
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పట్టణంలో ఆక్రమిత స్థలంలో నిర్మించిన మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై పోలీసులు శుక్రవారం లాఠీచార్జీ చేశారు. దీనికి నిరసనగా నేడు (సెప్టెంబర్ 14) హిమాచల్ బంద్‌కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి.
హిమాచల్ బంద్ నేపధ్యంలో రాష్ట్రంలోని వ్యాపారులంతా తమ దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మూసి ఉంచాలని హిందూ సంస్థ నేత కమల్ గౌతమ్ విజ్ఞప్తి చేశారు. సిమ్లాలోని సంజౌలీలో నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జికి వ్యతిరేకంగా హిందూ సంస్థలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతామని హిందూ సంస్థలు హెచ్చరించాయి.
సెప్టెంబర్ 11న ఉదయం సంజౌలిలో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సిమ్లా జిల్లా యంత్రాంగం సెక్షన్ 163ని అమలు చేసింది. ఇందులోభాగంగా ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడడంపై పూర్తి నిషేధం విధించారు. అయితే ఆందోళనకారులు ఢిల్లీ టన్నెల్ దగ్గరున్న బారికేడింగ్‌ను బద్దలు కొట్టి, సంజౌలి వైపు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేసి, వాటర్ క్యానన్ ప్రయోగించారు. దీనికి నిరసనగా ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు.
ఇది కూడా చదవండి: అంతరిక్షం నుంచే ఓటు వేస్తా: సునీతా విలియమ్స్
Comments
Please login to add a commentAdd a comment