‘మరో ఆరు నెలల్లో కేటీఆరే సీఎం’ | ktr will be cm in 6months says palvai govardhanreddy | Sakshi
Sakshi News home page

‘మరో ఆరు నెలల్లో కేటీఆరే సీఎం’

Published Sat, Jul 9 2016 9:36 PM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

‘మరో ఆరు నెలల్లో కేటీఆరే సీఎం’ - Sakshi

‘మరో ఆరు నెలల్లో కేటీఆరే సీఎం’

చౌటుప్పల్(నల్లగొండ): వచ్చే ఆరు నెలల కాలంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ సీఎం అవుతారని, అందుకు కారణం ఆ పార్టీ అంతర్గత విభేదాలేనని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ ముఖ్యనేతలే గుసగుసలాడుకుంటున్నారని తెలిపారు.

సీఎం కేసీఆర్ ఏడాది ముందుగానే 2018లో సాధారణ ఎన్నికలకు వెళతారని జోస్యం చెప్పారు. అందుకు కారణం 2019వరకు ఇలాగే అధికారంలో ఉండి ఎన్నికలకు పోతే పరాజయం తప్పదని గుర్తించారన్నారు. హరితహారం కార్యక్రమం ఈనాటిది కాదని, జవహర్‌లాల్‌నెహ్రూ కాలం నుంచే, వర్షాలు కురవగానే మొక్కలు నాటుతున్నారన్నారు. సీఎం హరితహారం ప్రచార ఆర్భాటం తప్ప మరోటి లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement