ఇటు అంత్య పుష్కరాలు.. అటు బంద్
Published Mon, Aug 1 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
అర్భన్ జిల్లా పోలీసులకు తలనొప్పి
రాజకీయ నేతల అరెస్టులకు సన్నాహాలు?
రాజమహేంద్రవరం క్రైం : ఒకవైపు అంత్య పుష్కరాల హడావుడి కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ప్రజాసంఘాల మద్దతుతో వైఎస్సార్‌సీపీ మంగళవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఇలాంటి తరుణంలో రాజమహేంద్రవరం నగరంలో మంగళవారం పరిస్థితులు ఆందోళనకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాజమహేంద్రవరం అర్భన్ జిల్లా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. బంద్ సందర్భంగా అల్లర్లు, అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో 2800 మంది పోలీసులు, ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. బంద్ ఉధృతం అయితే ఎలా వ్యవహరించాలి? అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ముందు జాగ్రత్త చర్యలుగా రాజకీయ పార్టీ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. బంద్ జరిగేచోట్ల పోలీస్ ఫోర్స్‌ను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ నాయకులను తరలించేందుకు చర్యలు చేపట్టారు.
Advertisement
Advertisement