ఖురాన్‌కు వ్యతిరేకమైతే ఒప్పుకోం | Triple talaq bill unacceptable if against Quran: AIMWPLB | Sakshi
Sakshi News home page

ఖురాన్‌కు వ్యతిరేకమైతే ఒప్పుకోం

Published Thu, Dec 28 2017 3:38 AM | Last Updated on Thu, Dec 28 2017 3:38 AM

Triple talaq bill unacceptable if against Quran: AIMWPLB - Sakshi

లక్నో: ప్రతిపాదిత ‘ట్రిపుల్‌ తలాక్‌’ బిల్లు పవిత్ర ఖురాన్‌ గ్రంథానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అది తమకు ఆమోదయోగ్యం కాదని పలు ముస్లిం మహిళా సంస్థలు స్పష్టం చేశాయి. ‘నిఖా (పెళ్లి) అనేది ఓ ఒప్పందం. దాన్ని ఎవరు ధిక్కరించినా శిక్షించాల్సిందే. ఖురాన్, రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతిపాదిత బిల్లు లేకపోతే దాన్ని ఏ ముస్లిం మహిళా ఒప్పుకోదు’’అని ఆల్‌ ఇండియా ముస్లిం ఉమెన్‌ పర్సనల్‌ లా బోర్డు చైర్‌ పర్సన్‌ షైస్టా ఆంబెర్‌ తెలిపారు. ‘ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, జమాయిత్‌ ఇస్లామీ, జమియత్‌ ఉల్మా ఏ హింద్, ఇతర సంస్థలకు ముసాయిదా బిల్లును చూపించాల్సిందిగా న్యాయ కమిషన్‌కు లేఖ రాశాం’ అని పేర్కొన్నారు. ‘కుటుంబాన్ని నిలబెట్టేందుకు ఫ్యామిలీ కోర్టు యాక్ట్‌ ఓ అవకాశం ఇస్తుంది. కానీ ప్రతిపాదిత బిల్లు ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు’ అని ముస్లిం వుమెన్‌ లీగ్‌ అధ్యక్షురాలు నాయిశ్‌ హసన్‌ ఆరోపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement