organizations
-
బాబు పాలనపై జగన్ ఫైర్.. పార్టీ నేతలతో మీటింగ్ (ఫొటోలు)
-
నేడు హిమాచల్ బంద్.. హిందూ సంస్థల పిలుపు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పట్టణంలో ఆక్రమిత స్థలంలో నిర్మించిన మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై పోలీసులు శుక్రవారం లాఠీచార్జీ చేశారు. దీనికి నిరసనగా నేడు (సెప్టెంబర్ 14) హిమాచల్ బంద్‌కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి.హిమాచల్ బంద్ నేపధ్యంలో రాష్ట్రంలోని వ్యాపారులంతా తమ దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మూసి ఉంచాలని హిందూ సంస్థ నేత కమల్ గౌతమ్ విజ్ఞప్తి చేశారు. సిమ్లాలోని సంజౌలీలో నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జికి వ్యతిరేకంగా హిందూ సంస్థలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతామని హిందూ సంస్థలు హెచ్చరించాయి.సెప్టెంబర్ 11న ఉదయం సంజౌలిలో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సిమ్లా జిల్లా యంత్రాంగం సెక్షన్ 163ని అమలు చేసింది. ఇందులోభాగంగా ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడడంపై పూర్తి నిషేధం విధించారు. అయితే ఆందోళనకారులు ఢిల్లీ టన్నెల్ దగ్గరున్న బారికేడింగ్‌ను బద్దలు కొట్టి, సంజౌలి వైపు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేసి, వాటర్ క్యానన్ ప్రయోగించారు. దీనికి నిరసనగా ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు.ఇది కూడా చదవండి: అంతరిక్షం నుంచే ఓటు వేస్తా: సునీతా విలియమ్స్ -
సైబర్ ఉగ్రవాదానికి ఇక చెక్
సాక్షి, అమరావతి: సైబర్ ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. దేశంలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో సమర్థంగా వ్యవహరిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆధ్వర్వంలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) పేరిట ఈ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పనుంది. విదేశాలను కేంద్రంగా చేసుకుని దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలు పదేళ్లుగా సైబర్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. ప్రధానంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి. రక్షణ, పరిశోధన సంస్థలు, ఇస్రో, విద్యుత్ గ్రిడ్లు, టెలీ కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ తదితర రంగాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సైబర్ నిపుణులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో సైబర్ దాడులను నిరోధించడంలో పూర్తిగా సఫలీకృతం కాలేకపోతున్నాయి. 2018లో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలపై 70,798 సైబర్ దాడులు జరిగాయి. కాగా.. 2023లో మొదటి 6 నెలల్లోనే ఏకంగా 1.12 లక్షల సైబర్ దాడులు జరగడం పరి స్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సమాచార వ్యవస్థపై సైబర్ దాడులతో కీలక వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ గ్రిడ్స్పైనా ఉగ్రవాదం గురి లద్దాక్‌లోని విద్యుత్ గ్రిడ్లపై ఇటీవల జరిగిన సైబర్ దాడులతో చైనా సరిహద్దుల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల వ్యవస్థకు ఉన్న ముప్పును గుర్తు చేసింది. కేరళ, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థల పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. అనుమానితుల నివాసాల్లో సోదాలు నిర్వహించగా.. సైబర్ దాడులకు సంబంధించిన సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా దేశం ఎదుర్కొంటున్న సైబర్ ఉగ్రవాద పెనుముప్పునకు సంకేతంగా నిలుస్తున్నాయి. అందుకే వెంటనే అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగానే ఎన్ఐఏలోనే అంతర్భాగంగా యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్(ఏసీటీయూ)ను నెలకొల్పాలని నిర్ణయించింది. రాష్ట్రాలతో అనుసంధానం.. విదేశాలతో సమన్వయం సైబర్ ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) ఏర్పాటు తుది దశకు చేరుకుంది. భారీ స్థాయిలో పోలీస్ అధికారులు, సైబర్ భద్రతా నిపుణులు, ఇతర అధికారులు, సిబ్బందితోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏసీటీయూను రూపొందించే ప్రణాళికను కేంద్ర హోం శాఖ ఆమోదించింది. దీని పరిధిలో ఆర్థిక, ఐటీ, రక్షణ, టెలి కమ్యూనికేషన్లు, ఇతర రంగాలకు సంబంధించి సైబర్ సెల్స్ ఏర్పా టు చేస్తారు. దేశంలోని అన్ని పోలీసు శాఖల ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్స్ విభాగాలతోపాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన సంస్థల సైబర్ సెల్స్‌తో ఏసీటీయూను అనుసంధానిస్తారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగాలకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఉగ్రవాద సంస్థలు విదేశాలను కేంద్ర స్థానంగా చేసుకునే సైబర్ దాడులకు పాల్పడుతున్నాయి. అందుకు ఏసీటీయూకు విదేశాలతో సమన్వయం చేసుకునేందుకు ఇంటర్ పోల్‌తోపాటు విదేశీ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు అధికారాన్ని కలి్పస్తారు. విదేశాల్లోని దర్యాప్తు సంస్థలతో సమాచార మార్పిడి, ఇతర సహకారం కోసం ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటారు. రెండు నెలల్లో ఏసీటీయూను అధికారికంగా ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. అందుకోసం ఎన్ఐఏ తుది సన్నాహాలను వేగవంతం చేస్తోంది. -
ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’
పేరున్న కుటుంబం.. ఊరంతా బంధువులే.. కానీ కరోనా వచ్చి మృత్యువాత పడితే పట్టించుకునే వారే ఉండరు. అయినవారే కాదనుకుని వెళ్లిపోతుండగా.. ముక్కూమొహం తెలియని వారే మానవత్వం చూపుతున్నారు. అన్నీతామై అంతిమసంస్కారాలు చేస్తున్నారు. ఏ జన్మసంబంధమో తెలియదు గానీ చితికి నిప్పుపెట్టో.. గుప్పెడు మట్టి పోసో ఆత్మబంధువులవుతున్నారు. ముదిగుబ్బ/కదిరి/నల్లమాడ: బంధాలను కరోనా మహమ్మారి చిన్నాభిన్నం చేస్తోంది. మానవత్వం మంట గలుస్తోంది. అంతవరకూ తామున్నామంటూ భరోసా ఇచ్చిన వారే పాజిటివ్ వచ్చిందనగానే దూరమైపోతున్నారు. ఇక కరోనా కాటుకు బలైపోతే అంత్యక్రియలు చేసేందుకూ వెనుకాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు యువకులు ఆత్మబంధువులయ్యారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి అంతిమసంస్కారాలు నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కృష్ణమ్మకు ‘హెల్పింగ్ హ్యాండ్స్’ ముదిగుబ్బకు చెందిన కృష్ణమ్మ (65) కరోనాతో పోరాడి బుధవారం తుదిశ్వాస విడించింది. అయితే ఆమె అంత్యక్రియలను నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ‘ఇస్లామిక్ హెల్పింగ్ హ్యాండ్స్’ ప్రతినిధులు అమీర్, బాబా, తలహ, ఆదిల్, సుజార్లు ముందుకొచ్చారు. వృద్ధురాలి అంత్యక్రియలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. భార్యా కుమారుడు ముఖం చాటేసినా... కదిరి రూరల్ మండలం నాగూరుపల్లికి చెందిన ఆంజనేయులు(45) కొన్నేళ్లుగా నల్లమాడలో ఒంటరిగా ఉంటూ భవన నిర్మాణ కారి్మకుడిగా జీవనం సాగించేవాడు. కొన్నిరోజులుగా జ్వరం, దగ్గు, ఆయాసం అధికం కావడంతో బుధవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లి కరోనా పరీక్ష చేయించుకున్నాడు. అనంతరం ఆస్పత్రి బయట అరుగుపై కూర్చొని మధ్యాహ్నం 3 గంటల సమయంలో అక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న భార్య, కుమారుడు నల్లమాడకు చేరుకున్నారు. కరోనా సోకవడం వల్లే ఆంజనేయులు మృతిచెందినట్లు ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రామకృష్ణ తెలిపారు. నిబంధనల మేరకు అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. భయాందోళన చెందిన వారు ఆంజనేయులు మృతదేహాన్ని అక్కడి వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఆ రాత్రి, గురువారం ఉదయం వరకు సుమారు 20 గంటల పాటు మృతదేహం ఆస్పత్రి ఆవరణలోనే ఉండిపోయింది. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, స్థానిక పోలీసుల సహకారంతో ఓడీ చెరువుకు చెందిన ‘హెల్పింగ్ హ్యాండ్స్ తలబా’ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, పంచాయతీ పారిశుధ్య కారి్మకులతో కలిసి ఆంజనేయులు అంత్యక్రియలను నిర్వహించారు. కుటుంబీకులే భయపడినా.... కదిరి: కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన ఓ వ్యక్తి బుధవారం కరోనాతో మృతి చెందాడు. అయితే వైరస్ భయంతో కుటుంబీకులు ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు వెనుకాడారు. విషయం తెలుసుకున్న కదిరి పట్టణానికి చెందిన నిజాంవలీ, ఇర్ఫాన్‌ఖాన్, ఆషిక్, సాదిక్ బాషా, ఇర్షాద్, అక్బర్‌ఖాన్ మరికొందరు వెంటనే అక్కడికి చేరుకుని ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. వారం రోజుల క్రితం కూడా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో చనిపోవడంతో అంతిమ సంస్కారాలు చేశారు. తమకు కుల, మత భేదాలు లేవని ఎవరైనా తమను సాయం అర్థిస్తే తమ సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహిస్తామని బృందంలోని సభ్యుడు అక్బర్ ‘సాక్షి’ తెలియజేశారు. చదవండి: వ్యాక్సిన్ కోసం ఎంత ఖర్చుకైనా సిద్ధమే 1.81 లక్షల ఎకరాలకు ‘సత్వర’ ఫలాలు -
ఖురాన్‌కు వ్యతిరేకమైతే ఒప్పుకోం
లక్నో: ప్రతిపాదిత ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు పవిత్ర ఖురాన్ గ్రంథానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అది తమకు ఆమోదయోగ్యం కాదని పలు ముస్లిం మహిళా సంస్థలు స్పష్టం చేశాయి. ‘నిఖా (పెళ్లి) అనేది ఓ ఒప్పందం. దాన్ని ఎవరు ధిక్కరించినా శిక్షించాల్సిందే. ఖురాన్, రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతిపాదిత బిల్లు లేకపోతే దాన్ని ఏ ముస్లిం మహిళా ఒప్పుకోదు’’అని ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు చైర్ పర్సన్ షైస్టా ఆంబెర్ తెలిపారు. ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమాయిత్ ఇస్లామీ, జమియత్ ఉల్మా ఏ హింద్, ఇతర సంస్థలకు ముసాయిదా బిల్లును చూపించాల్సిందిగా న్యాయ కమిషన్‌కు లేఖ రాశాం’ అని పేర్కొన్నారు. ‘కుటుంబాన్ని నిలబెట్టేందుకు ఫ్యామిలీ కోర్టు యాక్ట్ ఓ అవకాశం ఇస్తుంది. కానీ ప్రతిపాదిత బిల్లు ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు’ అని ముస్లిం వుమెన్ లీగ్ అధ్యక్షురాలు నాయిశ్ హసన్ ఆరోపించారు. -
తెరపైకి మళ్లీ భూ భారతి
త్వరలోనే హైదరాబాద్‌లో సమగ్ర భూముల సర్వే సింగిల్ విండో సిస్టం కోసం ప్రత్యేక పాలసీ ఇండియా ప్రాపర్టీ. కామ్ స్థిరాస్తి ప్రదర్శనలో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వం రాష్ట్రంలో భూ భారతి కార్యక్రమాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలు, సంస్థలు, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన భూముల్లో కొన్నింట్లో టైటిల్స్ క్లియర్‌గా లేకపోవడం, శిఖం భూముల కావటంతో అనేక రకాల పొరపాట్లు జరిగాయని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కే. తారకరామారావు పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడటమే కాకుండా భూములు దుర్వినియోగమవుతున్నాయన్నారు. అందుకే త్వరలోనే హైదరాబాద్‌లోని అన్ని భూములపై శాటిలైట్ ద్వారా సమగ్ర సర్వే జరిపిస్తామని చెప్పారు. దీంతో ఎంత మేర ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయో తెలుస్తాయని, దోషులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. శనివారం మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో ఇండియా ప్రాపర్టీ. కామ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి స్థిరాస్తి ప్రదర్శనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 కల్లా హైదరాబాద్ జనాభా 3 కోట్లకు పైగా చేరుకుంటుందని, అప్పటి మౌలిక వసతులు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమగ్ర నగరాభివృద్ధిని రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు, అకాడమీలతో చర్చించి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తామని చెప్పారు. ఈ మాస్టర్‌ప్లాన్‌లో శాటిలైట్ టౌన్‌షిప్‌లు, ఐటీ, ఫార్మా, బయో, ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, స్పోర్ట్స్ సిటీ, ఆటమైదానాలు, ఎడ్యుకేషన్ హబ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్‌ను అనుసంధానం చేస్తూ షాద్‌నగర్, భువనగిరి, గజ్వేల్, సంగారెడ్డి, చెవెళ్ల ప్రాంతాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్‌ను నిర్మిస్తామన్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6 శాతం వాటా స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, ఇండియా ప్రాపర్టీ.కామ్ సీఈఓ గణేష్ వాసుదేవన్, పలువురు బిల్డర్లు పాల్గొన్నారు. -
పర్యాటక ప్రాంతాలు కిటకిట
అరకులోయకు పర్యాటకుల తాకిడి కళకళలాడిన సందర్శిత ప్రాంతాలు అరకురూరల్/అనంతగిరి,న్యూస్‌లైన్: విశాఖ ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం కిటకిటలాడాయి. అరకులోయ, పద్మాపురం ఉద్యానవనం, బొర్రాగుహలు, అనంతగిరి, తాడిగుడ, కటికిజలపాతం, గాలికొండ వ్యూపాయింట్లలో సందర్శకుల సందడి కనిపించింది.ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. ఇక్కడి పద్మాపురం ఉద్యానవనం, గిరిజన మ్యూజియం ఒక్కసారిగా కళకళలాడాయి. రైల్‌కమ్ రోడ్డు ప్యాకేజీ, ప్రైవేటు వాహనాలు, టూరిజం బస్సుల్లో వందలాది మంది రావడంతో అరకులోయతోపాటు పరిసర ప్రాంతాల్లో సందడి సంతరించుకుంది. వాహనాలు అధిక మొత్తంలో రావడంలో అరకులోయ టౌన్షిప్, మ్యూజి యం ఎదుట, పద్మావతి గార్డెన్‌రోడ్డుల్లో రద్దీతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఒక్కరోజే మ్యూజి యంలో ప్రవేశ రుసుం ద్వారా సుమారు రూ.14 వేలు, పద్మాపురం ఉద్యానవనంలో రూ.12 వేలు ఆదాయం వచ్చినట్లు మ్యూజియం మేనేజర్ మురళీ, పద్మాపురం ఉద్యానవనం మేనేజర్ లకే బొంజుబాబు తెలిపారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనానికి మైదాన ప్రాంతాలవారు ఏజెన్సీ బాట పడుతున్నారు. బొర్రాగుహలను సుమారు 5 వేల మంది సందర్శించుకున్నారు. విద్యా సంవత్సరం ఆరంభానికి మరో పది రోజులే గడువు ఉండడం, ఏటా జూన్ మొదటి రెండు వారాల్లో పర్యాటకుల రద్దీ ఉంటుందని ఆశాఖ అధికారులే పేర్కొంటున్నారు. వారం రోజుల్లో రూ. లక్షన్నర ఆదాయం సమకూరినట్టు పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లోని చిరువ్యాపారులకు గిట్టుబాటవుతోంది. -
మెట్రోలతో పోలిస్తే తీసికట్టు
ఆశాజనకంగా లేని ‘గ్రేటర్’ పోలింగ్ చర్చనీయాంశమైన సిటీజనుల తీరు సాక్షి, సిటీబ్యూరో : ‘ఓటుహక్కు వినియోగించుకోండి’ అంటూ ప్రజాసంఘాలు, సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు.. చివరికి ఎన్నికల సంఘం నెత్తీ నోరూ మొత్తుకున్నా గ్రేటర్లో ఓటింగ్ రవ్వంత కూడా పెరగలేదు. 2009 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం ఇంకా తగ్గింది. విస్తృత ప్రచారం జరిగినా ఓటేయడానికి కదలని సిటీజనుల తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు దేశంలోని ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై తదితర మెట్రో నగరాలతో పోల్చినా నగరంలోనే తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. మెట్రోల్లో మెరుగైన పోలింగ్ శాతం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో అత్యధికంగా 64 శాతం పోలింగ్ నమోదవడంతో మెట్రో నగరాలకేఈ మహా నగరం ఆదర్శంగా నిలిచింది. ఆ తర్వాత ద్వితీయస్థానంలో నిలిచిన కోల్‌కతాలో 62.25 శాతం పోలింగ్ నమోదైంది. తృతీయస్థానంలో నిలిచిన చెన్నైలో 60.9 శాతం, నాలుగోస్థానంలో నిలిచిన బెంగళూరు, ముంబై నగరాల్లో 54 శాతం మేర పోలింగ్ నమోదయ్యింది. నగరం మాత్రం 53.38 శాతానికే పరిమితమైంది. 2009 ఎన్నికల్లో గ్రేటర్లో 54.31 శాతం మేర పోలింగ్ నమోదైంది. మెట్రోల్లో పోలింగ్ పెంచిన అంశాలివీ... ఓటరు చైతన్యం పెంచేందుకు ఆయా నగరాల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బస్తీలకు సమీపంలో బూత్‌లను కేటాయించింది. ఓటరు స్లిప్పులను సకాలంలో పంపిణీ చేశాయి. ఓటరు స్లిప్పులు లేనివారు సైతం ఈసీ ధ్రువీకరించిన 11 ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి ఉంటే ఓటు వేయవచ్చన్న ప్రచారం విస్తృతంగా సాగింది. సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఓటు హక్కుపై విస్తృత ప్రచారం జరగడంతో ఓటర్లలో చైతన్యం పెరిగింది. ‘గ్రేటర్’ పోలింగ్ తగ్గడానికి కారణాలివీ... 18-35 ఏళ్ల వయస్కులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. సెలవు దినం కావడంతో ఇతర వ్యాపకాలలో పడ్డారు. ప్రచార హోరు పెరగడంతో ఏ పార్టీ అభ్యర్థికి ఓటేయాలో తేల్చుకోలేక అయోమయానికి గురయ్యారు. జీహెచ్ఎంసీ యంత్రాంగం పోలింగ్చీటీలు సరిగా పంపిణీ చేయలేకపోయింది. పోలింగ్ బూత్‌ల కేటాయింపు అస్తవ్యస్తంగా మారింది. చాలామంది బూత్ ఎక్కడో తెలుసుకోలేకపోయారు. కొందరు తమ నివాసానికి పోలింగ్ బూత్ దూరంగా ఉండటంతో నిర్లిప్తత వహించారు. అపార్ట్మెంట్ వాసులు తమ సమస్యల పరిష్కారానికి రాజకీయ నాయకులు ఉపయోగపడరన్న అభిప్రాయంతో ఉండడం గమనార్హం. తక్షణం తమ సమస్యల పరిష్కారానికి అధికారులను సంప్రదిస్తే చాలన్న ధోరణి పెరిగింది. పలు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు పలు కాలనీలు, బస్తీల్లో అసలు ప్రచారమే (పూర్ క్యాంపెయినింగ్) చేయలేదు. ప్రచార బాధ్యతలను ద్వితీయశ్రేణి నాయకగణం, కార్యకర్తలపైనే నెట్టివేశారు. దీంతో మొక్కుబడిగా ప్రచారం సాగింది. స్థానిక సమస్యల పరిష్కారానికి అభ్యర్థులు నిర్దిష్టమైన హామీలను మేనిఫెస్టోలో పేర్కొనలేదు జాబితాలో తమ పేరు లేదేమోనన్న ఆందోళనతో చాలామంది పోలింగ్ బూత్‌ల ముఖం చూడలేదు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లకు వెళ్లిన పలువురు జాబితాలో పేరు లేక తిరుగుముఖం పట్టారు. గంటల తరబడి పోలింగ్ స్టేషన్ల వద్ద పడిగాపులు పడితే వేసవి తాపానికి గురవుతామని పలువురు ఆందోళన చెందారు. -
శ్రీబాగ్ ఒప్పందాన్ని ఆమోదించాలి
సీమ హక్కులను నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటే బాస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతల స్పష్టీకరణ మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ఊపందుకున్న వేళ రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం సీమ నేత లు స్వరం పెంచుతున్నారు. రాయలసీమను సౌభాగ్య సీమగా మార్చగల ‘శ్రీబాగ్ ఒప్పందం’ అమలు కోసం భారతీయ అంబేద్కర్ సేన (బాస్) కొనసాగిస్తున్న ఉద్యమంలో భాగంగా శనివారం పట్టణంలోని బేబి వెల్కమ్ హోమ్‌లో పార్టీలకు అతీతంగా, ప్రజాసంఘా లు, వివిధ రాజకీయ పార్టీలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘రాయలసీమ సమస్యలు-పరిష్కార మార్గాలు’ అన్న అంశంపై బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివప్రసా ద్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగిం ది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ చినబాబు, టీడీపీ మాజీ ఎమెల్యే దొమ్మలపాటి రమేష్, వల్లిగట్ల రెడ్డెప్ప, సీపీఐ నాయకులు కృష్ణప్ప, సమాజ్‌వాదీ పార్టీకి చెంది న తుర్ల ఆనంద్యాదవ్తో పాటు పలు స్వ చ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, కుల సం ఘాల నాయకులు పాల్గొని సీమ సమస్యలను వివరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్(జీవోఎం)బిల్లులో శ్రీబాగ్ ఒప్పందంపై చర్చించక పోవడాన్ని పలువురు నేతలు తీవ్రం గా ఖండించారు. ఇప్పటికైనా సీమ హక్కులపై స్పందించి లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చించి, శ్రీబాగ్ అమలును ఆమోదించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. లేకుంటే సీమ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా తిరుగుబాటు తప్పదని నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో బాస్ జిల్లా అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు జింకా వెంకటాచలపతి, పోర్డు లలితమ్మ, కృషి సుధాకర్, డీఎస్ఎస్ నాయకుడు చిన్నప్ప, బీసీ నాయకులు పులిశ్రీనివాసులు, డీవీ.రమణ, రాయల్‌బాబు, కొమరం భీమ్ అధ్యక్షులు దివాకర్, బాస్ నాయకులు శ్రీచందు, కేవీ.రమణ, నాషీ, మను, లారా, లక్ష్మి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మండలిలో చర్చిస్తాం ఏళ్ల తరబడి రాయలసీమ కరువు కోరల్లో విలవిల్లాడుతోం ది. ఇక్కడి ప్రజల నీటి కష్టాలు వర్ణనాతీతం. వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి, పారిశ్రామిక రంగం, అభివృద్ధి సూచిల్లో తెలంగాణ కంటే సీమ వెనుకబడింది. శ్రీబాగ్ ఒప్పంద అమలు ద్వారా సీమ కష్టాలు తీరుతాయి. దీనిపై శాసనమండలిలో చర్చిస్తా. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పార్టీ పొలిట్‌బ్యూరోలో మాట్లాడుతా. - ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి (వైఎస్సార్సీపీ) మ్యానిఫెస్టోలో పెట్టేవిధంగా ఒత్తిడి తెద్దాం శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేస్తామని రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ మ్యానిఫెస్టోలో పెట్టే విధంగా సీమ నేతలు ఒత్తిడి తేవాలి. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఈ ప్రమాదం నుంచి సీమను కాపాడుకోవాలంటే శ్రీబాగ్ ఒప్పందం అమలు జరగాల్సిందే. - దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యే(టీడీపీ) నదీ జలాలు సీమకే కేటాయించాలి కృష్ణ, తుంగభద్ర, పెన్నా నదుల నీటిపై శ్రీబాగ్ ఒప్పందం ద్వారా సంపూర్ణ హక్కులు లభించినా, దాన్ని కాలరాసి కోస్తాంధ్ర, తెలంగాణాలకు నదీజలాలను తరలించుకుపోతున్నారు. 40 అడుగుల్లో భూగర్భ జలాలున్న కోస్తాంధ్రకు నదీజలాలు ఇస్తున్నారు. వెయ్యి అడుగుల బోర్లు వేసినా నీళ్లు పడని సీమకు నదీ జలాలు ఇవ్వకుండా ఎడారిగా మార్చారు. సీమాంధ్ర నేతలు శ్రీబాగ్ ఒప్పందం అమలుకు కృషి చేయాలి. - జింకా చలపతి వైఎస్సార్సీపీ సీమను సింగ్‌పూర్‌లా మార్చుకుందాం 30 ఏళ్లలో సింగపూర్ ఎంతో అభివృద్ధి సాధించి అమెరికా వంటి దేశాలతో పోటీపడుతోంది. సీమలో అపారమైన ఖనిజ, అటవీ సంపద ఉన్నాయి. నదీజలాలు, విద్యుత్ మిగులు ఉంది. కష్టజీవులున్నారు. ఈ వనరులన్నీ వినియోగంలోకి తెస్తే రాయలసీమ రానున్న 20 ఏళ్లలో సింగపూర్ ను మించిపోతుంది. శ్రీబాగ్ ఒప్పందం అమలుకు రాజకీ య పార్టీలు ఉద్యమించాలి. - పీటీఎం. శివప్రసాద్, బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు -
బ్యాంక్‌పై స్కెచ్... మేనేజర్ ఇంట్లో చోరీ
కెనరా బ్యాంక్ చోరీకి విఫలయత్నం మేనేజర్ ఇంట్లో బైక్, ల్యాప్‌టాప్ చోరీ అరకులోయ/అరకు రూరల్, న్యూస్‌లైన్: బ్యాంకు చోరీకి విఫలయత్నం చేసిన దొంగలు... ఆ కోపాన్ని మేనేజర్ ఇంటిపై ప్రదర్శించారు. మోటార్ బైక్‌ను, ల్యాప్‌టాప్‌ను అపహరించుకుపోయారు. సినీఫక్కీలో జరిగిన ఈ చోరీపై పోలీసుల వివరాలివి. యండపల్లివలస కెనరా బ్యాంక్‌లో తాత్కాలికంగా ఏటీఎం ఏర్పాటు చేశారు. బ్యాంకులో ఆదివారం రాత్రి దొంగలు ప్రవేశించి ఏటీఎంను ధ్వంసం చేశారు. లోపలున్న లాకర్‌ను తీసేందుకు ఎంత ప్రయత్నించినా వీలవక వదిలేసి వెళ్లిపోయారు. అక్కడినుంచి అరకులోయ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని వైఎస్సార్ కాలనీలో నివసిస్తున్న కెనరా బ్యాంక్ మేనేజర్ ఎం.వెంకటకుమార్ ఇంట్లో చొరబడ్డారు. ఆదివారం సెలవు కావడంతో మేనేజర్ స్వగ్రామానికి వెళ్లిపోవడంతో ఇంట్లో ఎవరూ లేరు. ఇంటి బయట పెట్టిన హీరో హోండా, ఇంట్లో మంచంపై ఉంచిన లాప్‌టాప్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం 9.15 గంటలకు స్వీపర్ గుజ్జెలి సువర్ణ బ్యాంక్ తాళాలు తీయబోయేసరికి గేటు, తలుపుల తాళాలు పగులగొట్టి ఉండటం చూసి అవాక్కయింది. వెంటనే బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్లో సమాచారం అందించింది. హుటాహుటిన మేనేజర్ ఎం.వెంకటకుమార్ బ్యాంక్‌కు చేరుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు సిద్ధమవుతుండగా, ఆయన ఇంట్లో చోరీ జరిగినట్టు అదే కాలనీవాసి ఫోన్లో తెలిపారు. ఒకేసారి రెండు సంఘటనలు జరగడంతో ఆందోళన చెందిన బ్యాంకు మేనేజర్ హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. మూడు నెలల క్రితం కొన్న బైక్ ఖరీదు రూ. 65 వేలు, నెలరోజుల క్రితం కొన్న లాప్టాప్ ఖరీదు రూ.40 వేలుంటుందని మేనేజర్ కుమార్ తెలిపారు. రక్షణ ఏర్పాట్లు లేని బ్యాంకు అరకులోయ సీఐ మురళీరావు, ఎస్ఐ జి.నారాయణరావు బ్యాంకును తనిఖీ చేసి లాకర్లను పరిశీలించారు. పైసా కూడా దొంగలు ఎత్తుకెళ్లలేదని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంక్‌ను అద్దె ఇంట్లో నిర్వహిస్తుండటం, ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడమే చోరీకి ఆస్కారమిచ్చిందని తెలుస్తోంది. సాయంత్రం క్లూస్ టీం బ్యాంక్‌కు చేరుకొని ఆధారాలు సేకరించాయి. వెంటనే వాచ్‌మన్‌ను నియమించుకోవాలని బ్యాంక్ అధికారులకు నోటీసు జారీ చేశామని సీఐ మురళీరావు విలేకరులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.