గోదావరి పరవళ్లు
గోదావరి పరవళ్లు
Published Tue, Sep 13 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
ఏటూరునాగారం :ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో మండలంలోని ముల్లకట్ట వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. సోమవారం పుష్కరఘాట్‌కు తాకుతూ వరదనీరు ప్రవహించింది. నెలరోజులుగా అంతంతమాత్రంగానే ఉన్న గోదావరి ఇప్పుడు జలకళ సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లా పూసుర, వరంగల్ జిల్లా ముల్లకట్ట రేవులను ఆనుకొని గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జాతీయ రహదారిపై పర్యాటకులు ఆహ్లాదంగా గడిపారు. రామన్నగూడెం వద్ద గోదావరి నీటి మట్టం 3.30 అడుగులకు చేరింది.
Advertisement
Advertisement