anthya
-
నేటితో ముగియనున్న అంత్య పర్వం
పుష్కరుడి వీడ్కోలు సంబరానికి సీఎం ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం పదకొండోరోజు పుష్కరఘాట్‌కు పోటెత్తిన భక్తులు సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి నదీతీరంలో 11 రోజులపాటు ఉత్సవంలా సాగిన అంత్యపుష్కరాలకు గురువారంతో తెరపడనుంది. గురువారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవులో హారతి కార్యక్రమం అనంతరం అంత్యపుష్కరాలు ముగియనున్నాయి. ముగింపు రోజు పుష్కరుడికి వీడ్కోలు పలికేందుకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ పుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో పదో రోజు రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌కు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ రాత్రి ఏడు గంటల వరకు 51వేల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఘాట్ వద్ద కూడలిలో వాహనాల రద్దీ పెరిగింది. జిల్లా మొత్తంమీద 85,652 మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు. అంతర్వేది, అయినవిల్లి, జొన్నాడ, కోటిపల్లి తదతర ఘాట్లకు భక్తులు వెళ్లారు. ఉభయ గోదావరితోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల యాత్రికులు తరలివచ్చారు. చివరిరోజు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఒడిసా భక్తుల తాకిడి పెద్దగా లేదు. పూరి జగన్నాథ రథయాత్ర అంత్యపుష్కరాలకు ముందే జరగడంతో ఒడిసా నుంచి భక్తులు పెద్దగా రాలేదని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. జగన్నాథ రథయాత్ర ముగియడంతో అంత్యపుష్కరాలు కూడా ముగిసినట్లుగా వారు భావిస్తారని చెబుతున్నారు. అర్బన్ ఎస్పీ రాజకుమారి ఘాట్ల వద్ద భద్రను పరిశీలించి సిబ్బందికి సూచన లిచ్చారు. కంట్రోల్ రూమ్ నుంచి నోడల్ అధికారి ఘాట్లలో ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఘనంగా ముగింపు వేడుకలు... అంత్యపుష్కరాలను ఘనంగా ముగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సరస్వతీ ఘాట్ నుంచి పుష్కరఘాట్ వరకు చిన్నారులతో ప్రదర్శన నిర్వహించనున్నారు. సాయంత్రం పుష్కరఘాట్ వద్ద ఆధ్యాత్మిక, సాంసృ్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి హారతి కార్యక్రమం అనంతరం 108 మంది ముల్తైదువులు నదిలో దీపాలను వదిలి పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. దేవాదాయ శాఖ తరఫున జిల్లాలోని అనవ్నవరం, అయినవిల్లి పుణ్య క్షేత్రాల ప్రసాదాలను భక్తులకు ఉచితంగా పంచిపెట్టనున్నట్లు ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డీవీఎల్ రమేష్‌బాబు తెలిపారు. ఇందుకోసం పుష్కరఘాట్ బయట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యంత్రాంగం అప్రమత్తం ముగింపు వేడుకలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతోపాటు సీఎం చంద్రబాబు వస్తుండడంతో పుష్కరఘాట్ వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు రాకపోకలకు ప్రత్యేక మార్గాలను నిర్ణయించారు. గురువారం సాయంత్రం హారతి కార్యక్రమానికి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయకుమార్, సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణన్ హాజరై ఏర్పాట్లను పరిశీలించారు. హారతి కార్యక్రమానికి మేయర్ పంతంరజనీ శేషసాయి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విచ్చేశారు. -
‘అంత్య’ శోభితం
-
ఇటు అంత్య పుష్కరాలు.. అటు బంద్
అర్భన్ జిల్లా పోలీసులకు తలనొప్పి రాజకీయ నేతల అరెస్టులకు సన్నాహాలు? రాజమహేంద్రవరం క్రైం : ఒకవైపు అంత్య పుష్కరాల హడావుడి కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ప్రజాసంఘాల మద్దతుతో వైఎస్సార్సీపీ మంగళవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఇలాంటి తరుణంలో రాజమహేంద్రవరం నగరంలో మంగళవారం పరిస్థితులు ఆందోళనకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాజమహేంద్రవరం అర్భన్ జిల్లా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. బంద్ సందర్భంగా అల్లర్లు, అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో 2800 మంది పోలీసులు, ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. బంద్ ఉధృతం అయితే ఎలా వ్యవహరించాలి? అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ముందు జాగ్రత్త చర్యలుగా రాజకీయ పార్టీ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. బంద్ జరిగేచోట్ల పోలీస్ ఫోర్స్‌ను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ నాయకులను తరలించేందుకు చర్యలు చేపట్టారు. -
ఇటు అంత్య పుష్కరాలు.. అటు బంద్
అర్భన్ జిల్లా పోలీసులకు తలనొప్పి రాజకీయ నేతల అరెస్టులకు సన్నాహాలు? రాజమహేంద్రవరం క్రైం : ఒకవైపు అంత్య పుష్కరాల హడావుడి కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ప్రజాసంఘాల మద్దతుతో వైఎస్సార్సీపీ మంగళవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఇలాంటి తరుణంలో రాజమహేంద్రవరం నగరంలో మంగళవారం పరిస్థితులు ఆందోళనకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాజమహేంద్రవరం అర్భన్ జిల్లా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. బంద్ సందర్భంగా అల్లర్లు, అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో 2800 మంది పోలీసులు, ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. బంద్ ఉధృతం అయితే ఎలా వ్యవహరించాలి? అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ముందు జాగ్రత్త చర్యలుగా రాజకీయ పార్టీ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. బంద్ జరిగేచోట్ల పోలీస్ ఫోర్స్‌ను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ నాయకులను తరలించేందుకు చర్యలు చేపట్టారు. -
అంత్యా సిద్ధం
నేటి నుంచి 12 రోజుల పాటు అంత్య పుష్కరాలు శోభాయమానంగా భద్రాద్రి ఘాట్ భద్రాచలం : గోదావరి అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి పన్నెండు రోజుల పాటు పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాచలం, పర్ణశాల ఘాట్లలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీర్చిదిద్దారు. ఆదివారం ఉదయం 6గం.లనుంచి 7.30గం.ల వరకూ గోదావరి తీరాన శాస్త్రోక్తంగా అంత్య పుష్కరాల ప్రారంభ వేడుక నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్నీ సిద్ధం చేశారు. ఉదయం స్వామి వారి ప్రచార మూర్తులను, చక్ర పెరుమాళ్లు, శ్రీపాదుకలతో గోదావరి తీరానికి ఊరేగింపుగా వెళ్లి, స్వామి వారికి పూజలు నిర్వహించిన తర్వాత సామూహిక పుష్కర స్నానం చేస్తారు. ఆదివారం నుంచి ఆగస్టు 11 వరకు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతీ రోజూ స్వామి వారికి సహస్ర నామార్చన, క్షేత్రమహాత్యం, ప్రవచనం, నిత్య కల్యాణోత్సవం, ప్రభుత్వ సేవ నిర్వహించనున్నారు. పూజాది కార్యక్రమాల్లో భక్తులు కూడా పాల్గొని స్వామి వారికి సేవలు చేసుకోవచ్చని దేవస్థానం అధికారులు తెలిపారు. భద్రాద్రి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని ఈఓ రమేష్‌బాబు తెలిపారు. పుష్కర స్నానం ఆనంతరం భక్తులు శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా ఆలయంలో తగిన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనం సకాలంలో అయ్యేలా చూడటంతో పాటు, భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేశారు. గోదావరి తీరంలో పుష్కర స్నానాలు ఆచరించే సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. గోదావరి నదీ వైపు ఇనుప కంచెను ఏర్పాటు చేయడంతో పాటు, అత్యవసర సమయంలో భక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచారు. శోభాయమానంగా పుష్కర ఘాట్ అంత్య పుష్కరాలతో గోదావరి స్నానఘట్టాల రేవు శోభాయమానంగా కనిపిస్తోంది. గోదావరి తీరంలో ఉన్న ఆలయాలకు రంగులు వేసి, విద్యుత్ దీపాలు అమర్చారు. అదే విధంగా గోదావరి తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గత ఏడాది ఆది పుష్కరాల సమయంలో గోదావరి నదిలో ఆశించిన స్థాయిలో నీరు లేదు. కానీ ప్రస్తుతం భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 22.5 అడుగుల నీటి మట్టంతో గోదావరి నిండుగా ప్రవహిస్తుంది. దీంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు పుణ్యస్నానాలు చేయవచ్చు. ఇటీవల వరదలకు ఘాట్లపై పేరుకుపోయిన బురదను పంచాయతీ అధికారులు ఫైర్ ఇంజిన్ సహకారంతో యుద్ధ ప్రాతిపదికన తొలగించి శుభ్రం చేశారు. ఈ పన్నెండు రోజుల పాటు భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా ప్రతీ రోజు సాయంత్రం 6 నుంచి 6.15 గంటల వరకూ గోదావరికి నదీ హారతులు ఇస్తారు. దీని కోసం నది ఒడ్డున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు తరలిస్తున్న భక్తులు అంత్య పుష్కరాల సమయంలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భద్రాచలం తర లివస్తున్నారు. పుష్కరాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు, హైకోర్టు జడ్జిలు, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారని దేవస్థానం అధికారులకు సమాచారం అందింది. దీంతో భక్తులతో పాటు, వీఐపీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భద్రాచలం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తామని సీఐ శ్రీనివాసులు తెలిపారు. భద్రాచలం పుష్కర ఘాట్ -
అంత్యం ఆర్భాటం
29కి ఏర్పాట్లు పూర్తి 30న ట్రయల్ రన్ ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణలు ముగింపు రోజున సీఎం రాక సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి అంత్యపుష్కరాలు ఈ నెల 31వ తేదీన ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 29 నాటికి అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతో యంత్రాంగం పనిచేస్తోంది. 30వ తేదీ ఉదయం 7 గంటలకు ట్రయల్ రన్ నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్ని శాఖల అధికారులు, ఎన్జీవో సంస్థలతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లు జరుగుతున్న తీరు, ఇంకా చేయాల్సిన పనులపై చర్చించారు. అంతకు ముందు కలెక్టర్ అధికారలతో కలిసి ఘాట్ల వద్ద జరుతున్న పనులను పరిశీలించారు. ఇతర ప్రాంతాల భక్తులు కోటిలింగాల ఘాట్‌కు.. బయటి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను కోటిలింగాల ఘాట్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి ఎంత మంది భక్తులు వస్తారో తెలుసుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నారు. 800 మంది ఎన్జీవోల సేవలను ఉపయోగించుకోన్నారు. నిషేధిత ఘాట్లలోకి కూడా భక్తులు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సీసీ కెమేరాలతో.. నగరంలోని అన్ని ఘాట్లలో నగరపాలక సంస్థ సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తోంది. రూ.2 లక్షలతో 40 సీసీ కెమెరాలు కొనుగోలు చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు నగరపాలక సంస్థ, పోలీసు అతిథి గృహంలో పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఘాట్లలోనికి వెళ్లలేని వృద్ధులు, వికలాంగుల కోసం జల్లు స్నానం ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయాల్లో.. ఘాట్ల వద్ద ఉన్న దేవాలయాలనుప్రతి రోజూ పూలు, పచ్చటి తోరణాలతో అలంకరించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించనుంది. ఉచిత ప్రసాదాలు అందించనుంది. 12 రోజుల పాటు నిత్య హారతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పిండ ప్రదానాల సామాగ్రి కోసం అధికారులు ఘాట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వేదఘోష నడుమ ముగింపు వేడుకలు... అంత్యపుష్కరాలకు ఘనంగా ముగింపు పలికేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. చివరి రోజు సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో ఉన్న వేదపండితులందరినీ పుష్కరఘాట్‌కు ఆహ్వానిస్తున్నారు. ఈ సమయంలో ముల్తైదువలు అరటి దొప్పలతో దీపాలను వదిలేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. -
అంత్య పుష్కరాలకు వచ్చేవారికి అన్ని వసతులు కల్పించాలి
► ఐటీడీఏ పీఓ రాజీవ్ భద్రాచలం : అంత్య పుష్కరాలకు వచ్చేవారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఐటీడీఏ పీఓ, ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశించారు. గోదావరి స్నానఘట్టాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. భద్రాచలంలోని గోదావరి కరకట్ట పరిసరాలను ఆయన బుధవారం పరిశీలించారు. స్నానఘట్టాల వద్ద మెట్లపై పేరుకుపోయిన ఒండ్రు మట్టిని త్వరితగతిన తొలగించాలన్నారు. గోదావరిలో స్నానానికి లోతుకు వెళ్లకుండా బారికేడ్లు నిర్మించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఇరిగేషన్ డీఈని ఆదేశించారు. మహిళలు బట్టలు మార్చుకునే తాత్కాలిక గదులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలన్నారు. 24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. భక్తులు ఎక్కడ పడితే అక్కడ కాకుండా నిర్ణీత ప్రదేశాల్లో స్నానాలు చేసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు స్నానాలు చేసే ప్రదేశాల్లో పడవలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని డీఎల్పీఓ ఆశాలతకు సూచించారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. పీఓ వెంట ఏఎస్పీ భాస్కరన్, తహశీల్దార్ రామకృష్ణ, డీఈ శ్యాంప్రసాద్, ఎస్సై కరుణాకర్, దేవస్థానం డీఈ రవీందర్, జీపీ ఈఓ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాసరావు, ఏఈ శైలజ పాల్గొన్నారు. -
అంత్య పుష్కరాలకుప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి అంత్యపుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు గోదావరి హెడ్‌వర్క్స్ డివిజన్ ఈఈ ఎన్.కృష్ణారావు బుధవారం తెలిపారు. ఘాట్ల ఎంపిక, చేయవలసిన పనులపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వరదలతో నదిలో నీటి ఉధృతి ఉంటే ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. తమ వద్ద రెండు కిలోమీటర్లకు సరిపడే బ్యారికేడ్లు ఉన్నాయని తెలిపారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉంటే వీటిని ఘాట్లలో ఏర్పాటు చేస్తామన్నారు. దానికి సుమారు రూ. 20 లక్షల అంచనావ్యయంతో ప్రతిపాదనలు పంపించామన్నారు. ఘాట్లలో ఎక్కడైనా టైల్స్ దెబ్బతినడం వంటి చిన్నచిన్న మరమ్మతులు ఉంటే వాటిని సరిచేస్తామన్నారు. అంత్య పుష్కరాలకు సుమారు 40మంది ఇరిగేషన్ సిబ్బందితో సేవలందిస్తామని ఆయన తెలిపారు. అంత్యపుష్కరాలకు జిల్లాలో 13ఘాట్లను ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు. అవి.. కోటిలింగాలరేవు, పుష్కరాలరేవు, మార్కండేయ ఘాట్, పద్మావతి ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్, సద్భావన ఘాట్, ధవళేశ్వరం రామపాదాల ఘాట్, రామచంద్రపురం ఘాట్, మునికూడలి ఘాట్లతో పాటు కోటిపల్లిలోని మూడు ఘాట్లు. పశ్చిమగోదావరి జిల్లాలో మహర్షిఘాట్, గోష్పాదఘాట్, వీఐపీ ఘాట్, సిద్ధాంతం ఘాట్, వలందారి ఘాట్, కొండాలమ్మఘాట్లలో రూ. 2లక్షల అంచనావ్యయంతో పూడికతీత పనులను ప్రారంభించినట్టు ఈఈ కృష్ణారావు తెలిపారు.