pushkara
-
తుంగభద్ర పుష్కరాలు..సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జరగనున్న తుంగభద్ర పుష్కరాలను కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ప్రారంభించాలంటూ సీఎం జగన్‌కు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించిన మఠం ప్రతినిధులు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు రాఘవేంద్రస్వామి మఠం ప్రతినిధులు, అసిస్టెంట్ మేనేజర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. (చదవండి : సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు) -
‘పుష్కర’ మరణాలకు కలెక్టరే సాక్షి
నియంత్రణ అధికారి ఆయనే నిబంధనలను ఉల్లంఘించారు రద్దీ నియంత్రణ, సౌకర్యాల కల్పనను పూర్తిగా మరిచారు సీఎం పక్కనే ఉన్నారు కమిష¯ŒS ముందు న్యాయవాదుల వాదనలు ప్రస్తుతానికి ముగిసిన వాదనలు సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో గోదావరి పుష్కరాల మొదటి రోజున జరిగిన తొక్కిసలాటకు జిల్లా కలెక్టరే ప్రత్యక్ష సాక్షి అని బాధితుల తరఫు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కమిష¯ŒSకు నివేదించారు. జిల్లాలో పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యత చూడాల్సిన కలెక్టర్ అవన్నీ పక్కనపెట్టి సీఎం వెంట ఉన్నారని తెలిపారు. భక్తుల రద్దీని నియంత్రించèడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేయకపోవడం, పుష్కరఘాట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా సీఎం కాన్వాయ్ కోసం బారికేడ్లు తొలగించడం, గేటు మూసివేయడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం ఘాట్‌లో ఉన్నంత వరకు ఆయన వద్ద ఉన్నారని, తిరిగి వెళ్లిపోతునప్పుడు సీఎం కాన్వాయ్‌ను పట్టుకు వేళాడుతూ వెళ్లిన దృశ్యాలు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ఇచ్చిన సీడీలో గతంలో కమిష¯ŒS చూసిన విషయం గుర్తు చేశారు. గురువారం నగరంలోని రహదారుల భవన అతిథి గృహంలో కమిష¯ŒS విచారణ మూడో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ముప్పాళ్ల వాదనలు వినిపిస్తూ లైజనింగ్ అధికారి వీఐపీల రాకపోకలు, వారి ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉందన్నారు. కానీ కలెక్టర్ తన బాధ్యతలు మరచి వీఐపీల సేవలో ఉన్నారన్నారు. అసలు లైజనింగ్ అధికారులు ఎవరు అని కమిష¯ŒS అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ తరఫు న్యాయవాది చింతపెంట ప్రభాకర్‌రావు తన వద్ద సమాచారం లేదన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను మైక్ తీసుకుని ఆదేశాలు జారీ చేశారని, ఆ అధికారం అతనికి ఎవరు ఇచ్చారో తెలియాల్సి ఉందని ముప్పాళ్ల వాదించారు. బోయపాటి శ్రీను పుష్కరాల ప్రారంభం రోజు సీఎం పక్కన లేరని, 13వ తేదీ సాయంత్రం ఉన్నారని ప్రభాకర్‌రావు వాదించారు. అర్బ¯ŒS జిల్లా ఎస్పీ రద్దీని, ట్రాఫిక్‌ను నియంత్రించడంలో విఫలమయ్యారని ముప్పాళ్ల పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తొక్కిసలాట తర్వాత బాధితులకు ప్రాథమిక వైద్యం, ఆక్సిజ¯ŒS అందించలేదని తెలిపారు. అంతేకాకుండా గాయపడిన వారిని సకాలంలో ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదన్నారు. తొమ్మిది అంబులె¯Œ్సలున్నాయని అధికారులు పేర్కొంటున్నా అవి ఎక్కడున్నాయో తెలియదన్నారు. తొక్కిసలాటకు ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా కలెక్టర్, అర్బ¯ŒS జిల్లా ఎస్పీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కారణమని స్పష్టం చేశారు. వాదనలు విన్న కమిష¯ŒS విచారణను వాయిదా వేసింది. ఈ నెల 29తో కమిష¯ŒSకు పెంచిన గడువు ముగుస్తోంది. -
‘పుష్కర’ కేసులో ఛార్జిషీట్ వేసేదెన్నడు?
తొక్కిసలాటపై కేసు నమోదు చేసిన పోలీసులు రెండేళ్లు కావస్తున్నా నేటికీ పూర్తికాని విచారణ కొనసాగుతోందంటూ కమిషన్‌కు వివరణ ఛార్జిషీట్ వేస్తే కారణాలు, బాధ్యులు ఎవరో తెలిసే అవకాశం సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటపై పోలీసులు విచారణ ఇంకా కొనసాగుతోంది. 2015 జూన్ 14న పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అదే రోజు ఉదయం సీఎం చంద్రబాబు దంపతులు పుష్కరఘాట్‌లో పూజలు, పుణ్యస్నానాలు ఆచరించారు. అ సమయంలో గంటన్నరపాటు లోపలికి వచ్చే భక్తులు బయటకు వెళ్లకుండా ఉన్న ఒక్కగేటు మూసివేశారు. గేటు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసటాల చోటుచేసుకుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 28 మంది మరణించగా 51 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో స్థానిక పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 174 ప్రకారం 2015లో కేసు నంబర్ 268/2015 నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసి దాదాపు రెండేళ్లు కావస్తున్నా విచారణ ఓ కొలిక్కి రాలేదు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు ఏక సభ్యకమిషన్ కు చెబుతున్నారు. మొదట దర్యాప్తునకు ప్రత్యేక అధికారిగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డీఎస్పీ ఎం. అంబికా ప్రసాద్‌ను నియమించారు. కొన్ని రోజులు తర్వాత బదిలీపై అబింకా ప్రసాద్ వెళ్లిపోయారు. ఆయన తర్వాత కేసును ప్రస్తుతం అమలాపురం డీఎస్పీగా పనిచేస్తున్న అంకయ్యకు అప్పగించారు. అయితే నేటికీ కేసు విచారణ దశలోనే ఉండడం గమనార్హం. పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణ పూర్తి చేసి చార్జిషీటు వేస్తే కమిషన్ విచారణకు ఉపయోగకరంగా ఉండేది. అయితే ముందు నుంచి కమిషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్న అన్ని ప్రభుత్వ విభాగాలులాగే పోలీసు శాఖ కూడా ఈ కేసుపై నాన్చివేత ధోరణి అవలబింస్తోంది. సీసీటీవీల ఫుటేజీలు లేవని చెప్పడం, రికార్డు కాలేదని, లైవ్ కోసమే వాటిని ఏర్పాటు చేశామని చెప్పడంతో యంత్రాంగం నిబంధనలను ఏ విధంగా ఉల్లంఘించిందో స్పష్టమవుతోంది. చనిపోయిన 28 మందికి పంచనామాలు, పోస్టుమార్టం నివేదికలు కమిషన్‌కు ఇస్తే కమిషన్ విచారణకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. అంతేకాకుండా చనిపోయిన, గాయపడ్డవారిని అక్కడ నుంచి ఎంత సమయానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచారు? ఆలస్యమైతే దానికి బాధ్యులు ఎవరు? అన్న విషయాలు దర్యాప్తులో తేలే అవకాశం ఉండేది. కానీ విచారణ పూర్తి చేయడానికి పోలీసుశాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్న విషయం మంగళవారం జరిగిన కమిషన్ విచారణలో తేటత్లెమవుతోంది. కనీసం ఫలానా సమయానికి విచారణ పూర్తవుతుందని కూడా పోలీసు అధికారులు చెప్పకపోవడం గమనార్హం. కేసుపై పోలీసుల నిర్లక్ష్యం.. తొక్కిసలాటపై పోలీసులు పెట్టిన కేసు ఇప్పటికీ పూర్తికాకపోవడం విడ్డూరం. గాయపడిన వారి ధ్రువపత్రాలు వచ్చిన తర్వాత చార్జిషీటు వేస్తామని గత విచారణ సందర్భంగా పోలీసులు చెప్పారు. ఆ పత్రాలను కమిషన్‌కు కూడా సమర్పించారు. కానీ వారి విచారణ పూర్తి చేసి చార్జిషీటు మాత్రం వేయకపోవడం కేసుపై వారి నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. – ముప్పాళ్ల సుబ్బారావు, న్యాయవాది, బార్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యుడు, రాజమహేంద్రవరం అధ్యక్షుడు -
పుష్కర తొక్కిసలాటపై నేడు కమిషన్ విచారణ
ఇప్పటికైనా వాస్తవాలు బయట పడేనా? రాజమహేంద్రవరం క్రైం : పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ సి.వై.సోమయాజులు నేతృత్వంలో శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో విచారణ జరపనుంది. ఇప్పటికే అనేక సార్లు విచారణ జరిపిన కమిషన్ నాలుగోసారి 390 జీఓ విడుదల చేసింది. ఈ జీవో కాలపరిమితి ఈ నెల 29 వరకు ఉంది. మానవ హక్కుల కమిషన్‌కు మొదటిసారిగా ఇచ్చిన నివేదికలో కలెక్టర్, ముఖ్యమంత్రి పుష్కర ఘాట్ లో ఉండడం వల్లే తొక్కిసలాట జరిగిందని నివేదిక ఇచ్చినప్పటికీ, అనంతరం భక్తుల తొందరపాటే తొక్కిసలాటకు కారణమని మాట మార్చారు. అయితే అధారాలు సమర్పించడంతో దాటవేత ధోరణి అవలంబించారు. స్వామి భక్తే కొంప ముంచింది పుష్కరాల సందర్భంగా వీఐపీలకు ప్రత్యేక ఘాట్ కేటాయించినప్పటికీ టెలిఫిల్మ్ చిత్రీకరణకు వీలుగా ముఖ్యమంత్రి పుష్కర ఘాట్‌లోనే కుటుంబ సమేతంగా స్నానం చేశారు. మూడు గంటల పాటు నిరీక్షించిన లక్షలాది పుష్కర యాత్రికులను ఒక్కసారిగా ఘాట్‌లోకి అనుమతించడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 29 మంది మృత్యువాత పడగా, 51 మంది గాయాలపాలైయ్యారు. ముఖ్యమంత్రి మెప్పుపొందడానికి అధికారులు తాపత్రయ పడి వీఐపీల వద్దే ఉండిసామాన్య యాత్రికులను, వారి రక్షణను నిర్లక్ష్యం చేశారు. బారికేడ్లు తొలగించి వీఐపీలకు అనుమతి పుష్కర ఘాట్‌లో స్నానం చేసేందుకు లక్షలాది మంది వస్తారని ముందుగానే అంచనాలు ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టు ఘాట్ల గేట్లు వెడల్పు చేడయంలో అధికారులు విఫలమయ్యారు. గేటు లోపల వైపు ఏడు మెట్లు కూడా తొక్కిసలాట చోటు చేసుకొని భక్తులు మృతి చెండానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చును. అలాగే పుష్కర ఘాట్‌లో ఏర్పాటు చేసి బారీకేడ్లు వీఐపీల కార్లు వచ్చేందుకువీలుగా బారికేడ్లు తొలగించారు. అందువలన యాత్రికులు గేటు వద్ద గుంపులు, గుంపులుగా రావడంతో తోపులాట చోటు చేసుకొని ఈ దుర్ఘటన జరగడానికి కారణమైంది.ఇప్పటికైనా అధికారులు ఆధారాలు సమర్పిస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది లేకుంటే నిజం మరుగున పడే ప్రమాదం ఉంది. -
గోదావరి పరవళ్లు
ఏటూరునాగారం :ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో మండలంలోని ముల్లకట్ట వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. సోమవారం పుష్కరఘాట్‌కు తాకుతూ వరదనీరు ప్రవహించింది. నెలరోజులుగా అంతంతమాత్రంగానే ఉన్న గోదావరి ఇప్పుడు జలకళ సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లా పూసుర, వరంగల్ జిల్లా ముల్లకట్ట రేవులను ఆనుకొని గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జాతీయ రహదారిపై పర్యాటకులు ఆహ్లాదంగా గడిపారు. రామన్నగూడెం వద్ద గోదావరి నీటి మట్టం 3.30 అడుగులకు చేరింది. -
పుష్కరాల కంట్రోల్‌రూమ్‌ను సందర్శించిన కలెక్టర్
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కష్ణా పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందుల రాకుండా చర్యలు తీసుకునేందుకు జిల్లా స్థాయిలో సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ టీకేశ్రీదేవి గురువారం సందర్శించారు. కంట్రోల్ రూమ్ నుంచి∙పుష్కర ఘాట్లను పర్యవేక్షించి రద్దీ నివారణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పుష్కరాల నిర్వహణపై తయారు చేసిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన స్క్రీన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జేసి రాంకిషన్, ఏజేసీ బి.రంజిత్ ప్రసాద్, డిఆర్వో భాస్కర్, జడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ ఏఓ నర్సయ్య, మీసేవా సూపరింటెండెంట్ బక్క శ్రీనివాసులు, కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు. వలంటీర్ల శిబిరం ప్రారంభం.. మహబూబ్‌నగర్ న్యూటౌన్: కష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించేందుకు వెళ్తున్న వలంటిర్ల శిబిరాలను గురువారం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పుష్కరాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ అధ్యక్షుడు అనంతరెడ్డి, ఉపాద్యక్షుడు నటరాజ్, ఎంవీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్, పాండరంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో వాలంటీర్ల బందాలు పుష్కర ఘాట్ల వద్ద విధులు నిర్వహించేందుకు బయలుదేరాయి. -
పుష్కర ఔషధాలు సిద్ధం
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం పలు పుష్కరాల ఘాట్లకు మందులు సరఫరా చేశారు. జిల్లాలో ఉన్న 52పుష్కర ఘాట్లకు దాదాపు రూ.80లక్షల మందులను కొనుగోలుచేసినట్లు తెలిపారు. పుష్కర ఘాట్లలో వైద్య ఆరోగ్యశాఖ నుంచి 640మంది వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంచారు. ముఖ్యమైన ఘాట్లలో తాత్కాలిక 10పడకల ఆస్పత్రులను ఏర్పాటుచేశారు. పుష్కర విధుల కోసం ప్రభుత్వ వైద్యులతో పాటు ఆరోగ్య శ్రీ అమలవుతున్న ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు పనిచేస్తున్నారు. పుష్కరాల కోసం 18రకాల మందులను భక్తుల కోసం ఉపయోగించనున్నారు. -
నేటితో ముగియనున్న అంత్య పర్వం
పుష్కరుడి వీడ్కోలు సంబరానికి సీఎం ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం పదకొండోరోజు పుష్కరఘాట్‌కు పోటెత్తిన భక్తులు సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి నదీతీరంలో 11 రోజులపాటు ఉత్సవంలా సాగిన అంత్యపుష్కరాలకు గురువారంతో తెరపడనుంది. గురువారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవులో హారతి కార్యక్రమం అనంతరం అంత్యపుష్కరాలు ముగియనున్నాయి. ముగింపు రోజు పుష్కరుడికి వీడ్కోలు పలికేందుకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ పుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో పదో రోజు రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌కు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ రాత్రి ఏడు గంటల వరకు 51వేల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఘాట్ వద్ద కూడలిలో వాహనాల రద్దీ పెరిగింది. జిల్లా మొత్తంమీద 85,652 మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు. అంతర్వేది, అయినవిల్లి, జొన్నాడ, కోటిపల్లి తదతర ఘాట్లకు భక్తులు వెళ్లారు. ఉభయ గోదావరితోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల యాత్రికులు తరలివచ్చారు. చివరిరోజు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఒడిసా భక్తుల తాకిడి పెద్దగా లేదు. పూరి జగన్నాథ రథయాత్ర అంత్యపుష్కరాలకు ముందే జరగడంతో ఒడిసా నుంచి భక్తులు పెద్దగా రాలేదని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. జగన్నాథ రథయాత్ర ముగియడంతో అంత్యపుష్కరాలు కూడా ముగిసినట్లుగా వారు భావిస్తారని చెబుతున్నారు. అర్బన్ ఎస్పీ రాజకుమారి ఘాట్ల వద్ద భద్రను పరిశీలించి సిబ్బందికి సూచన లిచ్చారు. కంట్రోల్ రూమ్ నుంచి నోడల్ అధికారి ఘాట్లలో ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఘనంగా ముగింపు వేడుకలు... అంత్యపుష్కరాలను ఘనంగా ముగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సరస్వతీ ఘాట్ నుంచి పుష్కరఘాట్ వరకు చిన్నారులతో ప్రదర్శన నిర్వహించనున్నారు. సాయంత్రం పుష్కరఘాట్ వద్ద ఆధ్యాత్మిక, సాంసృ్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి హారతి కార్యక్రమం అనంతరం 108 మంది ముల్తైదువులు నదిలో దీపాలను వదిలి పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. దేవాదాయ శాఖ తరఫున జిల్లాలోని అనవ్నవరం, అయినవిల్లి పుణ్య క్షేత్రాల ప్రసాదాలను భక్తులకు ఉచితంగా పంచిపెట్టనున్నట్లు ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డీవీఎల్ రమేష్‌బాబు తెలిపారు. ఇందుకోసం పుష్కరఘాట్ బయట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యంత్రాంగం అప్రమత్తం ముగింపు వేడుకలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతోపాటు సీఎం చంద్రబాబు వస్తుండడంతో పుష్కరఘాట్ వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు రాకపోకలకు ప్రత్యేక మార్గాలను నిర్ణయించారు. గురువారం సాయంత్రం హారతి కార్యక్రమానికి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయకుమార్, సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణన్ హాజరై ఏర్పాట్లను పరిశీలించారు. హారతి కార్యక్రమానికి మేయర్ పంతంరజనీ శేషసాయి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విచ్చేశారు. -
మాటలే.... చేతల్లేవ్....!
ఆది పుష్కరాల ముగింపులో రాజమహేంద్రవరంపై సీఎం వరాల జల్లు అంత్య పుష్కరాలు ముగుస్తున్నా అమలు ఊసేలేదు పుష్కరుడికి వీడ్కోలు పలికేందుకు నేడు సీఎం చంద్రబాబు రాక ఆశల చిగుళ్లతో బాబు ముందుకు నగర ప్రజలు సాక్షి, రాజమహేంద్రవరం : గతేడాది గోదావరి పుష్కరాల ముగింపు రోజున రాజమహేంద్రవరం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించిన హామీలు ఏడాది తరువాత కూడా వెక్కిరిస్తున్నాయి. ప్రణాళిక దశలోనే ‘అఖండ గోదావరి’ రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామని అఖండ గోదావరి ప్రాజెక్టును ప్రకటించగా ప్రస్తుతం అది ప్రతిపాదనల దశలోనే ఉంది. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ రూ.100 కోట్లు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆ పనులు ఎండమావులవుతున్నాయి. తాగునీరేదీ? 10వ డివిజన్ గాయత్రి నగర్లో రూ.40 కోట్ల అంచనాతో మంచినీటి ట్యాంకు, మెయిన్ పంపింగ్ వ్యవస్థ ఏర్పాటుకు నగర కన్వెన్షన్ సెంటర్‌తోపాటు శంకుస్థాపన చేశారు. ఆ పనులు ఊరిస్తూనే ఉన్నాయి. పేరు మారినా తీరు మారలేదు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చారు. మెగా సిటీగా, ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. ఏడాదైనా పేరు గొప్ప ఊరు దిబ్బలాగే నగరం తీరు మారింది. గట్టిగా వర్షం పడితే రోడ్లు గోదావరి కాలువలను తలపిస్తాయి. జనాభా పెరిగినా ఇప్పటికీ బ్రిటిషు కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థే దిక్కు. మెయిన్ రోడ్డు, తాడితోట, శ్యామలా సెంటర్ ప్రాంతాల్లో ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ సమస్యలు. శిలాఫలకంలోనే నగర కన్వెన్షన్ సెంటర్... నగర కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి 2015 మే ఒకటో తేదీన రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో శంకుస్థాపన చేశారు. సెంట్రల్ జైలు ఎదుట ఆరు ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్మించడానికి నిర్ణయించారు. ఇందులో ఫుడ్ కోర్టులు, సమావేశ మందిరం, మల్టిప్లెక్స్ థియేటర్ నిర్మిస్తామన్నారు. ఈ ప్రతిపాదనలు ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. ఇదే ప్రాంతంలో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇది కూడా హామీలకే పరిమితమైంది. కందుకూరికీ తప్పని హామీ మోసం సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు నిర్మించిన పుర మందిరానికి పూర్వవైభవం తెస్తానని సీఎం ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు. పురమందిరం(టౌన్ హాలు)ను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ఆ సందర్భంగా చెప్పారు. ఈ మాట చెప్పి ఏడాది కాలం గడుస్తున్నా నేటì కీ అతీ గతీ లేదు. పురమందిరం పూర్తిగా శిథిలమైంది. అలాగే కందుకూరి పేరుతో ఉన్న వీటీ కాలేజీని, గౌతమీ గ్రంథాలయం, దామోదర ఆర్ట్స్ గ్యాలరీని అభివృద్ధి చేస్తామని ప్రకటించి మరిచిపోయారు. గుర్తు చేయాల్సిన తెలుగు తమ్ముళ్లూ గజనీ వేషాలు వేస్తున్నారు. గోదావరి మహా పుష్కర వనానికి మోక్షమెప్పుడు? గోదావరి మహాపుష్కరాలు గుర్తుండేలా లాలా చెరువు సమీపంలో 240 ఎకరాల్లో మహాపుష్కర వనానికి 2015 జూలై 26న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 30 రోజుల్లో దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. మహాపుష్కరాల పైలాన్‌కు కూడా ఆవిష్కరించారు. అంతకు మించి వనంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ వనంలోనే సైన్సు విద్యార్థులకు ఉపయోగపడేలా బొటానికల్ గార్డెన్, ‘రాశి’ వనం దశ తికగలేదు. -
ఎమ్మెల్సీ బాలసాని దంపతుల పుష్కరస్నానం
భద్రాచలం గోదావరి స్నానఘట్టాల రేవులో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బుధవారం సతీ సమేతంగా పుష్కర స్నానమాచరించారు. తీరంలో ప్రత్యేక పూజలనంతరం ఆయన స్నానం చేసి రామాలయాన్ని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ తాయారు అమ్మవారు, అభయాంజనేయస్వామి వారి ఆలయాలనూ దర్శించుకున్నారు. ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, టీఆర్‌ఎస్‌నియోజకవర్గ ఇన్చార్జ్ మానె రామకృష్ణ, యశోద నగేష్ తదితరులు ఎమ్మెల్సీ వెంట ఉన్నారు. – భద్రాచలం -
వేయిమంది గజ ఈతగాళ్లు
అలంపూర్ : జిల్లాలోని ప్రధాన ఘాట్ల వద్ద వేయిమంది గజ ఈతగాళ్లను నియమిస్తునట్టు మత్స్య శాఖ ఏడీ ఖదీర్‌అహ్మద్ అన్నారు. మంగళవారం అలంపూర్ మండలం గొందిమల్లలోని జోగుళాంబ ఘాట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్ణా పుష్కరాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అదనంగా వందమందిని ఎంపిక చేశామన్నారు. వీరికి 400లైఫ్ జాకెట్స్, 200లైఫ్‌బాయ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన ఘాట్ల వద్ద పది బోట్లు అందుబాటులో ఉంటాయన్నారు. సోమశిల, మంచాలకట్ట, బీచుపల్లి, రంగాపురం, గొందిమల్ల, క్యాతూర్lఘాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామన్నారు. పుష్కరాలకు వందమంది మత్స్య శాఖ సిబ్బంది అవసరం ఉంటుందన్నారు. జోగుళాంబ ఘాట్ వద్ద బోటు, తెప్ప ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ 30మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారన్నారు. -
పుష్కర దర్శనం
అలంపూర్‌రూరల్: జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలకు పుష్కరశోభ సంతరించుకుంది. పుష్కరస్నానం చేసిన భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు. ఇందుకోసం కష్ణానది తీరంలో 32ఘాట్ల వద్ద 32ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. ఇందులో మాగనూరు మండలం తంగడిలోని శ్రీ వల్లభేశ్వరస్వామి ఆలయం, కష్ణ గ్రామంలో దత్తాత్రేయ ఆలయం, కష్ణా రైల్వే బ్రిడ్జి సమీపంలో శ్రీ క్షీరలింగేశ్వర స్వామి ఆలయం, గూడెబల్లూరులోని స్వయంభూ లక్ష్మి వేంకటేశ్వరస్వామి, మక్తల్ మండలంలోని పంచదేవ్‌పహాడ్ (దత్తాత్రేయస్వామి), పారేవుల (శ్రీశంకరలింగేశ్వరస్వామి), ఆత్మకూరు మండలం నందిమల్ల (శివాలయం), మూలమల్ల (శ్రీఆంజనేయస్వామి), జూరాల (పాత శివాలయం), పెబ్బేరు మండలంలోని రంగాపూర్(రంగనాయకస్వామి), ఇటిక్యాల మండలం బీచుపల్లి (శ్రీ ఆంజనేయస్వామి), వీపనగండ్ల మండలం పెద్దమారూరు (ఈశ్వర ఆలయం), చర్లపాడు (శివాలయం), జటప్రోలు (మదన గోపాలస్వామి ఆలయం, అగస్తేశ్వర ఆలయం), కొల్లాపూర్ మండలంలోని మంచాలకట్ట (శ్రీరామతీర్థస్వామి ఆలయం), సోమశిల (లలిత సోమేశ్వరస్వామి ఆలయం), అమరగిరి (అమరేశ్వరస్వామి ఆలయం), ధరూర్ మండలంలోని ఉప్పేరు (శివ ఆంజనేయస్వామి ఆలయం), రేవులపల్లి (శివాంజనేయస్వామి), పెద్దచింతరేవుల(ఆంజనేయస్వామి ఆలయం), రేకులపల్లి (అభయాంజనేయస్వామి), గద్వాల మండలం నది అగ్రహారం(రామావదూత మఠం), బీరెల్లి (చెన్నకేశవస్వామి ఆలయం), అలంపూర్ జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం, క్యాతూరులో వెంకటేశ్వరస్వామి ఆలయం, అమ్రాబాద్ మండలం పాతాళగంగ దత్తాత్రేయస్వామి ఆలయాల్లో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శిల్పకళా నిలయం రంగనాథ ఆలయం శ్రీరంగాపూర్ ఆలయం జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. అద్భుతమైన శిల్పసంపదతో పాటు ఎంతో విలువైన అపురూప చిత్రపటాలు ఇక్కడ ఉన్నాయి. రంగసముద్రం చెరువు ఒడ్డున గరుడాద్రి మీద రంగనాయకస్వామి ఆలయం నిర్మించడంతో కొర్విపాడు గ్రామం శ్రీరంగాపూర్‌గా మారింది. కొర్విపాడు(నేటి శ్రీరంగాపూర్)లో సూగూరు (వనపర్తి) సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు(క్రీ.శ.1670) కాలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఐదోశక్తి పీఠం జోగుళాంబ నవబ్రహ్మల క్షేత్రంగా విరాజిల్లుతున్న అలంపూర్ ఆలయాల్లో శ్రీ జోగుళాంబ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠంగా విరాజిల్లుతోంది. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ జరిపినట్లు పురాణం చెబుతోంది. 1400ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాలను బాదమీ చాళుక్యుల కాలంలో రెండో పులకేశి నిర్మించారు. గ్రామ దేవతను మొదలుకుని పార్వతి, పరమేశ్వరుyì వరకు ముక్కోటి దేవతలను అలంపూర్‌లో దర్శించవచ్చు. ప్రస్తుతం అలంపూర్ ఆలయాలు జిల్లాకే గర్వకారణంగా నిలిచాయి. సోమశిలలో సోమేశ్వరుడి ఆలయం కొల్లాపురం మండలంలోని సోమశిలలో శ్రీలలిత సోమేశ్వరుడి దర్శనం కలుగుతుంది. 7వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాలతో పాటుగా జ్యోతిర్లింగాలయాలను అతి సుందరంగా నిర్మించారు. ప్రస్తుతం వీటిని పర్యాటక శాఖ అభివద్ధి చేస్తుంది. ప్రతి సోమవారం ఈ క్షేత్రంలో విశేష పూజలు జరుగుతాయి. బీచుపల్లి అభయాంజనేయుడు కొలిచినంతనే కొండంత అండగా మనోధైర్యాన్ని ప్రసాదించే దైవం బీచుపల్లి ఆంజనేయస్వామి. కష్ణా తీరాన వ్యాసరాయుల ప్రతిషి్ఠంచిన ఆంజనేయుడు జిల్లావాసులకే కాక ఇరు రాష్ట్రాల భక్తులకు ఆరాధ్యదైవం. బోయవారి చేత ప్రతి నిత్యం స్వామివారు సంప్రదాయరీతిలో పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రంలో ఇటీవల సర స్వతి, హయగ్రీవ, రామాలయాలు నిర్మించారు. ఇక్కడి ఆలయాల్లో వైష్ణ ఆగమ సంప్రదాయ రీతిలో పూజలు జరుగుతున్నాయి. ఆనాటి జటాయిపురమే జటప్రోల్ వీపనగండ్ల: జటప్రోల్లో వెలసిన దేవాలయాలు శిల్పకళకు నిలయం. రావణుడు సీతాదేవిని లంకకు ఎత్తుకెళుతున్న సమయంలో జటాయువు అనే ప„ì ఎదిరించింది. రావణుడు ఆ పక్షిని వధించాడని, అందుకు గుర్తుగా జటేశ్వర క్షేత్రం వెలసిందని, కాలక్రమేణా ఇది జటప్రోల్గా మారినట్లు పురాణం చెబుతోంది. ప్రధాన ఆలయాల్లో ప్రసిద్ధి చెందిన మదనగోపాలస్వామి ఆలయంతో పాటు 16వ శతాబ్దానికి చెందిన 21 అగస్తేశ్వరుల ఆలయాలు కూడా ఉన్నాయి. మదనగోపాలస్వామి గోపుర ఆలయాన్ని వల్లభరాయుడు అనేరాజు కట్టించారని, ఈ గోపురంపై జటాయువు పక్షులు, కోతులను, పెద్ద పెద్ద జడలు గల రుషుల విగ్రహాలను మలిచారు. అగస్తేశ్వర ఆలయంతో పాటు జటేశ్వర ఆలయం, భ్రమరాంబ, మల్లేశ్వర ఆలయం, వీర భద్రాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, తదితర 21ఆలయాలు ఇక్కడ వెలిశాయి. -
కృష్ణా పుష్కరాలకు 275 ప్రత్యేక బస్సులు
రాజమహేంద్రవరం సిటీ : కృష్ణా పుష్కరాలకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఈ నెల 12 మొదలు 275 ప్రత్యేక బస్సులు సా«ధారణ టిక్కెట్ ధరలతో నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవ రం ఆర్ఎం కార్యాలయంలో కృష్ణా పుష్కరాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నం నుంచి 100, విజయనగరం, శ్రీకాకుళం నుంచి 100, తూర్పుగోదావరి నుంచి 75 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. ఇవి విజయవాడలోని వైవీ రావ్ ఎస్టేట్ నుంచి రాకపోకలు సాగిస్తాయన్నారు. భక్తుల రద్దీ మేరకు వీటి సంఖ్య పెంచుతామన్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి వెళ్లే బస్సులు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి రాకపోకలు సాగిస్తాయన్నారు. బస్సులు ఆగే ప్రాంతాల్లో పుష్కరనగర్లు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల బస్సులు నడపడం ద్వారా రూ.40 కోట్ల ఆదాయం లభించవచ్చని తెలిపారు. ఆయా బస్సుల్లో జీపీఎస్ విధానం ఏర్పాటు చేశామని డ్రీమ్స్‌స్టెప్ సీఈఓ అనీల్ తెలిపారు. ఆర్ఎం చింతారవికుమార్, డిప్యూటీ సీటీఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు. తరలివెళ్లిన పోలీసులు రాజమహేంద్రవరం క్రైం : కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించడానికి రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లా నుంచి 750 మంది పోలీసులు బయలుదేరి వెళ్లారు. గోదావరి అంత్య పుష్కరాలు 11తో ముగియనున్నందున, 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాల్లో వీరు విధులకు హాజరవుతారు. -
అసంపూర్తి..అస్తవ్యస్తం
–కొనసా...గుతున్న పుష్కరఘాట్ల పనులు –గడువు మరో నాలుగు రోజులే –నాణ్యతకు తిలోదకాలిస్తున్న కాంట్రాక్టర్లు –వర్షాలకు –మట్టికొట్టుకుపోతున్న రోడ్లు గడువుల మీద గడువులు దాటిపోతున్నాయి. పనులు మాత్రం నత్తకు నడకలు నేర్పుతున్నాయి. జిల్లాలోని 52 ఘాట్లలో ఎక్కడా పూర్తిస్థాయిలో పనులు కాలేదు. పుష్కరాలు 12వ తేదీన ప్రారంభంకానున్నాయి. గడువు ముంచుకొస్తుండడంతో కాంట్రాక్టర్లు పైపై పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఓ వైపు కష్ణమ్మ పవరళ్లు తొక్కుతోంది. పుష్కరఘాట్ల మీదుగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులు జిల్లాలోని ఘాట్లకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు పనులు ఏ మేరకు జరిగాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఆదివారం పలు ఘాట్లను విజిట్ చేసింది. అనేకచోట్ల కొనసాగుతున్న ఘాట్ల పనులు. పునాదులు దాటని మరుగుదొడ్లు.. చిన్న జల్లులకు మట్టికొట్టుకుపోయిన రోడ్లు.,.కొన్ని చోట్ల ప్రారంభించని పార్కింగ్ పనులు..ఇవీ.. కనిపించిన దశ్యాలు. పుష్కరాలకు మరో నాలుగు రోజులే గడువు ఉంది. ఈలోగా పనులు ఎలా పూర్తిచేస్తారన్నది అటు కాంట్రాక్టర్లు.. ఇటు అధికారులకే తెలియాలి. హడావుడిగా పనులు పెబ్బేరు : ఎలాగైనా గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో మండలంలో కాంట్రాక్టర్లు హడావిడి పనులు చేస్తూ కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారు. శ్రీరంగాపూర్ వీఐపీ ఘాట్ వద్ద రూ.6.2కోట్లతో చేపడుతున్న ఇంకా మరుగుదొడ్లు, తాగునీటి పనులు, దుస్తులు మార్చుకునే గదులు, సీసీబెడ్ నిర్మాణాలు పూర్తికానేలేదు. రూ.2.8కోట్లతో ఏర్పాటు చేస్తున్న వాహనాల పార్కింగ్ పనులు పూర్తి కాలేదు. ఇక్కడ నల్లరేగడి భూములు ఉండడంతో పార్కింగ్ చేసే స్థలంలో మట్టిని తీసివేసి ఎర్రమట్టితో నింపి రోలింగ్ చేయాల్సి ఉంది. కానీ నది పక్కనే ఉన్న సుద్దమట్టిని పరిచి రోలింగ్ చేస్తున్నారు. అలాగే మునగమాన్ దిన్నె పుష్కరఘాట్ వద్ద పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. బీటీ రోడ్డు పనులు పూర్తి కాలేదు. తాగునీటి, మరుగుదొడ్ల పనులు సైతం పునాదుల్లోనే ఉన్నాయి. రంగాపూర్ నుంచి జనుంపల్లి మీదుగా వేసిన బీటీ వారానికే దెబ్బతింది. జనుంపల్లి నుంచి మునగమాన్‌దిన్నె ఘాట్‌వద్దకు వేస్తున్న బీటీ రోడ్డులో నాణ్యత కరువైంది. కొన...సాగుతున్న పనులు అలంపూర్ : మండలంలోని గొందిమల్ల పుష్కర ఘాట్ వద్ద పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీఐపీ పుష్కర ఘాట్‌కు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం పిండ ప్రదానాల స్థలం, దుస్తులు మార్చుకునే గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర పనులు పూర్తి కాలేదు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో రూ.9.5 లక్షలతో గొందిమల్ల ఘాట్ వద్ద 48మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మిస్తున్నారు. ఇక్కడ షెడ్లు పూర్తయినా నీటి పైపులైన్, ఇతర పనులు జరగాల్సి ఉంది. రూ.18 లక్షలతో తాగునీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్లకు ఇరువైపు నీటి ట్యాంకులు ఏర్పాటుచేశారు. వాటికి రంగులు వేయడం, కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. పుష్కర ఘాట్ వద్ద వాహనాలు, ఆర్టీసీ బస్సుల కోసం రూ.1.5కోట్లతో పార్కింగ్ పనులు జరుగుతున్నాయి. లో–లెవల్ ఘాట్ పనులు కొలిక్కి వచ్చినా, హై–లెవల్ ఘాట్ పూర్తి కాలేదు. మరో రెండు రోజుల్లో పనులన్నీ పూర్తి చేయిస్తామని ఏఈలు రవికుమార్, శ్రీనివాసులు తెలిపారు. నిఘా లోపం... దగా అధికం.. నది అగ్రహారం దగ్గర జరుగుతున్న పుష్కర పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ల లాభాపేక్ష, అధికారుల నిఘాలోపం ఫలితంగా అనేక అభివద్ధి పనుల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మితిమీరిన రాజకీయ జోక్యంతో కాంట్రాక్టర్లు నాణ్యతను ఏకోశాన పట్టించుకోలేదు. రక్షణ కడ్డీలు కొన్నిచోట్ల ప్రారంభం కాకుండానే విరిగిపోయాయి. మరికొన్ని చోట్ల నీటి ఉధతికి కొట్టుకుపోయాయి. పిండప్రదానం చేసే ఘాట్ పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం ఊసేలేదు. తాగునీటి వసతి సింటెక్స్ ట్యాంకుల ఏర్పాటు కోసం దిమ్మెల నిర్మాణం నాసిరకంగా సాగుతుంది. రెండుచోట్ల మాత్రమే కుళాయిలు బిగించారు. ఆలయాల అభివద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యుత్ స్తంభాల ఏర్పాటు కొనసాగుతుంది. పార్కింగ్ స్థలాల్లో ఏర్పాటు చేసే మట్టి రోడ్లు నామమాత్రంగా ఉన్నాయి. దుస్తులు మార్చుకోవడానికి ఇప్పటి వరకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు జరగలేదు. ప్రణాళికలకు పాతర మాగనూర్ : మండలంలోని వాసునగర్, కష్ణ, తంగిడి, ముడుమాల్ గ్రామాల్లోని పుష్కరఘాట్ల నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం జరగడంలేదు. ఘాట్లకు వచ్చే భక్తుల రాకపోకలకు రోడ్ల నిర్మాణాలను గతనెల క్రితమే చేపట్టినా అవి నేటికీ పూర్తికాలేదు. మిగిలిన నాలుగు రోజుల్లో పనులు పూర్తికాకుంటే వేలాదిగా వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. నల్లగట్టు – కష్ణ, అలాగే కష్ణ – తంగిడి వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు, చెక్‌పోస్టు–వాసునగర్ సీసీ రోడ్డు, కష్ణ నుంచి పుష్కరఘాట్వెళ్లే తాత్కాలిక పనులు పూర్తికాలేదు. అలాగే తాగునీరు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ స్థలాల పనులుకూడా ఈ నాలుగు రోజుల్లో పూర్తయ్యేలా కనిపించడంలేదు. అసలు భక్తులు ఎక్కువగా ఉండేచోట కాకుండగా ఎక్కడ పడితే అక్కడ నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు సూచించినా కాంట్రాక్టర్లు పెడచెవిన పెట్టారు. -
పుష్కరఘాట్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయండి
జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సంగమేశ్వరం(కొత్తపల్లి): సంగమేశ్వరంలో పుష్కరఘాట్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కపిలేశ్వరంలో అన్నిశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతుండటంతో దిగువప్రాంతాల్లోని పుష్కరఘాట్లు మునిగి అవకాశం ఉందన్నారు. దీన్ని దష్టిలో పెట్టుకొని ఎగువప్రాంతాల్లోని పుష్కరఘాట్లను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద మరుగుదొడ్లు, దుస్తువుల మార్చుకునేందుకు గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాల కోసం పార్కింVŠ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఆయన సంగమేశ్వరంలో జరుగుతున్న పుష్కర పనులను పరిశీలించారు. ఎగువప్రాంతం నుంచి వరద ఉద్ధతి తగ్గకపోతే∙రెండు రోజుల్లో సంగమేశ్వరం గుడి మునిగిపోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జేసీ హరికిరణ్, ప్రత్యేక కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆర్డీఓ రఘుబాబు, అడిషనల్ ఎస్పీ చంద్రశేఖరరెడ్డి, తహసీల్దారు నరసింహులు, సీఐ దివాకర్‌రెడ్డి, ఎసై ్స శివశంకర్‌నాయక్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
రూట్ మ్యాప్ ఖరారు
విజయవాడ : కృష్ణా పుష్కర యాత్రీకుల సౌకర్యార్థం అధికారులు రూట్ మ్యాప్‌లు ఖరారు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సులభంగా ఘాట్లకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు, దేవాలయాలకు వెళ్లేందుకు వీలుగా ఈ ర్యూట్ మ్యాప్‌లు రూపొందించారు. ఈ రూట్ మ్యాప్‌లను నగరపాలక సంస్థ అధికారులు విజయవాడకు నలువైపులా, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేశారు. జాతీయ రహదారులు, ప్రధాన మార్గాల్లో వచ్చే యాత్రికులు ఎలా వెళ్లాలి... ఎక్కడ పుష్కరనగర్లు ఉన్నాయి.. ఏయే ప్రాంతాల్లో ఎటువంటి వసతులు ఉన్నాయి... తదితర వివరాలను ఆ మ్యాప్‌లలో వివరించారు. రూట్ మ్యాప్‌ల ఏర్పాటు ఇలా.. – ఏలూరు నుంచి వచ్చే భక్తులు నగరంలోకి ప్రవేశించగానే కనిపించే విధంగా రామరవప్పాడు రింగ్ వద్ద రూట్ మ్యాప్ బోర్డులు ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లే మార్గాలను యారో మార్కుల ద్వారా సూచించారు. ఆ తర్వాత అదే రూట్లో వచ్చే వారికి కనిపించే విధంగా ప్రభుత్వాస్పత్రి జంక్షన్ వద్ద మరో రూట్ మ్యాప్‌ను పెట్టారు. అదే మార్గంలో రమేష్ ఆస్పత్రి జంక్షన్, బెంజిసర్కిల్ వద్ద కూడా రూట్ మ్యాప్‌లు ఏర్పాటుచేశారు. – మచిలీపట్నం వైపు నుంచి 65వ నంబరు జాతీయ రహదారిలో వచ్చే భక్తులకు తెలిసేలా సిటీ జంక్షన్లో రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. – జాతీయ రహదారి మీదుగా గుంటూరు వైపు నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం కనకదుర్గ వారధి వద్ద రూట్ మ్యాప్‌లు పెట్టారు. ప్రకాశం బ్యారేజీ వద్దకు వెళ్లకుండానే ఘాట్లకు చేరుకునే విధంగా మ్యాప్‌ను రూపొందించారు. – హైదరాబాద్ నుంచి జాతీయ రహదారి మీదుగా వచ్చే వారికి అర్థమయ్యే విధంగా ఇబ్రహీంపట్నం జంక్షన్ వద్ద రూట్ మ్యాప్ ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ఎవరు ఏ ఘాట్లకు వెళ్లాలి... ఎలా చేరుకోవాలి... నగరంలో చూడదగిన ప్రదేశాలకు ఎలా వెళ్లాలి.. అనే వివరాలను ఆ రూట్æమ్యాప్‌లో వివరించారు. -
అంత్యం ఆర్భాటం
29కి ఏర్పాట్లు పూర్తి 30న ట్రయల్ రన్ ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణలు ముగింపు రోజున సీఎం రాక సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి అంత్యపుష్కరాలు ఈ నెల 31వ తేదీన ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 29 నాటికి అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతో యంత్రాంగం పనిచేస్తోంది. 30వ తేదీ ఉదయం 7 గంటలకు ట్రయల్ రన్ నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్ని శాఖల అధికారులు, ఎన్జీవో సంస్థలతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లు జరుగుతున్న తీరు, ఇంకా చేయాల్సిన పనులపై చర్చించారు. అంతకు ముందు కలెక్టర్ అధికారలతో కలిసి ఘాట్ల వద్ద జరుతున్న పనులను పరిశీలించారు. ఇతర ప్రాంతాల భక్తులు కోటిలింగాల ఘాట్‌కు.. బయటి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను కోటిలింగాల ఘాట్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి ఎంత మంది భక్తులు వస్తారో తెలుసుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నారు. 800 మంది ఎన్జీవోల సేవలను ఉపయోగించుకోన్నారు. నిషేధిత ఘాట్లలోకి కూడా భక్తులు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సీసీ కెమేరాలతో.. నగరంలోని అన్ని ఘాట్లలో నగరపాలక సంస్థ సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తోంది. రూ.2 లక్షలతో 40 సీసీ కెమెరాలు కొనుగోలు చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు నగరపాలక సంస్థ, పోలీసు అతిథి గృహంలో పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఘాట్లలోనికి వెళ్లలేని వృద్ధులు, వికలాంగుల కోసం జల్లు స్నానం ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయాల్లో.. ఘాట్ల వద్ద ఉన్న దేవాలయాలనుప్రతి రోజూ పూలు, పచ్చటి తోరణాలతో అలంకరించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించనుంది. ఉచిత ప్రసాదాలు అందించనుంది. 12 రోజుల పాటు నిత్య హారతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పిండ ప్రదానాల సామాగ్రి కోసం అధికారులు ఘాట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వేదఘోష నడుమ ముగింపు వేడుకలు... అంత్యపుష్కరాలకు ఘనంగా ముగింపు పలికేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. చివరి రోజు సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో ఉన్న వేదపండితులందరినీ పుష్కరఘాట్‌కు ఆహ్వానిస్తున్నారు. ఈ సమయంలో ముల్తైదువలు అరటి దొప్పలతో దీపాలను వదిలేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. -
అంత్యపుష్కరాల్లో నిరంతర వైద్య సేవలు
ఘాట్లలో వైద్య శిబిరాలు, మొబైల్ అంబులెన్స్‌లు జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు : టి.రమేష్‌కిషోర్ సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి అంత్య పుష్కరాల్లో భక్తులకు 12 రోజుల పాటు నిరంతరం వైద్య సేవలు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాజమహేంద్రవరం నగరంలో ఎంపిక చేసిన ఎనిమిది ఘాట్ల వద్ద 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒడిశా, bè త్తీస్‌గఢ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్టుగా జిల్లా వైద్యాఆరోగ్యశాఖ, రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌లు ఏర్పాట్లు చేస్తున్నాయి. ∙నగరంలోని కోటిలింగాల ఘాట్, పుష్కరఘాట్, మార్కండేయస్వామి ఘాట్, గౌతమి ఘాట్ల వద్ద జిల్లా వైద్యఆరోగ్యశాఖ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. ఒక్కో శిబిరంలో వైద్యుడితోపాటు సిబ్బంది భక్తులకు వైద్య సేవలందించనున్నారు. వీరితోపాటు ఆయా ఘాట్లలో రెండు మొబైల్ అంబులెన్స్‌ల ద్వారా నిరంతర సేవలు కొనసాగనున్నాయి. ఒక్కో వాహనంలో నలుగురు వైద్యులతోపాటు ముగ్గురు సిబ్బంది ఉంటారు. ∙ జిల్లా ఆస్పత్రిలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా 15 బెడ్లతో రెండు వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ ఓపీతోపాటు అంత్య పుష్కరాలు జరిగే 12 రోజులు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా మరో ఓపీ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. భక్తులను ఆస్పత్రికి తీసుకొచ్చేందుకు ఒక అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. వీఐపీలకు వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రిలో ఓ వైద్య బృందాన్ని నియమించనున్నారు. ∙స్థానికంగా ఉన్న వైద్యులతోపాటు కాకినాడ జీజీహె చ్ నుంచి రెండు వైద్య బృందాలు సేవలందించనున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల సేవలను ఉపయోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అంత్యపుష్కరాల నేపథ్యంలో కావాల్సిన మందులు తెప్పించుకున్నామని రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిషోర్ తెలిపారు. భక్తులకు నిరంతరం వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా రెండు వార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక వైద్యులతోపాటు కాకినాడ, అవసరమైతే స్థానిక ప్రైవేటు వైద్యుల సేవలు వినియోగించుకోనున్నట్లు వివరించారు. -
కృష్ణ..కృష్ణా!
భద్రత గాలికి.. – స్వయంగా ఎస్పీ సూచనలూ మినిట్స్‌లో చేరని వైనం – పదే పదే హెచ్చరించినా పట్టించుకోని పరిస్థితి – ఘటనా స్థలాన్ని పరిశీలించిన జీఎస్ఐ టీం – రక్షణ గోడ, ఐరన్‌మెష్ ఏర్పాటు చేయాలని అభిప్రాయం? – త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశం సాక్షి ప్రతినిధి, కర్నూలు: కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల భద్రతను గాలికి వదిలేసినట్టు తెలుస్తోంది. స్వయంగా జిల్లా పోలీస్ బాస్(ఎస్పీ) చేసిన సూచనలను, ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా పాతాళగంగ ఘాట్‌కు వెళ్లే మార్గంలో చేపడుతున్న పనులతో పాటు ఘాట్ల వద్ద భక్తుల సౌకర్యాలు.. ఏదైనా అనుకోని ఘటన జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఆయన చేసిన సూచనలను విస్మరించినట్లు సమాచారం. ఫలితంగా ఇప్పటికే కొండచరియలు విరిగిపడి అదష్టవశాత్తూ ఎవ్వరికీ ప్రమాదం జరగలేదు కానీ.. రానున్న రోజుల్లోనూ ఇదే తరహా పరిస్థితి కొనసాగితే మాత్రం పుష్కర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు స్వయంగా ఎస్పీ చేసిన సూచనలను కూడా సమావేశపు వివరాల నమోదు ప్రక్రియ(మినిట్స్)లో చోటు కల్పించలేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏ తరహాలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్పీ చేసిన సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలోనూ అధికారులు విఫలమవుతున్నారు. మరోవైపు కొండచరియలు విరిగి పడిన ప్రదేశాన్ని డీఐజీ కూడా మంగళవారం సందర్శించారు. ఇక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) నుంచి కూడా ప్రత్యేకంగా ఒక నిపుణుల బందం వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించింది. రక్షణగోడను నిర్మించాల్సిందే.. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) నుంచి కూడా నిపుణులతో కూడిన ఒక టీం వచ్చి శ్రీశైలంలోని పాతాళగంగ ఘాట్‌కు వెళ్లే దారిలో కొండచరియలు విరిగి పడిన ప్రదేశాన్ని మంగళవారం సందర్శించింది. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి? ఏం చేయాలని అంశాలపై వెంటనే నివేదిక అందజేయనున్నట్టు తెలిసింది. ప్రధానంగా ఈ కొండ చరియల ప్రాంతంలో కొద్ది భాగం వరకు రక్షిత గోడను(వాల్) నిర్మించాలని.. మరికొద్ది ప్రాంతం వరకు ఐరన్‌మెష్ ఏర్పాటు చేయాలని జీఎస్ఐ టీం కూడా ప్రాథమికంగా అభిప్రాయపడినట్టు సమాచారం. లేనిపక్షంలో ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని జీఎస్ఐ ప్రతినిధి బృందం కూడా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రధానంగా ఆగస్టులో జరిగే పుష్కరాల సందర్భంగా భారీ వర్షాలు వస్తే కొండచరియలు విరిగేపడే ఘటనలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే రక్షణగోడ నిర్మాణంతో పాటు ఐరన్‌మెష్ ఏర్పాటు పనులను ప్రారంభించాలని సూచించనున్నట్టు సమాచారం. ఎస్పీ సూచనలు కొన్ని.. వాస్తవానికి పుష్కరాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుమారు 25 అంశాలను పలు సమావేశాల్లో జిల్లా పోలీసు సూపరింటెండెంట్(ఎస్పీ) ఆకే రవికష్ణ పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా.. – కొండచరియలు విరిగిపడకుండా రక్షణగోడ, ఐరన్‌మెష్ ఏర్పాటు చేయాలి. – పాతాళగంగకు వెళ్లేందుకు ఉపయోగించే రోప్‌వే కండిషన్లో ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించాలి. ఇందుకోసం ఏపీ టూరిజం అధికారులకు లేఖ రాసి కండిషన్లో ఉన్నట్టు ఒక లేఖను పొందాలి. – పాతాళగంగ వద్ద అత్యవసరంగా ఎవరైనా భక్తుడికి ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా అక్కడ రెండు అంబులెన్సులను ఏర్పాటు చేయాలి. – ఏదైనా అనుకోని ఘటన జరిగి ప్రమాదం సంభవిస్తే అత్యవసర వైద్యానికి తరలించేందుకు వీలుగా హెలీ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాయాలి. – ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చాయి. అందువల్ల ఎక్స్–రే బ్యాగేజీని ఏర్పాటు చేసుకోవాలి. – అదేవిధంగా ఆలయానికి సమీపంలోనే సామాన్లు భద్రత పరిచే గది ఉంది. దీనిని దూరంగా ఏర్పాటు చేయాలి. – ఘాట్ల వద్ద పనులను వెంటనే పూర్తి చేసి పోలీసులకు అప్పగించాలి. తద్వారా అక్కడ డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేసి భద్రత ఏర్పాట్లను పూర్తిచేస్తాం. – శ్రీశైలంలో ఏర్పాటు చేసే 30 పడకల ఆసుపత్రిలో సర్జరీ చేసే సదుపాయంతో పాటు నిపుణులైన డాక్టర్లను ఏర్పాటు చేయాలి. అధికారుల నిర్లక్ష్యం భద్రత విషయంలో ఎస్పీ చేసిన అనేక సూచనలను కనీసం సమావేశపు మినిట్స్‌లోనూ సంబంధిత అధికారులు పేర్కొనలేదంటే భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తాను సూచించిన అంశాలను మినిట్స్‌లో ఎందుకు పేర్కొనలేదో వివరణ ఇవ్వాలని శ్రీశైలంలో కొద్దిరోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ రవికృష్ణ సీరియస్ అయ్యారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా పుష్కర భక్తుల భద్రత విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నత్తనడకన పుష్కర పనులు
-
పుష్కర పనుల్లో అవినీతి
కర్నూలు(ఓల్డ్‌సిటీ): పుష్కర పనుల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య ఆరోపించారు. సోమవారం స్థానిక కళావెంకట్రావ్ భవనంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 12వ తేదీన కష్ణా పుష్కరాలు జరుగుతాయని తెలిసి కూడా హడావిడిగా పనులు ప్రారంభించారని, నామినేట్ పద్ధతిన నిధులు విడుదల కోసమే ఇలా చేశారన్నారు. జిల్లాకు రూ.250 కోట్లు తెచ్చినట్లు ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి చెబుతున్నారని, వాటిలో ఎంత ఖర్చు చేశారో వెల్లడిస్తే అవినీతి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కర్నూలులో ఈద్గా పనులు కూడా పండుగకు రెండు రోజుల ముందు మొదలు పెట్టడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్ల గోదావరి పుష్కరాల్లో అపశ్రుతి జరిగిందని, కష్ణా పుష్కరాల్లో ఎక్కడ ఏ నష్టం జరిగినా సీఎం చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పుష్కర పనులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, పీసీసీ అధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబుతో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
అంత్య పుష్కర ఘాట్లకు ఇన్చార్జుల నియామకం
కాకినాడ సిటీ: జిల్లాలో ఈనెల 31 నుంచి జరగనున్న గోదావరి అంత్య పుష్కరాలకు 12 మంది డిప్యూటీ కలెక్టర్లను ఘాట్ల ఇన్‌చార్‌్జలుగా నియమిస్తూ కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అధికారులు రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్, సబ్ కలెక్టర్ల సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎ.శ్రీరామచంద్రమూర్తిని రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్‌కు, పి.శ్రీరామచంద్రమూర్తికి పుష్కర్ ఘాట్‌కు, టీవీఎస్‌జీ కుమార్‌ను టీటీడీ ఘాట్‌కు, ఎన్.సుగుణ కుమారిని మార్కెండేయస్వామి దేవాలయం ఘాట్‌కు, ఎస్.మల్లిబాబును శారదానంద ఘాట్‌కు, ఎస్.భీమానంద్ను పద్మావతి ఘాట్‌కు ుఇన్చార్జులుగా నియమించారు. అలాగే జీవీ సత్యవాణిని సరస్వతి ఘాట్, వీవీఐపీ ఘాట్‌కు, డీఎస్ సునితాను గౌతమీ ఘాట్‌కు నియమించారు. ధవళేశ్వరం రామపాదాల రేవుకు హెచ్వీ ప్రసాద్‌రావును, కోటిపల్లి పుష్కర్ ఘాట్, కోటిపల్లి పుష్కర్ «ఘాట్–1,2లకు రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావును, దేవీపట్నంలోని పోచమ్మగండి ఘాట్‌కు డీవీఎల్‌ఎం ఎల్లారమ్మను, అంతర్వేది, వాడపల్లి, అప్పనపల్లి ఘాట్లకు ఇన్చార్జి అధికారిగా అమలాపురం ఆర్డీఓ జి.గణేష్ కుమార్‌ను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులతో సమీక్ష గోదావరి అంత్యపుష్కరాల నిర్వహించే ఎనిమిది ప్రధాన గ్రామీణ ఘాట్లలో యాత్రికుల సౌకర్యం, రక్షణ కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కోర్టు హాలులో కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి, అమలాపురం, రామచంద్రపురం ఆర్డీఓలు, ఈఓపీఆర్డీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 11 వరకూ జరిగే గోదావరి అంత్యపుష్కరాల సందర్భంగా యాత్రికులు ప్రధానంగా సందర్శించే 8 గ్రామీణ ఘాట్లలో భద్రత, సదుపాయాలను వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. -
ఏడాదైంది.. సాయం ఏదీ?
పుష్కరాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితుడు సీఎం, కలెక్టర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి రాజమహేంద్రవరం క్రైం: గత ఏడాది పుష్కరాల తొమ్మిదవ రోజున సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీ హనుమాన్ కూల్ కార్నర్ యజమాని గొర్రెల సుబ్రహ్మణ్యం కోరారు. ఆయన గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో తన గోడు వెళ్లబోసుకున్నారు. గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్దVýæల మున్సిపల్ కాంప్లెక్స్‌లో తాను నిర్వహిస్తున్న శ్రీ హనుమాన్ కూల్ కార్నర్ షాపు ç22.7.2015 రాత్రి తొమ్మిది గంటల సమయంలో సంభవించిన అగ్నిప్రమాదంలో కాలిపోయిందన్నారు. ఆ అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 1.75 లక్షల నగదు కాలి బూడిదైపోయిందని, ఫ్రిజ్‌లు, మిక్సీలు, కౌండర్లు, ఫర్నిచర్ సర్వం బూడికుప్పగా మారిందని వాపోయారు. ఆ ప్రమాదంలో సుమారు రూ. 20 లక్షల వరకూ నష్టం వాటిల్లిందన్నారు. ఆ అగ్ని ప్రమాదంలో తాను కూడా గాయాల పాలై ప్రభుత్వఆస్పత్రిలో చికిత్స పొందానని తెలిపారు. ఆ సమయంలో సంఘటన స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులను ఆదుకొంటామని హామీ ఇచ్చారన్నారు. హాస్పటల్‌కు వచ్చిన కలెక్టర్ అరుణ్ కుమార్ బీసీ కార్పొరేషన్ ద్వారా రూ. 1లక్ష సబ్సిడీ రుణం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఏడాది అయినప్పటికీ నష్టపరిహారం గాని, బీసీ కార్పొరేషన్ రుణం కానీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తాను ఏ పనీ చేసుకోలేని స్థితిలో ఉన్నానని, కుటుంబ పోషణ చేసుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సుబ్రహ్మణ్యం భార్య, కుమారులు కూడా పాల్గొన్నారు. -
అంత్య పుష్కరాలకుప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి అంత్యపుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు గోదావరి హెడ్‌వర్క్స్ డివిజన్ ఈఈ ఎన్.కృష్ణారావు బుధవారం తెలిపారు. ఘాట్ల ఎంపిక, చేయవలసిన పనులపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వరదలతో నదిలో నీటి ఉధృతి ఉంటే ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. తమ వద్ద రెండు కిలోమీటర్లకు సరిపడే బ్యారికేడ్లు ఉన్నాయని తెలిపారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉంటే వీటిని ఘాట్లలో ఏర్పాటు చేస్తామన్నారు. దానికి సుమారు రూ. 20 లక్షల అంచనావ్యయంతో ప్రతిపాదనలు పంపించామన్నారు. ఘాట్లలో ఎక్కడైనా టైల్స్ దెబ్బతినడం వంటి చిన్నచిన్న మరమ్మతులు ఉంటే వాటిని సరిచేస్తామన్నారు. అంత్య పుష్కరాలకు సుమారు 40మంది ఇరిగేషన్ సిబ్బందితో సేవలందిస్తామని ఆయన తెలిపారు. అంత్యపుష్కరాలకు జిల్లాలో 13ఘాట్లను ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు. అవి.. కోటిలింగాలరేవు, పుష్కరాలరేవు, మార్కండేయ ఘాట్, పద్మావతి ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్, సద్భావన ఘాట్, ధవళేశ్వరం రామపాదాల ఘాట్, రామచంద్రపురం ఘాట్, మునికూడలి ఘాట్లతో పాటు కోటిపల్లిలోని మూడు ఘాట్లు. పశ్చిమగోదావరి జిల్లాలో మహర్షిఘాట్, గోష్పాదఘాట్, వీఐపీ ఘాట్, సిద్ధాంతం ఘాట్, వలందారి ఘాట్, కొండాలమ్మఘాట్లలో రూ. 2లక్షల అంచనావ్యయంతో పూడికతీత పనులను ప్రారంభించినట్టు ఈఈ కృష్ణారావు తెలిపారు. -
పుష్కర పనులు త్వరగా చేపట్టండి
మక్తల్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా నిర్మిస్తున్న పుష్కరఘాట్ పనులను వెంటనే పూర్తిచేయాలని మండల ప్రత్యేక అధికారి శ్యాంసుందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పంపదేవ్పాడులో మంగళవారం పల్లెవికాసం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో కృష్ణానదికి సమీపంలో నిర్మించిన పుష్కరఘాట్ పనులను త్వరగా చేయాలని సిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు గ్రామంలో పర్యటించి డ్రెయినేజీలు, పాఠశాల, రేషన్‌షాపు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. తమ పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయనిర్మల, సూపరింటెండెంట్ జయశంకర్ ప్రసాద్, తహసీల్దార్ ఓంప్రకాష్, ఏఓ సుబ్బారెడ్డి, ఆర్ఐ కాలప్ప, ఎంఈఓ లక్ష్మినారాయణ, వీఆర్ఓ బాలప్ప, ఏపీఎం నారాయణ, సర్పంచ్ సుశీలమ్మ, ఎంపీటీసీ రాములు తదితరులు పాల్గొన్నారు.