక్తి పీఠమైన జోగుళాంబ అమ్మవారి క్షేత్రాన్ని అభివద్ధిపరుస్తారని ఆకాంక్షించారు. సీఎం హోదాలో మొదటిసారి అలంపూర్ ఆయన వచిన్నా పర్యటన సాదాసీదాగా ముగిసింది. కేసీఆర్ ఎలాంటి వరాల జల్లులు కురిపించలేదు. ఆలయాల అభివద్ధికి అడ్డంకిగా ఉన్న పురావస్తు నిబంధనల సడలింపునకు యత్నిస్తానని మాత్రమే పేర్కొన్నారు. ఆంధ్రా పాలకుల పాలనలో అలంపూర్ క్షేత్రం నిరాదరణకు గురైందని చెప్పిన కేసీఆర్ స్వయంపాలనలో ప్రత్యేక నిధులు విదల్చకపోవడంపై భక్తులు పెదవి విరుస్తున్నారు. ఇక ఆర్డీఎస్ నాలుగు దశాబ్దాలుగా నలుగుతున్న సమస్య. దీని పరిష్కారానికి ఉన్న రెండు మార్గాలు గత ప్రభుత్వాల హయాం నుంచి చెబుతున్న హామీలే. ప్రస్తుత సీఎం సైతం తుమ్మిళ్ల ఎత్తిపోతలతో రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. అలంపూర్‌లో ఆర్టీసీ బస్‌డిపో లేదు. రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతం కావడంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత బస్సుల నిర్వహణ సమస్యగా మారింది. దీంతో డిపో ఏర్పాటు చేయాలని స్థానికంగా విన్నపాలు ఉన్నాయి. ఇదిసాధ్యం కాదని గతంలోనే కంట్రోల్ పాయింట్ ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి. ఇప్పుడూ అదే పరిశీలిస్తామని సీఎం చెప్పారు. అలంపూర్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తామన్నా హామీ సైతం గతంలోనే మంత్రులు ప్రకటించిందే. ఇదిలాంటే సీఎం రాక సందర్భంగా అలంపూర్‌లో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. దాదాపు వేయి మందితో సీఎం బందోబస్తు ఏర్పాటుచేశారు. రోడ్డుపై ట్రాఫిక్ ఆంక్షలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీనికితోడు కేసీఆర్‌ను చూడానికి స్థానికులు, ప్రజాప్రతినిధులు టూరిజం హోటల్‌కు చేరుకున్నారు. అయితే లోపలికి ఎవరినీ అనుమతించలేదు. సీఎం బయటికి వచ్చిన సమయాల్లో కనీసం పలకరించడానికి, వారిని కలవడానికి, అభివాదం వంటివి చేయకపోవడం నిరాశ పర్చింది. సీఎం రాక, కష్ణా పుష్కరాలను పురస్కరించుకుని మీడియాకు డీపీఆర్ఓ ద్వారా పాస్‌లు జారీ చేసినా కవరేజీకి అనుమతించలేదు.