‘పుష్కర’ మరణాలకు కలెక్టరే సాక్షి | pushkara deaths investigation | Sakshi
Sakshi News home page

‘పుష్కర’ మరణాలకు కలెక్టరే సాక్షి

Published Fri, Apr 21 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

pushkara deaths investigation

  • నియంత్రణ అధికారి ఆయనే 
  • నిబంధనలను ఉల్లంఘించారు 
  • రద్దీ నియంత్రణ, సౌకర్యాల కల్పనను పూర్తిగా మరిచారు 
  • సీఎం పక్కనే ఉన్నారు
  • కమిష¯ŒS ముందు న్యాయవాదుల వాదనలు 
  • ప్రస్తుతానికి ముగిసిన వాదనలు      
  • సాక్షి, రాజమహేంద్రవరం :
    రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో గోదావరి పుష్కరాల మొదటి రోజున జరిగిన తొక్కిసలాటకు జిల్లా కలెక్టరే ప్రత్యక్ష సాక్షి అని బాధితుల తరఫు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కమిష¯ŒSకు నివేదించారు. జిల్లాలో పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యత చూడాల్సిన కలెక్టర్‌ అవన్నీ పక్కనపెట్టి సీఎం వెంట ఉన్నారని తెలిపారు. భక్తుల రద్దీని నియంత్రించèడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేయకపోవడం, పుష్కరఘాట్‌ వద్ద నిబంధనలకు విరుద్ధంగా సీఎం కాన్వాయ్‌ కోసం బారికేడ్లు తొలగించడం, గేటు మూసివేయడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం ఘాట్‌లో ఉన్నంత వరకు ఆయన వద్ద ఉన్నారని, తిరిగి వెళ్లిపోతునప్పుడు సీఎం కాన్వాయ్‌ను పట్టుకు వేళాడుతూ వెళ్లిన దృశ్యాలు నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఛానల్‌ ఇచ్చిన సీడీలో గతంలో కమిష¯ŒS చూసిన విషయం గుర్తు చేశారు. గురువారం నగరంలోని రహదారుల భవన అతిథి గృహంలో కమిష¯ŒS విచారణ మూడో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ముప్పాళ్ల వాదనలు వినిపిస్తూ లైజనింగ్‌ అధికారి వీఐపీల రాకపోకలు, వారి ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉందన్నారు. కానీ కలెక్టర్‌ తన బాధ్యతలు మరచి వీఐపీల సేవలో ఉన్నారన్నారు. అసలు లైజనింగ్‌ అధికారులు ఎవరు అని కమిష¯ŒS అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ తరఫు న్యాయవాది చింతపెంట ప్రభాకర్‌రావు తన వద్ద సమాచారం లేదన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను మైక్‌ తీసుకుని ఆదేశాలు జారీ చేశారని, ఆ అధికారం అతనికి ఎవరు ఇచ్చారో తెలియాల్సి ఉందని ముప్పాళ్ల వాదించారు. బోయపాటి శ్రీను పుష్కరాల ప్రారంభం రోజు సీఎం పక్కన లేరని, 13వ తేదీ సాయంత్రం ఉన్నారని ప్రభాకర్‌రావు వాదించారు. అర్బ¯ŒS జిల్లా ఎస్పీ రద్దీని, ట్రాఫిక్‌ను నియంత్రించడంలో విఫలమయ్యారని ముప్పాళ్ల పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తొక్కిసలాట తర్వాత బాధితులకు ప్రాథమిక వైద్యం, ఆక్సిజ¯ŒS అందించలేదని తెలిపారు. అంతేకాకుండా గాయపడిన వారిని సకాలంలో ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదన్నారు. తొమ్మిది అంబులె¯Œ్సలున్నాయని అధికారులు పేర్కొంటున్నా అవి ఎక్కడున్నాయో తెలియదన్నారు. తొక్కిసలాటకు ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా కలెక్టర్, అర్బ¯ŒS జిల్లా ఎస్పీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కారణమని స్పష్టం చేశారు. వాదనలు విన్న కమిష¯ŒS విచారణను వాయిదా వేసింది. ఈ నెల 29తో కమిష¯ŒSకు పెంచిన గడువు ముగుస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement