పుష్కర దర్శనం | Pushkara Visit | Sakshi
Sakshi News home page

పుష్కర దర్శనం

Published Tue, Aug 9 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

అలంపూర్‌ ఆలయాల సముదాయం

అలంపూర్‌ ఆలయాల సముదాయం

అలంపూర్‌రూరల్‌: జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలకు పుష్కరశోభ సంతరించుకుంది. పుష్కరస్నానం చేసిన భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు. ఇందుకోసం కష్ణానది తీరంలో 32ఘాట్ల వద్ద 32ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. ఇందులో మాగనూరు మండలం తంగడిలోని శ్రీ వల్లభేశ్వరస్వామి ఆలయం, కష్ణ గ్రామంలో దత్తాత్రేయ ఆలయం, కష్ణా రైల్వే బ్రిడ్జి సమీపంలో శ్రీ క్షీరలింగేశ్వర స్వామి ఆలయం, గూడెబల్లూరులోని స్వయంభూ లక్ష్మి వేంకటేశ్వరస్వామి, మక్తల్‌ మండలంలోని పంచదేవ్‌పహాడ్‌ (దత్తాత్రేయస్వామి), పారేవుల (శ్రీశంకరలింగేశ్వరస్వామి), ఆత్మకూరు మండలం నందిమల్ల (శివాలయం), మూలమల్ల (శ్రీఆంజనేయస్వామి), జూరాల (పాత శివాలయం), పెబ్బేరు మండలంలోని రంగాపూర్‌(రంగనాయకస్వామి), ఇటిక్యాల మండలం బీచుపల్లి (శ్రీ ఆంజనేయస్వామి), వీపనగండ్ల మండలం పెద్దమారూరు (ఈశ్వర ఆలయం), చర్లపాడు (శివాలయం), జటప్రోలు (మదన గోపాలస్వామి ఆలయం, అగస్తేశ్వర ఆలయం), కొల్లాపూర్‌ మండలంలోని మంచాలకట్ట (శ్రీరామతీర్థస్వామి ఆలయం), సోమశిల (లలిత సోమేశ్వరస్వామి ఆలయం), అమరగిరి (అమరేశ్వరస్వామి ఆలయం), ధరూర్‌ మండలంలోని ఉప్పేరు (శివ ఆంజనేయస్వామి ఆలయం), రేవులపల్లి (శివాంజనేయస్వామి), పెద్దచింతరేవుల(ఆంజనేయస్వామి ఆలయం), రేకులపల్లి (అభయాంజనేయస్వామి), గద్వాల మండలం నది అగ్రహారం(రామావదూత మఠం), బీరెల్లి (చెన్నకేశవస్వామి ఆలయం), అలంపూర్‌ జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం, క్యాతూరులో వెంకటేశ్వరస్వామి ఆలయం, అమ్రాబాద్‌ మండలం పాతాళగంగ దత్తాత్రేయస్వామి ఆలయాల్లో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
 
 
శిల్పకళా నిలయం రంగనాథ ఆలయం 
శ్రీరంగాపూర్‌ ఆలయం జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. అద్భుతమైన శిల్పసంపదతో పాటు ఎంతో విలువైన అపురూప చిత్రపటాలు ఇక్కడ ఉన్నాయి. రంగసముద్రం చెరువు ఒడ్డున గరుడాద్రి మీద రంగనాయకస్వామి ఆలయం నిర్మించడంతో కొర్విపాడు గ్రామం శ్రీరంగాపూర్‌గా మారింది. కొర్విపాడు(నేటి శ్రీరంగాపూర్‌)లో సూగూరు (వనపర్తి) సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు(క్రీ.శ.1670) కాలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. 
 
 
ఐదోశక్తి పీఠం జోగుళాంబ
నవబ్రహ్మల క్షేత్రంగా విరాజిల్లుతున్న అలంపూర్‌ ఆలయాల్లో శ్రీ జోగుళాంబ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠంగా విరాజిల్లుతోంది. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ జరిపినట్లు పురాణం చెబుతోంది. 1400ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాలను బాదమీ చాళుక్యుల కాలంలో రెండో పులకేశి నిర్మించారు. గ్రామ దేవతను మొదలుకుని పార్వతి, పరమేశ్వరుyì  వరకు ముక్కోటి దేవతలను అలంపూర్‌లో దర్శించవచ్చు. ప్రస్తుతం అలంపూర్‌ ఆలయాలు జిల్లాకే గర్వకారణంగా నిలిచాయి.
 
 
సోమశిలలో సోమేశ్వరుడి ఆలయం 
కొల్లాపురం మండలంలోని సోమశిలలో శ్రీలలిత సోమేశ్వరుడి దర్శనం కలుగుతుంది. 7వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాలతో పాటుగా జ్యోతిర్లింగాలయాలను అతి సుందరంగా నిర్మించారు. ప్రస్తుతం వీటిని పర్యాటక శాఖ అభివద్ధి చేస్తుంది. ప్రతి సోమవారం ఈ క్షేత్రంలో విశేష పూజలు జరుగుతాయి. 
 
 
బీచుపల్లి అభయాంజనేయుడు
కొలిచినంతనే కొండంత అండగా మనోధైర్యాన్ని ప్రసాదించే దైవం బీచుపల్లి ఆంజనేయస్వామి. కష్ణా తీరాన వ్యాసరాయుల ప్రతిషి్ఠంచిన ఆంజనేయుడు జిల్లావాసులకే కాక ఇరు రాష్ట్రాల భక్తులకు ఆరాధ్యదైవం. బోయవారి చేత ప్రతి నిత్యం స్వామివారు సంప్రదాయరీతిలో పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రంలో ఇటీవల సర స్వతి, హయగ్రీవ, రామాలయాలు నిర్మించారు. ఇక్కడి ఆలయాల్లో వైష్ణ ఆగమ సంప్రదాయ రీతిలో పూజలు జరుగుతున్నాయి.
 
 
ఆనాటి జటాయిపురమే జటప్రోల్‌
వీపనగండ్ల: జటప్రోల్‌లో వెలసిన దేవాలయాలు శిల్పకళకు నిలయం. రావణుడు సీతాదేవిని లంకకు ఎత్తుకెళుతున్న సమయంలో జటాయువు అనే ప„ì  ఎదిరించింది. రావణుడు ఆ పక్షిని వధించాడని, అందుకు గుర్తుగా జటేశ్వర క్షేత్రం వెలసిందని, కాలక్రమేణా ఇది జటప్రోల్‌గా మారినట్లు పురాణం చెబుతోంది. ప్రధాన ఆలయాల్లో ప్రసిద్ధి చెందిన మదనగోపాలస్వామి ఆలయంతో పాటు 16వ శతాబ్దానికి చెందిన 21 అగస్తేశ్వరుల ఆలయాలు కూడా ఉన్నాయి. మదనగోపాలస్వామి గోపుర ఆలయాన్ని వల్లభరాయుడు అనేరాజు కట్టించారని, ఈ గోపురంపై జటాయువు పక్షులు, కోతులను, పెద్ద పెద్ద జడలు గల రుషుల విగ్రహాలను మలిచారు. అగస్తేశ్వర ఆలయంతో పాటు జటేశ్వర ఆలయం, భ్రమరాంబ, మల్లేశ్వర ఆలయం, వీర భద్రాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, తదితర 21ఆలయాలు ఇక్కడ వెలిశాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement