అంత్య పుష్కరాలకుప్రత్యేక ఏర్పాట్లు
అంత్య పుష్కరాలకుప్రత్యేక ఏర్పాట్లు
Published Wed, Jul 20 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి అంత్యపుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు గోదావరి హెడ్‌వర్క్స్ డివిజన్ ఈఈ ఎన్.కృష్ణారావు బుధవారం తెలిపారు. ఘాట్ల ఎంపిక, చేయవలసిన పనులపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వరదలతో నదిలో నీటి ఉధృతి ఉంటే ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. తమ వద్ద రెండు కిలోమీటర్లకు సరిపడే బ్యారికేడ్లు ఉన్నాయని తెలిపారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉంటే వీటిని ఘాట్లలో ఏర్పాటు చేస్తామన్నారు. దానికి సుమారు రూ. 20 లక్షల అంచనావ్యయంతో ప్రతిపాదనలు పంపించామన్నారు. ఘాట్‌లలో ఎక్కడైనా టైల్స్ దెబ్బతినడం వంటి చిన్నచిన్న మరమ్మతులు ఉంటే వాటిని సరిచేస్తామన్నారు. అంత్య పుష్కరాలకు సుమారు 40మంది ఇరిగేషన్ సిబ్బందితో సేవలందిస్తామని ఆయన తెలిపారు. అంత్యపుష్కరాలకు జిల్లాలో 13ఘాట్‌లను ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు. అవి.. కోటిలింగాలరేవు, పుష్కరాలరేవు, మార్కండేయ ఘాట్, పద్మావతి ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్, సద్భావన ఘాట్, ధవళేశ్వరం రామపాదాల ఘాట్, రామచంద్రపురం ఘాట్, మునికూడలి ఘాట్‌లతో పాటు కోటిపల్లిలోని మూడు ఘాట్‌లు. పశ్చిమగోదావరి జిల్లాలో మహర్షిఘాట్, గోష్పాదఘాట్, వీఐపీ ఘాట్, సిద్ధాంతం ఘాట్, వలందారి ఘాట్, కొండాలమ్మఘాట్‌లలో రూ. 2లక్షల అంచనావ్యయంతో పూడికతీత పనులను ప్రారంభించినట్టు ఈఈ కృష్ణారావు తెలిపారు.
Advertisement
Advertisement