Quran
-
Ramadan 2024: సమతా మమతల పర్వం ఈదుల్ ఫిత్ర్!
అల్లాహు అక్బర్ .. అల్లాహు అక్బర్ .. లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్ ..! ఈ రోజు ఎటువిన్నా ఈ స్తోత్ర గానమే, ఆ దయామయుని కీర్తిగానమే వినిపిస్తూ హృదయాలను పులకింపజేస్తూ ఉంటుంది. ఊరు, వాడ, పల్లె, పట్నం, చిన్నా పెద్దా, ఆడా మగా, ముసలీ ముతకా అనే తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఈ అమృత వచనాలే జాలువారుతూ ఉంటాయి. కొత్తబట్టలు, కొత్తహంగులు, తెల్లని టోపీలు మల్లెపూలలా మెరిసిపోతుంటాయి. అత్తరు పన్నీరు పరిమళాలు, అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్‌లు, చిరునవ్వుల కరచాలనాలు, ఆలింగనాల ఆనంద తరంగాలు, అలయ్ బలయ్ లతో విశ్వాసుల హృదయాలు సంతోషసాగరంలో ఓలలాడుతూ ఉంటాయి. సేమ్యాలు, షీర్ ఖుర్మాలు, బగారా, బిర్యానీల ఘుమఘుమలతో, ఉల్లాస పరవళ్ళ హడావిడితో ముస్లిముల లోగిళ్ళు కిలకిల నవ్వుతూ, కళకళలాడుతూ ఉంటాయి. ఇళ్ళలో ఆడాళ్ళ హడావిడికి, పిల్లల సందడికి హద్దులే ఉండవు. ఎందుకంటే ఇది ఒక్కనాటి పండుగ కాదుగదా! నెల్లాళ్ళపాటు భక్తిప్రపత్తులతో జరుపుకున్న పండుగకు అల్విదా చెబుతున్న ముగింపు ఉత్సవం. రమజాన్ నెలరోజులూ ముస్లింల వీధులు ‘సహెరీ’,‘ఇఫ్తార్’ ల సందడితో నిత్యనూతనంగా కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ వింత అనుభూతుల్ని పంచుతుంటాయి. భక్తులు పవిత్ర గ్రంథ పారాయణా మధురిమను గ్రోలుతూ వినూత్న అనుభూతులతో పరవశించి పోతుంటారు. అవును.., ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు, అనుభవాలు, అనుభూతుల సమ్మేళనమే పండుగ. ఇలాంటి ఓ అద్భుతమైన, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్ ’. దీన్నే రమజాన్ పండుగ అంటారు. ముస్లిం సమాజం జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగల్లో ఇది మొదటిదీ, అతి పవిత్రమైనదీను. ఈ నెలలో ముస్లింలు అత్యంత నియమనిష్టలతో రోజావ్రతం పాటిస్తారు. భక్తిశ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్రఖురాన్ గ్రంథాన్ని భక్తితో పారాయణం చేస్తూ, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారిపై సలాములు పంపుతూ ఉంటారు. దైవనామస్మరణలో అనునిత్యం వారి నాలుకలు నర్తిస్తూ ఉంటాయి. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయులవుతుంటారు. దానధర్మాలు చేస్తారు, ఫిత్రాలు చెల్లిస్తారు. ఈ విధంగా రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాసదీక్షలు నెలరోజుల తరువాత షవ్వాల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి. షవ్వాల్ మొదటితేదీన జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. ఈ పండుగ సంబంధం రమజాన్ నెలతో ముడివడి ఉన్న కారణంగా ఇది రమజాన్ పండుగగా ప్రసిద్ధి చెందింది. రమజాన్ ఉపవాస దీక్షలు, పవిత్ర ఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకు పోయి ఉంది. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాన్ని, మానవీయ విలువల్ని జనింపజేయడానికి సృష్టికర్త ఉపవాస వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు. దైవాదేశ పాలనకు మనిషిని బద్దునిగా చేయడమే ఉపవాస దీక్షల అసలు లక్ష్యం. ఒక నిర్ణీత సమయానికి మేల్కొనడం, సూర్యోదయం కాకముందే భుజించడం(సహెరి), సూర్యాస్తమయం వరకూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా, రోజూ ఐదుసార్లు దైవారాధనచేస్తూ సూర్యాస్తమయం తరువాత రోజా విరమించడం(ఇఫ్తార్), మితాహారం తీసుకోవడం, మళ్ళీ అదనపు ఆరాధనలు అంటే తరావీహ్ నమాజులు చేయడం, మళ్ళీ తెల్లవారు ఝామున లేవడం – ఈవిధంగా రమజాన్ ఉపవాస వ్రతం మనిషిని ఒక క్రమశిక్షణాయుతమైన, బాధ్యతాయుతమైన, దైవభక్తి పరాయణతతో కూడుకున్న జీవనవిధానానికి అలవాటు చేస్తుంది. మానవుల్లో ఇంతటి మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే వ్రతాన్ని పరాత్పరుడైన అల్లాహ్ వారికి అనుగ్రహించినందుకు, వాటిని వారు నెలరోజులూ త్రికరణ శుద్ధిగా పాటించ గలిగినందుకు సంతోష సంబరాల్లో తేలిపోతూ కృతజ్ఞతాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, పవిత్ర రమజాన్ నెలలోనే సమస్త మానవాళి సన్మార్గ దీపిక అయిన మహత్తర గ్రంథరాజం ఖురాన్‌ను దేవుడు మానవాళికి ప్రసాదించాడు. సమస్త మానవజాతికీ మార్గదర్శక జ్యోతి పవిత్ర ఖురాన్. సన్మార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథరాజం మానవులందరికీ సన్మార్గ బోధన చెయ్యడానికి అవతరించిన ప్రబోధనా జ్యోతి. దైవ ప్రసన్నతను చూరగొనడానికి రోజా పాటించడం,‘తరావీహ్ ’లు ఆచరించడం, దానధర్మాలు చేయడంతో పాటు, ఈ నెల చివరిలో‘లైలతుల్ ఖద్ర్’ అన్వేషణలో అధికంగా ఆరాధనలు చేస్తారు. లైలతుల్ ఖద్ర్ అంటే అత్యంత అమూల్యమైన రాత్రి అని అర్థం. ఉపవాసం పాటించడంవల్ల పేదవాళ్ళ ఆకలి బాధలు అర్థమవుతాయన్నారు. సంపన్నులకు, ముప్పూటలా సుష్టుగా తినేవారికి నిరుపేదల ఆకలికేకలు వినబడవు. అలాంటివారు గనక ఉపవాసం పాటించినట్లయితే ఆకలి బాధ ఎలా ఉంటుందో వారికీ తెలుస్తుంది. తద్వారా పేదసాదలను ఆదుకోవడం, వారికి పట్టెడన్నం పెట్టడం ఎంతగొప్ప పుణ్యకార్యమో వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా రమజాన్ నెల ఆరంభంనుండి అంతం వరకు ఒక క్రమపద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో ఈనెలను గడిపినవారు ధన్యులు. నిజానికి ఇలాంటివారే పండుగ శుభకామనలకు అర్హులు. అందుకే ’ఈద్ ’(పండుగ)ను శ్రామికుని వేతనం(ప్రతిఫలం)లభించే రోజు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా రమజాన్ పర్వదినం మనిషిని ఒక ఉన్నతమానవీయ విలువలుకలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదర భావాలకు పునాదివేస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఇదే ఈదుల్ ఫిత్ర్ – రమజాన్ పర్వదిన పరమార్ధం. సదాచరణల సంపూర్ణప్రతిఫలం లభించిన సంతోషంలో అంబరాన్నంటేలా సంబురాలు జరుపుకొని ఆనంద తరంగాల్లో తేలియాడే రోజు ఈదుల్ ఫిత్ర్ . – ఆరోజు ముస్లిములందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన సేమియా పాయసాన్ని తమ హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిఖ్ఖు సోదరులందరికీ ఆప్యాయంగా రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు.‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు. పవిత్ర ఖురాన్ రూపంలో అవతరించిన సృష్టికర్త మహదనుగ్రహం దానవుడి లాంటి మానవుణ్ణి దైవదూతగా మలిచింది. అజ్ఞానం అంధకారాల కారు చీకట్లనుండి వెలికి తీసి, విజ్ఞానపు వెలుగుబాటకు తీసుకు వచ్చింది. నైచ్యపు అగాథాలనుండి పైకిలాగి పవిత్రతా శిఖరాలపై నిలిపింది. మానవుల్లోని పశుప్రవృత్తిని మానవీయ పరిమళంతో పారద్రోలింది. ఆటవికతను నాగరికతతో, అజ్ఞాన తిమిరాన్ని జ్ఞానదీపికతో, అవివేకాన్ని వివేకంతో పారద్రోలి మనుషుల్ని మానవోత్తములుగా సర్వతోముఖంగా తీర్చిదిద్దింది. మానవాళికి ఇంతటి మహదానుగ్రహాలు ప్రసాదించి, వారి ఇహపరలోకాల సఫలతకు పూబాటలు పరిచిన నిఖిల జగన్నాయకునికి కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకోవడమే ఈ పండుగ ఉద్దేశ్యం. ఈదుల్ ఫిత్ర్ పర్వదిన శుభాకాంక్షలు – మదీహా అర్జుమంద్ -
మతోన్మాదం యూరప్ కొంప ముంచుతుందా?
యూరప్‌లో మతోన్మాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. స్వీడన్ తర్వాత ఇప్పుడు మరో యూరోపియన్ దేశం డెన్మార్క్‌లో ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను తగలబెట్టినా ఆ ప్రక్రియను ఆపే చర్యలేవీ జరగడంలేదు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో మితవాద సంస్థ ఖురాన్‌ను తగులబెట్టడంపై సౌదీ అరేబియా మొదలుకొని పాకిస్తాన్ వరకు అన్ని ముస్లిం దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. డెన్మార్క్ దౌత్యవేత్త సమక్షంలో.. ఖురాన్ దహనం చేసిన ఘటనపై ఆగ్రహించిన సౌదీ అరేబియా.. డెన్మార్క్ దౌత్యవేత్త సమక్షంలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అదే సమయంలో డెన్మార్క్‌లో జరిగిన ఘటనపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ కూడా తీవ్ర విమర్శలు గుప్పించింది. తాజాగా జరిగిన సమావేశంలో సౌదీ అధికారులు డెన్మార్క్ రాయబారి ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను తక్షణం ఆపాలని డెన్మార్క్‌కు వారు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి సంఘటనలు అన్ని మతాల సందేశాలకు, అంతర్జాతీయ చట్టాలు, ప్రమాణాలకు విరుద్ధమని సౌదీ పేర్కొంది. ఖురాన్‌ను తగులబెట్టడం వల్ల వివిధ మతాల మధ్య విద్వేషాలు వ్యాపిస్తాయని తెలిపింది. ముస్లిం దేశాల్లో తీవ్ర ఆగ్రహం దీనికిముందు డెన్మార్క్‌కు చెందిన పేట్రియాటర్ ఒక వీడియోను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఖురాన్‌ను తగులబెట్టడం ఆ వీడియోలో కనిపిస్తుంది. తాజాగా స్వీడన్, డెన్మార్క్‌లలో కూడా ఖురాన్‌ను దగ్ధం ఘటన అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. మక్కా, మదీనా వంటి నగరాలు కలిగిన దేశమైన సౌదీ అరేబియా.. స్వీడన్లో ఖురాన్‌ను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక ఇరాకీ శరణార్థి స్టాక్‌హోమ్‌లోని ప్రధాన మసీదు బయట ఖురాన్‌ను తగులబెట్టాడు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో సౌదీ అరేబియా, ఇరాక్ సంయుక్తంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ) అసాధారణ సమావేశానికి పిలుపునిచ్చాయి. దీనిలో స్వీడన్, డెన్మార్క్‌లలో ఖురాన్ దహనం చేసిన అంశంపై చర్చించనున్నారు. మరోవైపు స్వీడన్ ప్రధాని తమ దేశానికి ఉగ్రదాడుల భయం ఎదురుకావడంతో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేశారు. ఇస్లామిక్ దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు స్వీడన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది కూడా చదవండి: ఆ పాప నా మనవరాలే : బైడెన్ -
పరలోక సాఫల్యం దిశగా...
సృష్టిలోని ప్రతి జీవికీ మరణం తప్పదు. ఇది సృష్టిధర్మం, ఎవరూ తిరస్కరించలేని సత్యం. నాస్తికులూ, ఆస్తికులూ అందరూ మరణాన్ని నమ్ముతారు. దేవుడున్నాడా అనే విషయంలో భేదాభి్రపాయాలున్నాయి గాని, మరణం ఉందా.. లేదా..? అనే విషయంలో ఎటువంటి భిన్నాభిప్రాయమూ లేదు. కాని,‘మరణం తథ్యం’ అని తెలిసినా మనం దాన్ని పట్టించుకోం. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు,స్నేహితులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతోమంది ప్రతిరోజు ఎక్కడో ఒకచోట పోతూనే ఉన్నారు. మనం వారి అంత్యక్రియల్లో పాల్గొని, స్వయానా మన భుజాలపై మోసి, సమాధిలో దించి, స్వహస్తాలతో వారిపై మట్టికప్పి వస్తున్నాం. వారు సంపాదించిన ఆస్తిపాస్తులు, ఆభరణాలు, హోదా, అధికారం ఏదీ వారు తమవెంట తీసుకు వెళ్ళడం లేదు. రిక్తహస్తాలతో వచ్చారు. అలానే వెళ్ళిపోతున్నారు. పవిత్ర ఖురాన్ ఇలా అంటోంది: ‘ఈ ్రపాపంచిక జీవితం ఒక ఆట, వినోదం తప్ప మరేమీ కాదు. అసలు జీవితం పరలోక జీవితమే. ఈ యథార్థాన్ని వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండు’ (29–64) అందుకని ప్రపంచమే సర్వస్వంగా బతక్కూడదు. ధర్మాధర్మాల విచక్షణ పాటించాలి. మంచి పనులు చేయాలి. రేపు మనల్ని కాపాడేవి ఇవే. ఎందుకంటే, మనం సంపాదించిన డబ్బూదస్కం, ఆభరణాలు, ఆస్తిపాస్తులు సమస్తం ఊపిరి ఆగిన మరుక్షణమే మనతో సంబంధాన్ని తెంచుకుంటాయి. భార్యాబిడ్డలు, బంధుగణం, మిత్రబృందం... వీరంతా మనల్ని సమాధి వరకు మాత్రమే సాగనంపుతారు. సమాధిలో దించి, మట్టిలో కలిపేసి వెళ్ళిపోతారు. మన వెంట వచ్చేది, కాపాడేది కేవలం మనం చేసుకున్న మంచి పనులు మాత్రమే. అడ్డదారులు తొక్కి, వారినీ వీరినీ వంచించి సంపాదించేదంతా సుఖమయ జీవితం కోసమేగదా.. రేపటి మన సంతోషం, మన పిల్లల భవిష్యత్తు కోసమేగదా? అక్రమ సంపాదనలో నిజమైన సంతోషం ఉండకపోగా, అది ఎప్పుడూ మనసులో కెలుకుతూనే ఉంటుంది. అయినా అంతరాత్మను అణగదొక్కి అడ్డదారికే ్రపాధాన్యతనిస్తాం. కేవలం కొన్ని సంవత్సరాల ్రపాపంచిక జీవితం కోసమే ఇంతగా ఆలోచించే మనం, మరి శాశ్వతమైన రేపటి (పరలోకం) కోసం ఏం సంపాదిస్తున్నామన్నది కూడా ఆలోచించాలి. ఈ ‘రేపు’ మూన్నాళ్ళ ముచ్చట. కాని ఆ ‘రేపు ‘శాశ్వతం. దానికోసం ఏం చేస్తున్నాం.. ఏం దాస్తున్నాం? ఇదికదా అసలు ప్రశ్న. ఇహలోక జీవితం ఎలా గడిచినా పరలోక సాఫల్యం లభిస్తే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. దానికోసం ఆలోచించాలి. దానికోసం శ్రమించాలి. మంచీ చెడుల విచక్షణతో, ధర్మబద్ధంగా ముందుకు సాగితే, ఆ క్రమంలో ఎంత లభిస్తే అంతతో సంతృప్తి చెందితే అదే అసలు విజయం, అసలు సాఫల్యం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలతో... శుభాల పరిమళం..
మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యక్తిగతంగానో, సామూహికంగానో ఏదైనా మేలు జరిగినప్పుడు మానవ అంతరంగం ఆనందంతో పులకించడం సహజం. అలాంటి వాటిలో పండుగలు ముఖ్యమైనవి. వాటిలో రంజాన్ ఇంకా ముఖ్యమైనది. ముస్లిం సోదరులు జరుపుకునే ‘ఈద్’కి రంజాన్ మాసంతో సంబంధం ఉండటం వల్ల ఈ పండుగ అదే పేరుతో ప్రసిద్ధికెక్కింది. నిజానికి రమజాన్ అన్నది సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. దీనికింతటి ప్రత్యేకత రావడానికి కొన్ని కారణాలున్నాయి. సర్వ మానవాళికి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రమజాన్ మాసంలోనే అవతరించింది. మానవజాతికి జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి రమజాన్ మాసంలో అవతరించిన కారణంగానే ఈ మాసానికి ఇంతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయి. మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ అనే ఉపవాస వ్రతాన్ని కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జనహృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ విలువలను, సుగుణాలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపుకు మనసు పోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది. జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి సద్గుణాలు అలవడతాయి. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇలా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటును చేసిన విశ్వప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ మొదటి తేదీన ఈద్ జరుపుకుంటారు. దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం ఈద్. తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు ఈద్. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయం అని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు ఈద్. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా దానికనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదన్న విషయం ఎంత సత్యమో, ఈ అశాశ్విత దేహం నుండి ఆత్మ ఎప్పుడు వీడిపోతుందో ఎవరికీ తెలియదన్నదికూడా అంతే సత్యం. అందుకే ఈ ఆత్మజ్యోతి ఆరిపోకముందే జాగృతమై దైవం వైపు మరలాలి. జరిగిపోయిన తప్పుల్ని సవరించుకొని రుజుమార్గం పైకిరావాలి. మనం తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పవిత్ర రమజాన్ దీనికి చక్కని అవకాశం కల్పించింది. ఈ నెల్లాళ్ళూ ఎంతటి నియమ నిష్టలతో గడిపారో ఇకముందు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామని ప్రతిన బూనాలి. ఈద్ పర్వదినం సందర్భంగా ఇలాంటి దృఢ సంకల్పం చెప్పుకుంటే అది నిజమైన పండుగ రోజు అవుతుంది. జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసే శుభదినం అవుతుంది. ఒకవేళ ఈవిషయాలపట్ల శ్రద్ధ వహించక పోతే ఈద్ సౌభాగ్యానికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పవిత్ర జీవితం గడిపే ప్రయత్నం చెయ్యాలి. పండుగ రోజు వేకువ ఝామునే నిద్రలేచి స్నానపానాదులు ముగించుకొని ప్రాతః కాల ఫజర్ నమాజు చేయాలి. ఉన్నంతలో మంచి దుస్తులు ధరించి, అత్తరు లాంటి సువాసన ద్రవ్యాలను వినియోగించాలి. ఈద్గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేయాలి. కరోనా కారణంగా ఈసారి ఈద్ గాహ్‌లలో కాకుండా మసీదులలోనే మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తూ నమాజు ఆచరించవలసి ఉంది. తమ అపరాధాలను మన్నించమని, సన్మార్గాన నడపమని దుఆ చేయాలి. సమస్త మానవాళి సుఖసంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. వ్యాధుల బారినుండి, అప్పుల బారినుండి, శత్రువుల బారినుండి,కరువుకాటకాల నుండి, దారిద్య్రం నుండి తమను, దేశాన్ని, యావత్ భూప్రపంచాన్ని రక్షించమని, ముఖ్యంగా కరోనా మహమ్మారి నుండి మానవాళినంతటినీ కాపాడమని విశ్వప్రభువును వేడుకోవాలి. స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు, పరిచితులు, అపరిచితులందరితో సంతోషాన్ని పంచుకోవాలి. ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకోవాలి. అన్ని సందర్భాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలి. పండుగ పరమార్థాన్ని అవగాహన చేసుకుంటే రమజాన్ ఆరాధనల ఆశయం నెరవేరుతుంది. భావి జీవితాలు సుఖసంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయి. ఒక చక్కని సుందర సమాజం ఆవిష్కృతమవుతుంది. పండుగ పంచిన మంచి మానవ జీవితాల్లో చివరి శ్వాస వరకూ గుబాళించాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అరుదైన ఖురాన్.. ఏడాదిలో ఒకసారి బయటికి..
సాక్షి, గట్టు (గద్వాల): సుమారు 238 ఏళ్ల నాటివిగా భావిస్తున్న అరుదైన.. అగ్గి పెట్టేకన్నా చిన్న సైజులోని పవిత్ర ఖురాన్ గ్రంథాలను మిలాదున్ నబీ సందర్భంగా బయటకు తీశారు. గట్టులోని జామీయా మసీదు, బిచ్చాలపేటలోని మసీదులో ఈ గ్రంథాలు ఉండగా.. ఏడాదిలో ఒకేఒక్క సారి మాత్రమే బయటకు తీస్తారు. మొత్తం 480 పేజీలు... 30 పారే (పర్వాలు)లు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇందులోని అక్షరాలను భూతద్దం ద్వారా చూస్తేనే కంటికి కన్పిస్తాయి. ఇక్కడి ముస్లింలు తరతరాలుగా ఈ గ్రంథాలను పవిత్రంగా బావిస్తూ, భద్రపరుస్తూ వస్తున్నారు. ఖురాన్‌ను మంత్రోచ్ఛరణల మధ్య మత పెద్దలు బయటకు తీస్తారు. కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే సందర్శనార్థం ఉంచి మళ్లీ లోపల భద్రపరుస్తారు. ఈ గ్రంథాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయనేది ఇక్కడి వారి నమ్మకం. మొగల్ కాలం నుంచి.. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో గట్టులో జామీయా మసీదును నిర్మించినట్లుగా స్థానిక ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. తరతరాలుగా ఈ అతి చిన్న పరిమాణం (ఇంచున్నర) ఉన్న ఖురాన్ గ్రంథాన్ని ఎంతో భక్తితో, జాగ్రత్తగా మసీదులో భద్రపరుస్తున్నారు. మక్కా, మదీనా నుంచి ఈ గ్రంథంతో పాటు ఆసర్ ముబారక్ (మహమ్మద్ ప్రవక్త వెంట్రుక) తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రతీ ఏడాది వీటిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన ముస్లీంలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. -
సకల శుభాల సంరంభం
ముస్లింలు జరుపుకునే రెండు ప్రధాన పండుగల్లో ఈదుల్ ఫిత్ర్ ఒకటి. దీన్నే సాధారణంగా రమజాన్ పండుగ అని వ్యవహరిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారు మక్కా నగరం నుండి మదీనా నగరానికి వలస వెళ్ళిన పద్ధెనిమిది నెలల తరువాత, రమజాన్ నెల మరి రెండురోజుల్లో ముగుస్తుందనగా, హిజ్రిశకం రెండవ సంవత్సరంలో సదఖ, ఫిత్రా, ఈద్ నమాజులకు సంబంధించిన ఆదేశాలు అవతరించాయి.‘‘ఎవరైతే పరిశుధ్ధతను పొంది, అల్లాహ్ నామాన్ని స్మరిస్తూ ఈద్ నమాజు ఆచరించారో వారు సాఫల్యం పొందుతారు.’ అని ఖురాన్ చెబుతోంది.ఒకసారి హజ్రత్ అబుల్ ఆలియా.. అబూఖుల్ దాతో.. ‘రేప మీరు నమాజు కోసం ఈద్ గాహ్‌కు వెళ్ళేముందు ఒకసారి నావద్దకు వచ్చి వెళ్ళండి.’అన్నారు.మరునాడు అబూఖుల్దా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు.. ‘‘ఏమైనా భుజించారా?’’ అని అడిగారు.‘‘అవును, భుజించాను’’ అన్నారు ఖుల్ దా‘‘గుస్ల్ (స్నానం) చేశారా?’’ అని మళ్ళీ ప్రశ్నించారు.‘చేశాను. అన్నారాయన‘‘మరి, జకాత్, ఫిత్రాలు చెల్లించారా??’ అని అడిగారు మళ్ళీ.‘‘ఆ..ఆ.. చెల్లించాను.’’ అన్నారు అబుల్ ఖుల్దా.’శుభం. ఇక చాలు.. ఈవిషయాలే అడుగుదామని రమ్మన్నాను. ఖురాన్ వాక్యంలోని సారాంశం కూడా ఇదే’ అన్నారు అబుల్ ఆలియా.పవిత్రఖురాన్‌లో ‘ఈద్ ’ అనే పదం ఓ ప్రత్యేక అర్ధంలో మనకు కనిపిస్తుంది. సూరె మాయిదాలో దైవ ప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాం, ఆకాశం నుండి ‘మాయిదా’ను(ఆహార పదార్ధాలతో నిండిన పళ్ళెరాలు)అవతరింపజేయమని దైవాన్ని వేడుకున్నారు. ‘ప్రభూ..! మాముందు వడ్డించిన విస్తరినొకదాన్ని ఆకాశం నుండి అవతరింపజేయి. అదిమాకూ, మా పూర్వీకులకూ, రాబోయే తరాలకూ ఈద్ (పండుగ)రోజు అవుతుంది.’ అని ప్రార్ధించారు.తరువాత, ఆయన ఇజ్రాయేలీయులతో, మీరు 30 రోజుల వరకు ఉపవాస వ్రతం పాటించి, ఆకాశం నుండి ‘మాయిదా’ వర్షింపజేయమని అల్లాహ్ ను ప్రార్థించండి. ఆయన మీ వేడుకోలును స్వీకరిస్తాడు. ఎందుకంటే, స్వయంగా ఆచరించిన వారికే దాని ప్రతిఫలం లభిస్తుంది.’ అన్నారు. వారి మాట ప్రకారం, ఇజ్రాయేలీయులు 30 రోజులు ఉపవాసం పాటించారు. దాంతో ఆకాశం నుండి ‘మాయిదా’ అవతరించింది. అది ఎంత తిన్నా తరిగేది కాదు. అందుకే మాయిదా అవతరణను క్రీస్తుమహనీయులు పండుగ(ఈద్)తో పోల్చారు. అంటే, దైవానుగ్రహాలు పొంది సంతోషాన్ని, ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేయడం ప్రవక్తల సంప్రదాయం అన్నమాట. ఈ విషయం పవిత్ర ఖురాన్లో ఇలా వుంది: ‘ప్రవక్తా.!వారికిలా చెప్పు. ఈ మహాభాగ్యాన్ని అల్లాహ్ మీకోసం పంపాడంటే ఇది ఆయన అనుగ్రహం, కారుణ్యమే. దానికి వారు ఆనందోత్సాహాలు జరుపుకోవాలి.’(10–58)ఆయన అనుగ్రహాల్లో అత్యంత గొప్ప అనుగ్రహం పవిత్రఖురాన్ అవతరణ. ఇది మానవాళి మార్గదర్శిని.రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుచేసే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి.అల్లాహ్ అనుగ్రహాలను గురించి గనక మనం ఆలోచించగలిగితే, మానవ మనుగడకోసం ఆయన ఎన్ని ఏర్పాట్లు చేశాడో అర్ధమవుతుంది. మానవుడు మాతగర్భం నుండి భూమిపై పడగానే అతని కోసమే సృష్టిమొత్తం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇన్ని అనుగ్రహాలు తమపైకురిపించినందుకు కృతజ్ఞతగా ప్రవక్త మహనీయులవారి సంప్ర దాయం వెలుగులో భక్తిశ్రద్ధలతో ‘ఈద్’ జరుపుకుంటారు. అధికంగా ఆరాధనలు చేస్తారు. సదఖ, ఖైరాత్, ఫిత్రా, జకాత్ తదితర పేర్లతో దానధర్మాలు చేస్తారు.పేద సాదలు కూడా తమతో పాటు పండుగ సంతోషంలో పాలుపంచుకునేలా ఫిత్రాల రూపంలో ఆర్థికంగా సహకరిస్తారు. రమజాన్ నెలవంక దర్శనంతో మొదలైన ఉపవాసాలు నెలరోజుల తరువాత షవ్వాల్ చంద్రవంక ను చూడడంతో విరమిస్తారు. ఈ పండుగనే ‘ఈదుల్ ఫిత్ర్’అంటారు.పండుగరోజు ముస్లిములందరూ పొద్దున్నే స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్ నమాజ్ చేస్తారు. అనంతరం నూతన వస్త్రాలు ధరించి, అత్తరు, పన్నీరు లాంటి సుగంధాలు రాసుకొని ఆంనందోత్సాహాలతో ‘ఈద్ గాహ్’ కు బయలుదేరతారు. అందరూ ఒకచోట గుమిగూడి తమకు రోజా వ్రతం పాటించే మహాభాగ్యం కలగజేసినందుకు, మానవుల మార్గదర్శకం కోసం, సాఫల్యం కోసం పవిత్రగ్రంథం అవతరింపజేసినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ రెండు రకతులు నమాజ్ చేస్తారు.తరువాత ‘ఇమాం’ ఖురాన్, హదీసుల వెలుగులో సమాజానికి దిశా నిర్దేశన చేస్తూ సందేశ మిస్తాడు. అందరూ కలిసి దేవుని గొప్పదనాన్ని, ఘనంగా కీర్తిస్తారు. తమకోసం, తమ కుటుంబాలకోసం, బంంధు మిత్రుల కోసం, దేశంకోసం, దేశ ప్రజల సుఖ సంతోషాల కోసం, ప్రపంచ శాంతి కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అభివాదాలు, ఆలింగనాలు చేసుకుంటూ తమ అంతరంగాల్లోని ఆనందాన్ని పంచుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన తీపి వంటకాలను కులమతాలకతీతంగా మిత్రులు స్నేహితులందరికీ ‘ఈద్ ముబారక్’ శుభాకాంక్షలతో పంచి పండుగ జరుపుకుంటారు. ఈవిధంగా ‘ఈదుల్ ఫిత్ర్’ పండుగ మానవ సమాజంలో నైతిక, మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుంది. పరోపకార గుణాలను సహనం, సానుభూతి భావాలను ప్రోది చేసి, సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్య వాతావరణాన్ని సృజిస్తుంది. అల్లాహ్ మనందరికీ సన్మార్గ భాగ్యం ప్రాప్తింపజేయాలని, ప్రపంచం సుఖ సంతోషాలతో, శాంతి సామరస్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ ఈద్ నమాజ్ ఇలా... అందరూ ఈద్ గాహ్‌కు చేరుకున్న తరువాత వరుస క్రమంలో బారులు తీరి నిలబడతారు. ఇమాం అగ్రభాగంలో నిలబడి ఆరు, లేక పన్నెండు అదనపు తక్బీర్లతో రెండు రకతులు నమాజ్ చేయిస్తాడు. ఈద్ నమాజ్ సంకల్పం చేసుకున్న తరువాత, అల్లాహు అక్బర్ అని రెండుచేతులు పైకెత్తి నాభిపై, లేక గుండెలపై కట్టుకోవాలి. తరువాత ‘సనా’పఠించి, మళ్ళీ అల్లాహు అక్బర్ అని పలికి చేతులు పైకెత్తి కిందికి వదిలెయ్యాలి. ఇలా రెండుసార్లు చేసి మూడవసారి చేతులు కట్టుకోవాలి. ఇప్పుడు ఇమాం సూరె ఫాతిహా తరువాత, మరొక చిన్నసూరానో, లేక కొన్ని వాక్యాలో పఠించి రుకూ, సజ్దాలు చేస్తాడు. తరువాత రెండవ రకతుకోసం నిలబడి మళ్ళీ సూరె ఫాతిహా, మరికొన్ని వాక్యాలు పఠించి మూడు సార్లు అల్లాహు అక్బర్ అంటూ మూడుసార్లూచేతులు పైకెత్తి కిందికి వదిలేస్తారు. నాల్గవ సారి అల్లాహుఅక్బర్ అంటూ రుకూ చేస్తారు. తరువాత సజ్దాలు చేసి, అత్తహియ్యాత్, దురూద్‌లు పఠించి ముందు కుడి వైపుకు,తరువాత ఎడమ వైపుకు సలాం చెప్పడంతో, ఆరు అదనపు తక్బీర్ లతో రెండు రకతుల ఈద్ నమాజ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈద్ నమాజులో అజాన్, అఖామత్లు ఉండవు. తరువాత ఇమాం మింబర్ (వేదిక) ఎక్కి ఖురాన్, హదీసుల వెలుగులో ప్రస్తుత పరిస్థితులను అన్వయిస్తూ సమాజానికి సందేశం ఇస్తారు. -
ఆ మాటలు ఇమామ్‌కు నచ్చాయి
పూర్వం ఖుర్ ఆన్ వాక్యాలు ప్రజలకు వివరించిన నేరానికి ఇమామ్ హంబల్ పై కొరడా దెబ్బల శిక్ష అమలయ్యింది. ఒక్కో కొరడా దెబ్బ ఒంటిమీద పడ్డప్పుడల్లా ‘‘ఇబ్నుల్ హైసమ్ను అల్లాహ్ మన్నించు గాక’’ అని గట్టిగా అరిచేవారు. ఇబ్నుల్ హైసమ్ కరుడుగట్టిన దొంగ. దోపిడీదారుడు. ఇమామ్ గారిపై కొరడా దెబ్బ పడగానే దొంగను మన్నించమని అల్లాహ్‌ను వేడుకోవడమేమిటా అని చుట్టూ ఉన్నవారంతా ఆశ్చర్యపోతూ అడిగారు. ‘‘అందరూ అనుకున్నట్లుగానే అతను చెడ్డవాడే; కానీ అతను చెప్పిన మాట నాకెంతగానో నచ్చింది’’ అని ఇమామ్ గారు వివరించడం మొదలెట్టారు... ‘‘నేను క్రితంసారి జైలుకెళ్లినప్పుడు అతను పరిచయమయ్యాడు. శిక్షాకాలం ముగిశాక విడుదలయ్యేటప్పుడు జైలు ఆవరణలో నన్ను చూసి అతను ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ‘‘మేమంటే దొంగపనులు చేశాము కాబట్టి జైలు కొచ్చాను. దొంగతనాలు, లూటీలు చేయడం, జైలుకు రావడం, విడుదలవడం, మళ్లీ దొంగతనాలు చేయడం ఇదంతా మాకు మామూలే; కానీ మీరు ఇంత ధార్మిక పరులై జైలు ఊచలు లెక్కించడమేమిటి?’ అని ఆశ్చర్యపోయాడు.‘‘ఖుర్ఆన్ గ్రంథాన్ని అందరూ చదివి, అర్థంచేసుకుని ఆచరించాలని చెప్పిన పాపానికి నేను ఖైదు చేయబడ్డాను’’ అని సంజాయిషీ ఇచ్చుకున్నాను. ‘‘నేనిప్పటివరకూ లెక్కలేనన్ని సార్లు ఈ జైలుకు వచ్చాను. వందల కొరడా దెబ్బలు నన్ను ముద్దాడాయి. ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించినా నా దొంగ బుద్ధిని మాత్రం మార్చుకోవడానికి సిద్ధంగా లేను. నేను చేస్తున్నది షైతాన్ పని, షైతాన్ను ఎప్పుడూ ఓడిపోనివ్వను. షైతాన్ ప్రతినిధిగా నేనే ఇలా ఉంటే; అల్లాహ్ ప్రతినిధిగా ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ అనే మీరు అల్లాహ్ సందేశాన్ని వివరించడంలో ఇంకెంత దృఢంగా ఉండాలో. మీరెప్పటికీ ఓడిపోకూడదు’’ అని అతను చెప్పిన మాటలు నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే అతని క్షమాభిక్షకోసం వేడుకుంటున్నాను’ అని వివరించారు. – ముహమ్మద్ ముజాహిద్ -
సైతాన్ ఉన్న చోట
అబూబక్ర్ సిద్దీఖ్ (ర) ప్రవక్త ముహమ్మద్ (స) యొక్క అత్యంత ప్రియమైన మిత్రుడు. ఒకసారి ఆయన ప్రవక్త (స) తో పాటు ఇతర సహచరుల సన్నిధిలో కూర్చుని ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (ర) ను అనరాని మాటలు అంటున్నాడు. హజ్రత్ అబూబక్ర్ మౌనంగా వింటూన్నాడు. ప్రవక్త ముహమ్మద్ ( స) ఆ దృశ్యాన్ని చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతూన్నారు. ఆ వ్యక్తి లేనిపోని నిందలు వేస్తూ, ఇంకా ఏదేదో అంటుంటే, అబూబక్ర్ సహనం కోల్పోయి సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేసరికి, అప్పటి దాకా చిరునవ్వు నవ్వుతూ కూర్చున్న ప్రవక్త ముహమ్మద్ (స) అక్కడి నుండి లేచి వెళ్లిపోయారు.కాసేపటికి హజ్రత్ అబూబక్ర్, ప్రవక్త మహనీయుల వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్త ముహమ్మద్ (స)! ఆ వ్యక్తి నన్ను అనరాని మాటలు అంటుంటే మీరు ముసిముసిగా నవ్వుతూ కూర్చున్నారు. నేను వాడికి సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేసరికి మీరు లేచి వెళ్లిపోయారేమిటీ?’’ అని అడిగాడు.‘‘నిన్ను ఆ వ్యక్తి దూషిస్తున్నప్పుడు దైవదూతలు నీకు బదులుగా సమాధానం ఇస్తున్నారు. అది చూసి నేను నవ్వుతూ వింటున్నా. నీవు అతనికి సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేసరికి దైవదూతలు అక్కడ నుండి నిష్క్రమించారు. సైతాన్ మీ మధ్యలోకి వచ్చాడు. సైతాన్ ఉన్న చోట నేను ఉండలేను కదా. అందుకే అక్కడి నుంచి వచ్చేసాను’’ అని చెప్పారు.దూషణలకు దూషణ సమాధానం కారాదు. అలాంటి ఇద్దరి మధ్య సైతాన్ దూరి తన పని కానిస్తాడు. ఇద్దరి మధ్య వైరం రగిలించి, శత్రుత్వాన్ని పెంపొందించే పని చేస్తాడు. ఇంకా వారు ఒకరినొకరు ద్వేషించుకుంటూ, తమ సమయాన్ని చెడు పనులకు వినియోగిస్తారు. అందుకే ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. ‘ఓ ప్రవక్తా(స) మంచి చెడు ఒకటి కాదు. చెడును అతి శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించడానికి ప్రయత్నం చేయి. నీ ప్రాణ శత్రువు సైతం నీ ప్రాణ స్నేహితుడై పోవడం నీవు చూస్తావు. కాని ఈ అదృష్ట యోగ్యం అందరికీ సాధ్యం కాదు’ అని.ఇలాంటి సహన గుణం అలవరచుకోవడం కోసమే రంజాన్ మాసంలో నెలరోజుల ఉపవాస దీక్షతో శిక్షణ పొందేలా చేస్తుంది ఇస్లాం.‘మీరు ఉపవాసం పాటిస్తున్నప్పుడు, ఎవరైనా తిట్టినా లేదా జగడానికి దిగినా.. నేను రోజూ పాటిస్తున్నాను అని సమాధానం ఇవ్వండి’ అని ప్రవక్త (స )తెలిపారు. అంటే మీరు ద్వేషించే వారిని ఉపవాస దీక్ష ద్వారా ప్రేమించడం అలవర్చుకోవాలి. – షేక్ అబ్దుల్ బాసిత్ -
ప్రవక్త దృక్కోణంలో హక్కులు... బాధ్యతలు
సమాజంలో ప్రతి ఒక్కరికీ కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ముహమ్మద్ ప్రవక్త(స), ప్రజల సామాజిక బాధ్యతలను గుర్తుచేస్తూ, ధర్మం వారికిచ్చినటువంటి హక్కులను కూడా విశద పరిచారు. ముఖ్యంగా మానవ హక్కులను గురించి, వ్యక్తిగత స్వేఛ్ఛను గురించి విడమరిచి చెప్పారు. పరుల సంపదను హరించడం గురించి ఖురాన్ ఆదేశాలను వివరిస్తూ, ‘మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా, అక్రమంగా కబళించకండి’. అని చెప్పారు. అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది. ‘ఒకజాతి ప్రజలు మరోజాతి ప్రజలను అవహేళన చేయవద్దు. ఒకరికొకరు తమ ప్రతిష్టలకు భంగం కలిగించుకో వద్దు. మారుపేర్లతో ఒకరినొకరు పరిహసించుకోవద్దు. ఒకరి వెనుక ఒకరు చెడుగా మాట్లాడుకోవద్దు. నిందలు వేసుకోవద్దు. ప్రవక్త మహనీయులు తమ చివరి హజ్ యాత్ర సందర్భంగా చేసిన ప్రసంగం కూడా చరిత్రాత్మకమైనది:’ప్రజలారా! బాగా వినండి. అజ్జానకాలపు దురాచారాలన్నీ అంతమైపొయ్యాయి. అరబ్బు వ్యక్తికి అరబ్బేతరునిపై, అరబ్బేతరునికి అరబ్బుపై, తెల్లవారికి నల్లవారిపై, నల్లవారికి తెల్లవారిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మీ సేవకులను తక్కువ దృష్టితో చూడకండి. మీరు తినేలాంటి భోజనమే వారికి పెట్టండి. మీరు ధరించే లాంటి బట్టలే వారికీ సమకూర్చండి. మహిళలూ మీలాంటివారే. మీకు వారిపై ఏవిధంగా హక్కులున్నాయో, అదేవిధంగా వారికీ మీపై హక్కులున్నాయి. పరస్పరం హాని తలపెట్టుకోరాదు. ప్రాణాలు తీసుకోరాదు. ప్రళయకాలం వరకు కూడా..నేను మీకోసం రెండువస్తువులు వదిలి వెళుతున్నాను. మీరువాటిని దృఢంగా పట్టుకోండి. ఎన్నటికీ దారి తప్పరు. ఒకటి పవిత్రఖురాన్, రెండవది సున్నత్, అంటే నా సాంప్రదాయం’. అంతేకాదు, మీరు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో కల్పించుకోకండి. ఇతరులపై గూఢచర్యానికి పాల్పడకండి. మీ స్వగృహం తప్ప ఇతరుల ఇళ్ళలోకి వారి అనుమతి లేకుండా ప్రవేశించకండి’’ అని హితవు చేశారు. ఏవ్యక్తినైనా శిక్షించాలంటే, న్యాయస్థానంలో అతడి నేరం రుజువుకావాలి. ఇతరుల మతవిశ్వాసాలను గౌరవించాలని ఆదేశిస్తూ, వారి మతవిశ్వాసాలకు, హక్కులకు భంగం కలిగే చర్యలన్నిటినీ ఆయన నిషేధించారు. ఈ విధంగా ప్రవక్తమహనీయులు సమస్త హక్కులనూ నిర్వచించారు. మానవులు ఆ అమృత ప్రవచనాలను అర్ధం చేసుకొని ఆచరించగలిగితే, సమాజం అన్నిరకాల అసమానతలకు, లోపాలకు అతీతంగా విశిష్ట సత్సమాజంగా రూపుదిద్దుకుంటుంది. అల్లాహ్ మనందరికీ విజ్ఞానాన్ని, సద్బుద్ధినీ ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
శ్రీ కృష్ణుడికి డబ్బింగ్ చెప్పాను!
పొద్దున్నే ఖురాన్ తెలుగులో చదవడం...సాయంత్రం శ్రీకృష్ణుడిపాత్రకు గాత్రం ఇవ్వడం...సినిమాలు, సీరియల్స్, ప్రకటనలు, డాక్యుమెంటరీలు... అన్ని విభాగాలలోను తన గొంతుతో సుపరిచితులయ్యారు యూసఫ్. సుమారు 500 కు పైగా చిత్రాలకు, సీరియల్స్‌కు డబ్బింగ్ చెప్పిన యూసఫ్ ప్రస్తుతం ఉద్యోగరీత్యా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు.తన డబ్బింగ్ ప్రయాణంగురించి ఫోన్ ద్వారా సాక్షితో సంభాషించారు.. మాది ఖమ్మం జిల్లా ఇష్టాపురం. నాన్నది టైలర్ వృత్తి. అమ్మ గృహిణి. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంకామ్ చదివాను. ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేయడానికి హైదరాబాద్ వచ్చాను. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. కొత్త స్నేహాలు కలిశాయి. మిత్రులందరితో తరచూ ఫోన్లో సంభాషించేవాడిని. నా గొంతు విన్నవారంతా ‘నీ గొంతు బాగుంది, చక్కగా వాడుకోవచ్చు కదా’ అని తరచుగా అనేవారు. వారి ప్రోత్సాహంతో కొన్ని వ్యాపార ప్రకటనలను స్వయంగా రచించి, నేనే నటించి, నా గాత్రంతో వినిపించాను. కొన్ని ఆడియో క్యాసెట్లకు కూడా గొంతు ఇచ్చాను. ఆ తరవాత మిత్రుల సహకారంతో సినిమాలో డబ్బింగ్ చాన్స్ కోసం ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘జెండా’ చిత్రంలో డబ్బింగ్ చెప్పడానికి అవకాశం వచ్చింది. ఆ సినిమా కొత్తవారితో తీస్తున్నారని తెలిసి నేను కూడా ఒక ప్రయత్నం చేద్దామని, సెలక్షన్స్ కోసం రామానాయుడు స్టూడియోకి వెళ్లాను. ఎన్నో పరీక్షల తరవాత నన్ను ఎంపిక చేశారు. అక్కడే డబ్బింగ్ ఎలా చెప్పాలనే విషయంలో మంచి శిక్షణ పొందాను. ‘రెండు మూడు రోజుల తరవాత ప్రారంభిద్దాం’ అనడంతో వెళ్లిపోయాను. సినీ రంగ ప్రవేశం మళ్లీ పిలుస్తాను అనడం, పిలుపు రాకపోవడం మామూలే. ఎంత కాలం గడిచినా నాకు పిలుపు రాలేదు. డబ్బింగ్ యూనియన్‌లో మెంబర్షిప్ లేకపోవడం వల్ల అవకాశం చేజారిపోయిందని తరవాత తెలిసింది. ‘జెండా’ సినీ నిర్మాత ప్రోత్సాహంతో డబ్బింగ్ యూనియన్‌లో మెంబర్షిప్ తీసుకున్నాను. ఆ సినిమాకి డబ్బంగ్ ఇన్చార్జ్గా ఉన్న మిఠాయి చిట్టిగారు ‘ధైర్యం కోల్పోవద్దు’ అని నన్ను ప్రోత్సహించారు. ఆ తరవాత జరిగిన ఆడిషన్స్‌లో నేను సెలక్ట్ అయ్యాక, మంచి మంచి అవకాశాలు వచ్చాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యులైన గోగినేని ప్రసాద్, కాంచనబాబు, మరికొందరు అవకాశాలు ఇవ్వడంతో నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాను. అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. ఒకేరోజు పాతిక సీరియల్స్ సినిమాలలో చెబుతుండగానే, ‘చక్రవాకం’ సీరియల్‌తో బుల్లితెర అవకాశాలు వచ్చాయి. ఆ తరవాత వరుసగా సీరియల్స్‌కి డబ్బింగ్ ఇవ్వడం ప్రారంభించాను. సినిమాలు, టీవీ సీరియల్స్‌తో బాగా బిజీ అయిపోయాను. ఉదయం ఏడు నుంచి రాత్రి పది గంటల వరకు పనిచేసినా, కొన్ని సీరియల్స్ వదులుకోవలసి వచ్చింది. సినిమా అవకాశాలు మాత్రం వదులుకోలేదు. ఒకేరోజు టెలికాస్ట్ అయ్యే సీరియల్స్‌లో సుమారు పాతిక సీరియల్స్‌లో నా గొంతు ఉండేది. గొంతుకు గుర్తింపు సినిమాలు, సీరియల్స్‌తో పాటు ఎన్జిసి, డిస్కవరీ చానల్స్‌లో కూడా వాయిస్ ఓవర్ ఇస్తుండేవాడిని. ఆకాశవాణి నాటకాలలో, ఆడియో క్యాసెట్లు ... ఒక్కమాటలో చెప్పాలంలో 2004 నుంచి టీవీ చూసేవారందరికీ తప్పనిసరిగా నేను చిరపరిచితుడిని. నన్ను వ్యక్తిగతంగా గుర్తుపట్టరు కాని, నా గొంతును గుర్తుపడతారు. అలా డబ్బింగ్లో స్థిరపడిపోయాను. నా డబ్బింగ్ ప్రయాణంలో పెద్ద ఇబ్బందులేవీ ఎదుర్కోలేదు. వచ్చిన అవకాశాలన్నీ జాగ్రత్తగా ఉపయోగించుకున్నాను. ముందస్తు డబ్బింగ్ రెండుమూడు రోజులు ఊరు వెళ్లవలసి వస్తే, ముందుగానే డబ్బింగ్ చెప్పి వెళ్లేవాడిని. పనులన్నిటినీ జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవలసి వచ్చేది. నాకు శ్రావణితో వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు, ఆర్యన్, రయాన్. నా వివాహ సమయంలో సెలవు పెట్టవలసి వచ్చింది. వేరే వారితో డబ్బింగ్ చెప్పిస్తే, సీరియల్స్ దెబ్బ తింటాయని చెప్పడంతో, ముందుగానే డబ్బింగ్ పని పూర్తిచేసుకున్నాను. 2017 వరకు దాదాపుగా 500 పైగా సీరియల్స్, చిత్రాలకు డబ్బింగ్ చెప్పాను. ఇందిరా ప్రొడక్షన్స్, గోపీకృష్ణ మూవీస్, శ్రీకాంత్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ... వంటి అనేక మంచి మంచి సంస్థలలో డబ్బింగ్ చెప్పాను. 2013లో జరిగిన మహాకుంభమేళాకు సంబంధించి అరవై నిమిషాల నిడివితో ఒక కార్యక్రమం రూపొందించారు. అందులో నా గాత్రం ఉపయోగించుకున్నారు. శ్రీకృష్ణుడికి గాత్రం ఎన్ని సినిమాలు, సీరియల్స్‌కి చెప్పినా నాకు బాగా గర్వంగా, తృప్తిగా అనిపించింది మాత్రం శ్రీకృష్ణుడి పాత్రధారికి చెప్పిన డబ్బింగ్. టీవీలో వస్తున్న మహాభారతం సీరియల్లో శ్రీకృష్ణుడి పాత్రకు నాలుగైదు సార్లు అంటే నాలుగైదు సీరియల్స్‌లో డబ్బింగ్ చెప్పాను. బి.ఆర్చోప్రా రూపొందించిన మహాభారత్‌ను తెలుగులోకి డబ్ చేసినప్పుడు, అందులో శ్రీకృష్ణుడిగా వేసిన ‘నితీష్ భరద్వాజ్’కి తెలుగులో డబ్బింగ్ చెప్పాను. నా కోసమే ఆగారేమో అన్నట్లుగా ఎంతోకాలం తరవాత ఆ సీరియల్‌ని తెలుగులో డబ్ చేశారు. నాకెంత సంతోషం కలిగిందో చెప్పలేను. ‘జై హనుమాన్’ చిత్రంలో శ్రీరాముడు పాత్రకు, ఆ తర్వాత శ్రీకృçష్ణుడి పాత్రకు నాలుగైదు సార్లు డబ్బింగ్ చెప్పాను. ‘హరహరమహాదేవ’ సీరియల్లో విష్ణుమూర్తి ప్రాతకు కూడా డబ్బింగ్ చెప్పాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కోయిలమ్మ, కుంకుమభాగ్య, శ్రీఆంజనేయం సీరియల్స్‌లో ప్రముఖంగాడబ్బింగ్ చెప్పాను. ‘ఆడదే ఆధారం’ సీరియల్లో మొదటిసారిగా విక్రమ్‌భాయ్ అనే విలన్ పాత్రకి డబ్బింగ్ చెప్పడం నాకొక టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి విలన్‌కి చెప్పే అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా అన్ని విలక్షణ పాత్రలకు చెప్పాను. పౌరాణికాలంటే ఇష్టం ఉదయం ‘తెలుగు ఖురాన్’ రికార్డు చేసి, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు శ్రీకృష్ణుడి పాత్రకు డబ్బింగ్ చెప్పాను. నాకు చిన్నప్పటి నుంచి పౌరాణికాలంటే ఇష్టం. శ్రీకృష్ణుడు నా డ్రీమ్ క్యారెక్టర్. మహాభారతం ద్వారా నా కల నెరవేరడం నా అదృష్టం. శ్రీకృష్ణుడి పాత్రకు గట్టి పోటీనే ఎదురైంది. 50 మంది గొంతుకలలో నా గొంతును ఎంపిక చేశారు. ‘నేను ఎవరు’ అనేది పట్టించుకోకుండా, నిష్పక్షపాతంగా ఆలోచించి, నాకు ఆ అవకాశం వచ్చేలా చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి... ఇలా నా డ్రీమ్ క్యారెక్టర్స్‌కి అనేకమార్లు డబ్బింగ్ చెప్పడం నా పూర్వజన్మ సుకృతంగా భావించాను. ఎంతోమంది కలలు కన్నా దక్కని అదృష్టం, నాకు రావడం నిజంగా నా పూర్వజన్మ పుణ్యమే. ప్రకటనలకు... ∙శ్రీరామావారి కాలమానం (థియేటర్లలో ప్రదర్శించారు), నివేదిత గ్రామర్ స్కూల్, జ్ఞానభారతి, కేర్ మినరల్ సోడా, డంకన్స్ నంబర్ వన్ టీ (నటన కూడా. దక్షిణభారతదేశంలో అన్ని భాషలలోను వచ్చింది) ∙కొందరు రాజకీయనాయకులకు పాటలు, డైలాగులు కూడా రాశాను. చిత్రాలు ∙ప్రిన్స్ ఆఫ్ పర్షా్య (తెలుగులోకి అనువాదమైన హాలీవుడ్ చిత్రం) ∙దాసరి గారి ‘యంగ్ ఇండియా’ లో మహానటి సావిత్రి మనవడు అభినయ్‌కి డబ్బింగ్ చెప్పాను ∙50 పర్సెంట్ లవ్, అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ (రణ్‌బీర్ కపూర్), జబ్ వి మెట్ (షాహిద్ కపూర్) ∙20కి పైగా చిన్న సినిమాలలో హీరోలకు చెప్పాను ∙ ఆదిత్య ఓం (మా అన్నయ్య బంగారం) ఇలా అనేక చిత్రాలలో నా గొంతు ప్రముఖంగా వినిపిస్తుంది. నాకు బాగా నచ్చిన చిత్రం ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ). హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 8, కెప్టెన్ వీరరాజారెడ్డి వీధి... కాశ్మీర్లో టెర్రరిస్టుల అటాక్‌లో 26 సంవత్సరాల వయసులో మరణించిన వీరరాజారెడ్డి పేరు పెట్టారు ఆ వీధికి. ఆయన మరణించిన సంవత్సరం తరువాత వచ్చిన గణేశ్ నవరాత్రుల సమయంలో అంటే 2003లో ఆయనకు సంబంధించిన వివరాలు డ్రామాగా రూపొందించి ‘సౌండ్ అండ్ లైట్’æ షోగా ప్రదర్శించాను. అందులో కాశ్మీరు సెట్ వేసి, తొమ్మిదిరోజులూ ప్రదర్శించాం. నేను స్క్రిప్ట్ రాసి, వాయిస్ ఓవర్ చెప్పాను. ఆయన పాత్ర కూడా నేనే పోషించాను. హిమాలయాలతో కూడిన, కాశ్మీర్ సెట్, ఆయనకు బుల్లెట్స్ తగలడం అంతా లైవ్‌గా చేశాం. అది నా జీవితంలో ముఖ్యమైన ఘట్టం. – సంభాషణ: వైజయంతి -
దావూద్ కొడుకు దారిలోనే ఛోటా షకీల్ కొడుకు..!
సాక్షి, ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్‌కు షాక్ తగిలింది. అతని ఒక్కగానొక్క కొడుకు ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగులేయడంతో అరవయ్యేళ్ల పైబడ్డ షకీల్‌కు ఏమీ పాలుపోవడం లేదు. షకీల్ కొడుకు ముబషీర్ షైక్ (18) పవిత్ర ఖురాన్లో ఉన్న 6236 పద్యాలు కంఠస్తం పట్టడంతో ఇప్పటికే వార్తల్లో నిలిచాడు. ముబషీర్ ‘హఫీజ్ ఎ ఖురాన్’గా మారాడనీ, కరాచీలోని ఓ మసీదులో ప్రజలకు ఖురాన్‌ను బోధిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కొడుకు వ్యవహారంతో షాక్ తగలగా..ఆయన అనుచరుడు ఛోటా షకీల్‌కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. దావూద్ కొడుకు మోయిన్ నవాజ్ (31) ఇస్లాం మత ప్రబోధకుడి (మౌలానా)గా మారడంతో అతను డిప్రెషన్‌కు గురైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దావూద్, అతని ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్ కొడుకు కూడా ఆధ్యాత్మిక జీవితానికే మొగ్గుచూపడంతో ముంబై అండర్‌వరల్డ్‌లో తీవ్ర అలజడి నెలకొంది. దీంతో డీ-గ్యాంగ్ సృష్టించిన కోట్ల రూపాయల అధో ప్రపంచానికి వారసుడు కరువయ్యాడని కొందరు చెప్తున్నారు. కాగా, ముబషీర్ అంటే మంచి వార్తలు మోసుకురావడం అని అర్థం. దావూద్ కొడుకు స్ఫూర్తితో ముబషీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని పలువురు భావిస్తున్నారు. -
రోహిల్లా కథ ‘లోవిషయం’
మహనీయులకి సంబంధించిన ఏ కథ విన్నా, ఆ కథని ఓ నవలలానో, ఆధునిక కథలానో కేవలం కాలక్షేపం కోసం చదివేసి అవతల పడెయ్యకూడదు. మనం చెప్పుకోబోయే కథలన్నీ ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించే కథలు కాబట్టి, ఎవరి ఆత్మల్లో వారికి మాత్రమే కనిపించే భగవంతునికి సంబంధించిన కథలు ఈ కథలన్నమాట. ఊరికే పై కథని వినేసి ‘కథని వినేశా’ అనుకుంటే అది ఓ రమణీయమైన భవనాన్ని వెలుపలి నుంచి అలా చూసి, అక్కడి నుంచి కదిలిపోయిన దాంతో సమానమే. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే ఎందరో భక్తులు దైవ కథలని కేవలం పై దృష్టితోనే వినడం, చదువుకోవడం చేస్తుంటారు. ఆ కథలో దాగిన అంతరార్థాన్ని గానీ కొద్దిగా పరిశీలించి, గ్రహించినట్లయితే ఇక ఆ కథని కథగా ఏనాడూ భావించం. ఈ దృష్టితో బాబా సచ్చరిత్రలో కనిపించే రోహిల్లా కథని చదువుకుందాం! రోహిల్లా కథ రోహిల్లా అనే పహిల్వాన్ ఉంటూండేవాడు. అతను ఆ నోట ఈ నోట సాయి గుణ గణాలను విని, ఆయన్ని ఒక్కసారి దర్శించాలని షిరిడీకొచ్చాడు.సాయిని దర్శించి కొన్ని రోజులపాటు షిరిడీలోనే ఉండిపోయాడు. సాయి కూడా ఇతణ్ని బాగా ఆదరిస్తూ ఉండేవాడు. రోహిల్లా కూడా సాయిని దాదాపు భగవంతునిగానే భావించేవాడు.ఇతనికి ఓ చిత్రమైన లక్షణముండేది. మహమ్మదీయుడూ అల్లాహ్ భక్తుడైన రోహిల్లా అకస్మాత్తుగా పెద్దగొంతుతో ‘అల్లాహ్ హో అక్బర్’ అని చెవులు పగిలిపోయేంత శబ్దంతో అరుస్తుండేవాడు. పగలైతే పెద్దగా ఎవరికీ పట్టదుగానీ, రాత్రివేళ షిరిడీ మొత్తం ప్రశాంతంగా ఉండే వేళ,అందరూ శ్రమించి శ్రమించి ఇంటికొచ్చి పరుండే వేళ ‘అల్లాహ్ హో అక్బర్’ అని అరుస్తూ ఉండేవాడు. ఆ అరుపుకి గుండెలు పగిలిపోతాయా? అనిపించేది చుట్టూ ఉన్నవారికి. ఒకట్రెండు సార్లు అతనికి తాము పడుతున్న ఇబ్బందిని గురించి సామూహికంగా వెళ్లి చెబ్దామని షిరిడీ ప్రజలు భావించారు. కానీ, మెడ నుంచి పాదాల వరకూ కఫనీ వేసుకుని, దృఢంగా ఉండి, అతని పెద్ద గొంతుక పగిలిపోతుందా? అనే స్థాయిలో మాట్లాడే అతణ్ని సమీపించలేక వెనక్కి తిరిగొచ్చేశారు. అతను ఎవరితోనైనా వివాదపడే సందర్భాన్ని చూస్తే కూడా, భయం వేస్తుండేది. ఎవరైనా, తనని అభ్యంతరపెడతారేమో అనే ఆలోచన కూడా లేకుండా విపరీతమైన అహంకారంతో ఉండేవాడు రోహిల్లా. అయితే అదంతా బయట మాత్రమే. సాయి దగ్గర మాత్రం పిల్లాడిలా ఉండేవాడు. ఒక రాత్రివేళ ఖురాన్‌లోని కల్మాలని పెద్దగొంతుతో అరుపులా వినిపించేలా చదువుతూండేవాడు. షిరిడీ ప్రజలంతా ఈ అర్ధరాత్రి నిద్రాభంగం కారణంగా మర్నాడు పనుల్ని చేసుకోలేకపోతూండేవాళ్లు. ఒకసారి షిరిడీ ప్రజలందరికీ ఒక ఆలోచన వచ్చింది. మనకీ, అతనికీ సంరక్షకుడు సాయి భగవానుడే కాబట్టి, ఆయనకే మన బాధని చెప్పుకుని ఆయన ద్వారానే సమస్యని పరిష్కరించుకోవడం బాగుంటుందని నిర్ణయించుకున్నారు. అందరూ సాయి వద్దకి కలిసికట్టుగా వెళ్లి విషయాన్ని వివరించి రక్షించవలసిందని కోరారు.షిరిడీవాసులంతా చెప్పింది విన్న సాయి ఆశ్చర్యపడలేదు. అయ్యో! అనలేదు. తప్పక మీ సమస్యని తీరుస్తానని హామీ ఇవ్వలేదు. పైపెచ్చు ‘రోహిల్లా నాకు మంచి భక్తుడు. నాకెంతో ఇష్టుడు కూడా. అతనిదో చిత్రమైన జీవితగాథ. అతనికో భార్య ఉంది. అమెని నిరంతరం ప్రేమిస్తూ ఉండేవాడు రోహిల్లా. అయినప్పుటికీ అమె విసుగ్గా, కోపంగా, చిరాగ్గా ఉంటూ నిరంతరం సూటిపోటి మాటలతో అతణ్ని మానసికంగా హింసిస్తుండేది. కొంతకాలం పాటు రోహిల్లా ఆమెని ‘శరీరంలో ప్రవేశించిన వ్యాధి’లా భరించాడు. కానీ ఇక కొంతకాలానికి అతనికి ఆమెతో కలిసి ఉండటం భరింపశక్యం కానిదైంది. దాంతో ఆమెని తరిమేశాడు రోహిల్లా. ఆ దుర్మార్గురాలికి సిగ్గూ, అభిమానం, బిడియం.. వంటివేమీ లేవు సరికదా సంస్కారానికీ, సంప్రదాయానికీ ఎంతో దూరంగా ఉంటూ.. తనని బలవంతాన తరిమేసినా ఏదో ఒక వంక పెట్టుకుని ఇంట్లోకి దూసుకొస్తుండేది. ఆమె వచ్చి ఉన్న ఆ గంటో, రెండుగంటల కాలమో కూడా రోహిల్లాకి పరమ నరకంలా అనిపిస్తుండేది. ఈమె రాకని ఎలా నివారించాలా? ఎలా బుద్ధి చెప్పాలా? అనుకుంటూ ఒకసారి ఎందుకో ఆమె చేసే పనులకి తీవ్రకోపం వచ్చి పెద్దగొంతుతో ఆమెని నిందించడం మొదలెట్టాడు. ఆ పెద్దగొంతుకీ, అరుపులకీ భయపడి ఆమె రోహిల్లా వద్దకి రావడం మానేసింది. ఎప్పుడు రోహిల్లా అరుపులు మానితే అప్పుడు అక్కడికి ప్రత్యక్షమౌతుండేది. ఇప్పుడిలా అరుపులు, కేకలు పెద్దగొంతుతో ఖురాన్‌లోని ధర్మవాక్యాలైన కల్మాలనీ రోహిల్లా చదవడం మొదలెట్టేసరికి రావడం మానేసింది. ఈయన అరుపుల్ని విని పారిపోవడం చేస్తోంది.ఒక్కమాటలో చెప్పాలంటే రోహిల్లా నా దగ్గరకి వచ్చాక నాకూ శాంతంగా ఉంది. రాత్రిపూట పరమ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. రోహిల్లాని తరిమేస్తే, అతని భార్య నా వద్దకొచ్చి నన్నూ బాధపెడుతుంది. ఇంత ఉపకారి అయిన రోహిల్లానీ, అతని అరుపుల్నీ ఆనందంగా భరించండి. కొన్నాళ్లకి మీకూ నాలా అలవాటైపోతుంది. ఆ గయ్యాళి భార్య మీతో, అతనితో, నాతో కూడా వివాదపడదు’ అన్నాడు బాబా.బాబానే ఇలా మాట్లాడేసరికి గ్రామస్థులంతా నివ్వెరబోయారు. మారు మాట్లాడకుండా తిరిగి వెళ్లిపోయారు. అసలు విషయం ఇదీ... రోహిల్లా... బాబా షిరిడీకి వచ్చేనాటికే వచ్చి ఉన్నవాడు కాడు. పోనీ షిరిడీ గ్రామవాసి అస్సలు కాడు. అక్కడక్కడి జనమంతా సాయిని గురించి చెప్తూ చెప్తూ ఉంటే సాయి సమక్షానికొచ్చాడు. దర్శనంచేసుకుని వెళ్లిపోదామనుకున్నవాడు కాస్తా ఆయన దగ్గరే ఉండిపోయాడు కూడా.రోహిల్లా మొదటిసారిగా సాయి వద్దకి వచ్చి, దర్శించగానే అతనికి కలిగిన అనుభూతి అతణ్ని షిరిడీ నుంచి పోనీయకుండా ఆపేసింది. అంతేకాదు. సాయి క్షేత్రపంక్తుల్లో ఉండే యధార్థమైన అనుభూతిని రోహిల్లా పొందగలిగాడు కూడా. దాంతో షిరిడీలో, అదీ సాయి సమక్షంలోనే ఉండి పోవాలనే దృఢనిశ్చయానికి వచ్చేశాడు. అంతే! ఉండిపోసాగాడు.నిజానికి రోహిల్లాకి భార్యలేదు. ఆమె గయ్యాళీ కాదు. ఆ మాటకొస్తే, అసలు రోహిల్లాకి వివాహమే కాలేదు. ఈ విషయం సాయికీ తెలుసు.ఇదేమిటి? మరి సాయిబాబానే రోహిల్లా భార్య గురించి గ్రామస్థులకి అంత ఉపన్యాసాన్ని ఉపదేశ రూపంగా ఎందుకిచ్చాడనేగా మన సంశయం..?సాయిమాటల్లో అంతరార్థం ఉండి తీరుతుంది. రోహిల్లాకున్న భార్య మరెవరో కాదు ‘దుర్బుద్ధి’. ప్రతివ్యక్తీ దుఃఖిస్తూ ఉండాలనీ, అందరూ దుఃఖిస్తూ మనల్ని ఆశ్రయిస్తుంటే వాళ్లని మనం ఓదార్చాలనుకునే ఆ తీరు బుద్ధి దుర్బుద్ధి. ఈ దుర్బుద్ధి నిరంతరం రోహిల్లానే కాదు, మనల్ని కూడా పీడిస్తూనే ఉంటుంది. మన పిల్లవాడు పరీక్షలో ఉత్తమ విజేత అయినందుకు కలిగిన ఆనందం, పక్కింటి పిల్లవాడికి కూడా దాదాపు మనవాడితో సమానంగా వచ్చిన ఉత్తీర్ణతాశాతం కారణంగా పల్చబడిపోతుంది. ఇదే రోహిల్లా భార్య అంటే. ఈర్ష్య, ద్వేషం, పగ, అసూయ... ఇవన్నీ రోహిల్లా భార్య లక్షణాలే. దురదృష్టవశాత్తూ మనం సంస్కృతంలో కనిపించే కొన్ని కొన్ని పదాలకి అర్థాలన్నీ సమానమని భావిస్తూ ఉంటాం. ఈర్ష్య అంటే అసూయ అనేది అర్థం కాదు. ఈ రెండూ సమానమూ కాదు.ఇతరుల ఉన్నతినీ క్రమక్రమాభివృద్ధినీ సహించలేకపోవడం ఈర్ష్య. ఇతరులకున్న గొప్పగుణాల్లో వంకల్ని వెదికివెదికి దోషాల్ని ఆరోపించడం అసూయ.‘ఫలానావాళ్లు, ఎక్కడికెళ్లినా దంపతిగానే (భార్యాభర్తలిద్దరూ కలిసి మాత్రమే) వెళ్తారు’ అని ఎవరైనా చెప్తే ‘ఎంతదృష్టం!’ అనుకోకుండా ‘ఆయనకి ఆమె మీద అనుమానం! అందుకే ఒంటరిగా ఆమెని పోనియ్యడు. ఎప్పుడూ తోకలా వెళ్తూనే ఉంటాడు’ అనడం అసూయ.ఇదుగో ఈ తీరు ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషం వంటి అన్ని దుర్లక్షణాల సమూహమే రోహిల్లా భార్య స్వరూపం. అందుకే, అలాంటి ఆలోచన రోహిల్లాకి రాబోతోందనగానే, పెద్దగొంతుతో ఆ తీరు ఆలోచనలని తరిమికొట్టగల శక్తి ఉన్న కల్మాలని ఖురాన్ తీసి పెద్దగా చదువుతుంటాడన్నమాట! అంటే ఖురాన్ గాని సరైన తీరులో అర్థం చేసుకుని ఉన్నవాడయినట్లయితే, కల్మాని ఆ సందర్భానికి సరిపోయేలా పఠించగలమన్నమాట! ఆ శక్తి రోహిల్లాకి ఉందని అర్థం కూడా. కథని వినడం వేరు, చదవడం వేరు. దానిలో దాగిన తత్త్వార్థాన్ని తెలుసుకోవడం వేరు. తత్త్వార్థం తెలియనప్పుడు దైవాన్ని ఎంతసేపు, ఎంతకాలం, ఎన్నిమార్లు ఆరాధించినా అది కాలక్షేపం కిందికే వస్తుంది. ఉదాహరణకి వందరూపాయల కాగితం మనకి శీఘ్రప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇది నిజం. ఈ కాగితానికింతటి శక్తి ఉందని గ్రహించి ఆ వంద రూపాయల నోటుని పెద్ద విగ్రహంగా చేసి పూజలు పురస్కారాలు చేస్తున్నామా? ఆ నోటుని సంపాదించగల తీరుతెన్ను ఎలాగని మాత్రమే ఆలోచిస్తున్నాం. శ్రమిస్తున్నాం. సాధించుకోగలుగుతున్నాం. దైవవిషయం కూడా అంతే. ఎంత ఎత్తుగా విగ్రహాన్ని స్థాపించామనేది లెక్క కాదు. ఆ విగ్రహం యేడుందో, ఆయనని గురించిన తత్త్వం ఎవరికెంత బోధపడిందనేది గ్రహించుకోవడం, వ్యాప్తి చేయడం ముఖ్యం. బాబా దగ్గరికొచ్చే అందరు భక్తులూ భక్తులు కాదని ఆయనకీ తెలుసు. చూడ్డానికొచ్చేవారూ, నమ్మకం కుదిరితే మరోమారు వద్దామనుకునేవారూ, ఎలాగూ వచ్చాం కాబట్టి చూసేసి పోదాంలే అనుకునే వారూ, ఇంత ద్రవ్యం వస్తుంటే చక్కని సౌధాల్లో ఉండకుండా ఈ మసీదు గోడ ఏమిటని అనుకునే వారూ, ఎందరో ఉన్నారనీ ఉంటారనీ ఆయనకి తెలుసు. కేవలం ఇనుముని మాత్రమే అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుందో అలా.. ఎవరు ప్రశాంత హృదయులై ఉంటారో, దుర్బుద్ధి లేకుండా ఉంటారో, వాళ్లు మాత్రమే సూదుల్లా అవుతూ బాబా అనే అయస్కాంతానికి ఆకర్షింపబడి, ఇక ఆయనతోనే తన జీవితమనుకుంటూ ఉండిపోతారు. అలాంటి బలమైన సూదిలాంటివాడు ‘హేమాడ్ పంత్’. మరో సూది రోహిల్లా.ఈ సూదికీ, అయస్కాంతానికీ మధ్య ఏది ఉన్నా ఆకర్షణ శక్తి పనిచేయదు. ఆ అడ్డుగా ఉండే దుర్బుద్ధికి సంకేతమైన రోహిల్లా భార్య వంటి దాన్ని తీసెయ్యండంటూ సాయి ఉపదేశించాడు షిరిడీ ప్రజలకనేది రోహిల్లా కథలోని దివ్యోపదేశ సారాంశం. దుర్బుద్ధివల్ల నష్టం ఎవరికి? ముగింపులో ఒక్క మాటనుకుందాం. బుద్ధి అనేది ఎప్పుడుందో, ఒక్కోసారి దుర్బుద్ధి అనేది కూడా ఉండి తీరుతుంది. నీళ్లున్నప్పుడు ఏ దుమ్మో, ధూళో.. పడ్డప్పుడు ఆ నీళ్లు అపరిశుభ్రం కావడం సర్వసాధారణం. అలాగే, బుద్ధి కూడా వ్యక్తి స్వభావాన్ని బట్టి ఒక్కోసారి దుర్బుద్ధిగా కావడం, లేదా ఎవరో ఒకరి ప్రభావం తీవ్రాతి తీవ్రంగా మన బుద్ధి మీద పనిచేసిన సందర్భంలో దుర్బుద్ధిగలవాళ్లుగా మారడమనేది అసహజం, అసాధారణమైన అంశం కానే కాదు.ఒక్క అంశాన్ని చూసి ముగిద్దాం! భారతంలో ధర్మరాజుదే రాజ్యం నిజానికి. కారణం ధర్మరాజు తండ్రి పాండురాజునే రాజ్యం అనువంశికంగా సంక్రమించింది కాబట్టి. ధృతరాష్ట్రుడు పెద్దవాడే అయినప్పటికీ పుట్టుకతో వచ్చిన గుడ్డితనమనేది రాజుగా పట్టాభిషేకానికి అర్హతని కలిగించలేదు కాబట్టి. పైగా ధర్మరాజుకి పట్టాభిషేకం జరిగిపోయింది కూడా. ఇంతవరకూ సద్బుద్ధే కథని నడిపింది. దుర్బుద్ధి ప్రవేశించింది (రోహిల్లా భార్య) దుర్యోధనునిలో. అధర్మంగా రాజ్యాన్ని చేజిక్కించుకోవలసిందేనని. దాని కోసం తండ్రి మెడల్ని వంచి జూదానికొప్పించాడు. ఇక్కడ కూడా రోహిల్లా భార్య ప్రవేశించింది. అధర్మంగా జూదాన్ని ఆడాక ద్రౌపది వస్త్రాపహరణ మెందుకు? దానివల్ల రాజ్యం వస్తుందా? వాళ్లందరినీ ఇంకా అవమానపరచాలి (రోహిల్లా భార్య మళ్లీ ప్రవేశించింది).12 సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తూ చివరి అజ్ఞాతవాసంలో గాని పాండవుల జాడ తెలిస్తే మళ్లీ 12+1 చేయాల్సిందేననే తీర్మానం మీద మళ్లీ జూదం. పాండవులు ఆ శిక్షని కూడా పూర్తి చేసుకుని 13 ఏళ్ల పిమ్మట విజయవంతంగా తిరిగొస్తే... రాజ్యం ఇచ్చి తీరాలి కదా మాట ప్రకారం(మళ్లీ రోహిల్లా భార్య ప్రవేశం). అయినా రాజ్యాన్నియ్యం అని మొండికేస్తే భగవంతుడు కూడా ఇది తప్పని వారిస్తే కూడా వినని స్థాయికెళ్లి వంశనాశనాన్ని చేసుకున్నారు కౌరవులు.దుర్బుద్ధికి సంకేతమైన రోహిల్లా భార్యవల్ల, ఆమె ఎవరిలో ప్రవేశిస్తే వాళ్లే నాశనమౌతారు తప్ప మరెవరూ నష్టపోరు, ఇదీ సాయి మాట్లలోని సారాంశం. కాబట్టి సద్బుద్ధి కలవాళ్లై జీవించండి, అని చెప్పడం ఆయన బోధనలోని దివ్యోపదేశం. ఇక సాయినాథుని అవతరణ గురించి త్రివేణి సంగమ స్నానాన్ని ఎలా దాసగణు అనే భక్తునికి చేయించాడో ఆ విశేషాన్ని చూద్దాం. -
ఖురాన్‌కు వ్యతిరేకమైతే ఒప్పుకోం
లక్నో: ప్రతిపాదిత ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు పవిత్ర ఖురాన్ గ్రంథానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అది తమకు ఆమోదయోగ్యం కాదని పలు ముస్లిం మహిళా సంస్థలు స్పష్టం చేశాయి. ‘నిఖా (పెళ్లి) అనేది ఓ ఒప్పందం. దాన్ని ఎవరు ధిక్కరించినా శిక్షించాల్సిందే. ఖురాన్, రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతిపాదిత బిల్లు లేకపోతే దాన్ని ఏ ముస్లిం మహిళా ఒప్పుకోదు’’అని ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు చైర్ పర్సన్ షైస్టా ఆంబెర్ తెలిపారు. ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమాయిత్ ఇస్లామీ, జమియత్ ఉల్మా ఏ హింద్, ఇతర సంస్థలకు ముసాయిదా బిల్లును చూపించాల్సిందిగా న్యాయ కమిషన్‌కు లేఖ రాశాం’ అని పేర్కొన్నారు. ‘కుటుంబాన్ని నిలబెట్టేందుకు ఫ్యామిలీ కోర్టు యాక్ట్ ఓ అవకాశం ఇస్తుంది. కానీ ప్రతిపాదిత బిల్లు ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు’ అని ముస్లిం వుమెన్ లీగ్ అధ్యక్షురాలు నాయిశ్ హసన్ ఆరోపించారు. -
హజ్ విధానం ఇలా ఉంటుంది
హజ్అనే అరబ్బీ పదానికి ‘యాత్ర’ అని అర్థం. హజ్æ కోసం వెళ్లే ముస్లింల కోసం దివ్య ఖురాన్లో అల్లా ఇలా సెలవిచ్చాడు– ‘ప్రప్రథమంగా మానవుల కోసం నిర్మించబడిన ఆరాధన గృహం మక్కా నగరంలో ఉంది. దాన్ని దర్శించుకునే వారికి సకల శుభాలు ప్రసాదించబడతాయి’. అందుకే స్తోమత గల వారు జీవితంలో కనీసం ఒకసారి హజ్ చేయడం తప్పనిసరి. పవిత్రహజ్ను నిర్వర్తించడానికి వెళ్లేవారు ఈ లోకంతో సంబంధంలేని వారుగా... ఒక లుంగీ... ఒక దుప్పటి... ఒక జత పాదరక్షలు మాత్రమే తీసుకొని వెళుతారు. తలకు నూనె, శరీరానికి సుగంధ ద్రవ్యాలు వాడరు. క్షవరం కూడా చేసుకోరు. అన్ని ర కాల అలంకరణలను, సుఖాలను త్యజిస్తారు. వాంఛలను ప్రేరేపించే విషయాలకు దూరంగా ఉంటారు. ఈ నియమ నిబంధనల వల్ల వారి హృదయం దైవారాధనకు సంపూర్తిగా సిద్ధమవుతుంది. హాజీలు కాబా గృహానికి చేరుకొని కాబాను సందర్శిస్తారు. గృహప్రదక్షిణలు చేస్తారు. ‘ముఖామే ఇబ్రహీం’ వద్ద రెండు రకాతులు నమాజులు చేస్తారు. సఫా, మర్వా పర్వతాల మధ్య పరుగెత్తుతారు. మీనా, అరఫాత్, ముజ్దాలిఫాలో బస చేస్తారు. గులకరాళ్లతో షైతాన్ను కొడుతారు. ఖుర్బానీ చేస్తారు. ఇలా విధిని పూర్తిచేసి దైవానుగ్రహాన్ని పొందడానికి ప్రయతిస్తారు. దైవ ప్రసన్నత కోసం.... హజ్ వెళ్లాలని సంకల్పించుకున్న వారు దానికి అన్ని విధాలుగా సంసిద్ధులు కావాలి. దైవం తన దాసుని నుంచి కోరిన దాన్ని నెరవేర్చాలి. హజ్æ సమయంలో ప్రవక్త తెలిపిన దువాలను పఠించాలి. హజ్ ఎప్పుడు..? హజ్ఇస్లామియా కేలండర్లోని చివరి మాసమైన జిల్ హజ్జా నెలలోని 8, 9, 10, 11, 12వ తేదీల్లో నిర్వహిస్తారు. ఈ ఐదురోజుల పాటు ప్రత్యేక ఆరాధనలుంటాయి. హజ్ ఆరాధనలోని మొదటిరోజు ఇహ్రామ్ దుస్తులను ధరించి హజ్ ఆరాధనల సంకల్పం చేసుకొని తల్బియా పలుకుతూ రెండు రకాతుల నఫీల్ నమాజులు చేయాలి. తల్బియా మూడుసార్లు పలికి మక్కానుంచి మినా బయలుదేరాలి. అక్కడ జొహార్, అసర్, మగ్రీబ్æ, ఇషా నమాజులు చేయాలి. రాత్రి మినా మైదానంలో బస చేయాలి. జిల్ హజ్జా తొమ్మిదవ రోజు హజ్ రెండవరోజు (9న) ఫజర్ నమాజ్ మినాలో చేసి అరఫాత్ బయలుదేరాలి. మినా నుంచి అరఫాత్ వెళ్లే దారిలో తల్బియా పలకాలి. అర ఫాత్లో విడిది చేయడమే అసలు హజ్. జొహర్ ఆసర్ నమాజులు చేయాలి. ఈ రెండు నమాజ్‌లు సాముహికంగా నిర్వహిస్తారు. మగ్రీబ్ నమాజు చేయకుండా ముజ్దలిఫా వైపు బయలుదేరాలి. ఇషా సమయంలో ఒక ఆజాన్ రెండు ఇఖామత్లతో మగ్రీబ్, ఇషానమాజ్లు ముజ్దలిఫాలో చేయాలి. రాత్రి ముజ్దలిఫాలో గడపాలి. ఇక్కడ 70 కంకర రాళ్లను షైతాన్పై విర సడానికి పోగు చేసుకొని పెట్టుకోవాలి. జిల్ హజ్జా పదవ రోజు మూడోరోజు (10న) ముజ్దలిఫాలో ఫజర్ నమాజ్ తరువాత దైవ నామస్మరణ ఎక్కువ చేయాలి. పాప కార్యాలను క్షమించమని పశ్చాత్తాప పడాలి. అనంతరం మినా వైపుకు వెళ్లాలి. సూర్యుడు ఉదయించక ముందు పెద్ద షైతాన్ పై ఏడు కంకర రాళ్లతో కొట్టాలి. అనంతరం ఖుర్బానీ చేయాలి. తలవెంట్రుకలను తొలగించుకోవాలి. హజ్ ఆరాధనల కోసం ధరించిన ఇహ్రామ్ దుస్తులను తీసివేయాలి. స్నానం చేసి సాధారణ దుస్తులను ధరించాలి. మక్కా వెళ్లి తవాఫే జియార త్ చేసుకొని తిరిగి మినా మైదానానికి చేరకోవాలి. రాత్రి మినాలో గడపాలి. హిల్ హజ్జా పదకొండవ రోజు నాలుగోరోజు (11న) సూర్యోదయం తరువాత ముగ్గురు షైతాన్లను కంకరరాళ్లతో కొట్టాలి. ముందుగా బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చిన్నషైతాన్పై ఏడు రాళ్లు, మధ్య షైతాన్పై ఏడు రాళ్లు, పెద్ద షైతాన్ పై ఏడురాళ్లను కొట్టాలి. మూడోరోజు చేసినట్లే తవాఫే జియార త్ (కాబా గృహ ప్రదక్షణలు) చేయాలి. మినాకు బయలుదేరి రాత్రి అక్కడే బస చేయాలి. జిల్ హజ్జా 12వ రోజు ఐదో రోజు (12న) నాలుగోరోజు చేసినట్లే ముగ్గురు షైతాన్లపై ఏడు కంకర రాళ్లతో కొట్టాలి. సూర్యాస్తమయం కాకముందే మినా నుంచి బయలుదేరాలి. ఒకవేళ తవాఫే సియారత్ చేయాలనుకుంటేæసూర్యాస్తమయానికి ముందే∙చేసుకోవాలి. ఇంతటితో హజ్ ఆరాధనలు పూర్తవుతాయి. తిరిగి వచ్చేటప్పుడు తవాఫే జియారత్ చేయాలి. – మహమ్మద్ మంజూర్ -
అనుబంధాన్ని పెంచుకోవాలి
రమజాన్ కాంతులు ప్రతి ముస్లిమూ ఈ పవిత్రమైన మాసంలో ఖురాన్‌తో సంబంధాన్ని పెంచుకోవాలి. మానవ మనుగడ కోసం దైవం ఈ ప్రపంచంలో చేసిన ఏర్పాట్లన్నీ ఒక ఎత్తయితే, పవిత్రఖురాన్ అవతరణ మరోఎత్తు. మానవులకు జీవితంలోని అన్నిరంగాల్లో మార్గదర్శకం చేసింది ఖురాన్. సామాజిక, సాంస్కృతిక, కౌటుంబిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ... సమస్తరంగాల్లో మానవుడు ఎలాంటి జీవన విధానాన్ని అవలంబించాలో తెలియజేసింది. మానవుడు పుట్టింది మొదలు మరణించే వరకు సంభవించే వివిధ దశల్లోమార్గం చూపింది. మానవజీవితం ఎలా ఉండాలి? ఎలాసంపాదించాలి, ఎలా ఖర్చుపెట్టాలి? కుటుంబం, సమాజం, బంధుమిత్రులతో ఎలా మసలుకోవాలి?... వంటి విషయాలన్నీ దివ్యఖురాన్ చర్చించింది. అందుకే ఈ మాసంలో ఖురాన్‌ను అధ్యయనం చేయడానికి, అర్థంచేసుకోడానికి, ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. – మదీహా అర్జుమంద్ -
ఖురాన్ చెప్పిన జీవనం!
రమజాన్ కాంతులు పవిత్రమైన ఈ రమజాన్ నెలలో ముఖ్యంగా ఖురాన్‌తో సంబంధాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే, మానవ మనుగడకోసం దైవం ఈ ప్రపంచంలో చేసిన ఏర్పాట్లన్నీ ఒక ఎత్తయితే, పవిత్రఖురాన్ అవతరణ మరో ఎత్తు. మానవులకు జీవితంలోని అన్నిరంగాల్లో మార్గదర్శకంచేసింది ఖురాన్. సామాజిక, సాంస్కృతిక, కౌటుంబిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ తదితర సమస్త రంగాల్లో మానవుడు ఎలాంటì జీవన విధానాన్ని అవలంబించాలి, ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలో వివరంగా తెలియజేసింది. మానవుడు పుట్టింది మొదలు మరణించే వరకు సంభవించే వివిధ దశల్లో మార్గం చూపింది. మానవజీవితం ఎలా ఉండాలి? ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చుపెట్టాలి? కుటుంబం, సమాజం, బంధుమిత్రులతో ఎలా మసలుకోవాలి? సమాజంలో ఒక మనిషికి మరోమనిషిపై తారసిల్లే బాధ్యతలేమిటి? వ్యాపార లావాదేవీలు, ఉద్యోగబాధ్యతలు ఎలా నిర్వహించాలి? పాలన సూత్రాలేమిటి? ఆచరించాల్సిన విలువలేమిటి? పరస్పర మానవసంబంధాలు పటిష్టంగా, అర్థవంతంగా, సామరస్యపూర్వకంగా మనగలగాలంటే ఏంచేయాలి? ఇత్యాదివిషయాలన్నీ పవిత్రఖురాన్ చర్చించింది. అందుకని ఈ పవిత్రనెలలో దీన్ని అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోడానికి, ఆచరించడానికి, సర్వసామాన్యం చెయ్యడానికి శక్తివంచనలేని ప్రయత్నం చేయాలి.చివరి బేసిరాత్రుల్లో’షబెఖద్ర్’ను అన్వేషించాలి. వీలున్నవారు ‘ఏతికాఫ్’పాటించాలి. ఫిత్రాలు చివరిరోజుల్లోనే చెల్లించడం శుభప్రదం. ప్రవక మహనీయులు ’షబెఖద్ర్ ’కోసం ఉపదేశించిన దు ఆ ‘అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ ఆఫ్ వఫుఆఫ్ అన్ని’ పఠిస్తుండాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఖురాన్ అవతరించిన శుభరాత్రి
లైలతుల్ ఖద్ర్ ఇస్లాం వెలుగు రమజాన్ నెల పవిత్రమైనది, శుభప్రదమైనది. చివరి పది రోజులకు మరో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఈనెల చివరి పదిరోజుల్లో వేయి నెలలకన్నా విలువైన ఒక మహా రాత్రి ఉంది. ‘ఏతెకాఫ్’ అనే ప్రత్యేక ఆరాధన కూడా ఈ చివరి పదిరోజుల్లోనే ఆచరిస్తారు. ‘ఈ ఘనమైన రాత్రిని’ గురించి దైవం అల్ ఖద్ర్ సూరాలో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘మేము ఈగ్రంథాన్ని (ఖురాన్) ఒక విలువైన రాత్రిన అవతరింపజేశాం. అది వెయ్యి నెలలకన్నా అత్యంత విలువైనది. దైవదూతలు తమప్రభువు అనుమతితో, ప్రతి అనుజ్ఞతో ఆ రాత్రిన దిగి వస్తారు. అది శుభోదయం వరకూ శాంతియుతమైన రాత్రి’. (అల్ ఖద్ర్ 97) మానవజాతికి రుజుమార్గం చూపి, వారి ఇహ పర సాఫల్యానికి దిక్సూచిగా నిలిచే మహత్తర మార్గదర్శిని ఖురాన్. రమజాన్ నెలలో, ప్రత్యేకించి చివరిభాగంలోని ‘లైలతుల్ ఖద్ర్’లో అవతరించింది కాబట్టే ఈ రాత్రికి ఇంతటి ప్రాముఖ్యత, విశిష్టత. ఈ ఒక్క రాత్రి చేసే ఆరాధనలు వెయ్యినెలలకన్నా ఎక్కువగా చేసిన ఆరాధనలతో సమానమంటే దీని ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే రమజాన్ చివరి రాత్రుల్లో ఆరాధనలు అధికంగా చెయ్యాలని, ఇందులోనే శుభరాత్రి ఉంది కనుక దాన్ని పొందాలని ప్రవక్త మహనీయులు ఉపదేశించారు. అయితే ఆ శుభరాత్రి ఫలానారాత్రి అని స్పష్టమైన నిర్ధారణలేదు. కాని దాన్ని ఖచ్చితంగా ఎలా సొంతం చేసుకోవచ్చో ప్రవక్త స్పష్టంగా వివరించారు. రమజాన్ చివరి పది రోజుల్లోని బేసిరాత్రుల్లో షబెఖద్ర్ను అన్వేషించమని ముహమ్మద్ ప్రవక్త(స) ఉపదేశించారు. ఎవరైతే ఆత్మసంతోషంతో, పరలోక ప్రతిఫలాపేక్షతో ‘షబెఖద్ర్’ గడుపుతారో వారి పూర్వపాపాలన్నీ మన్నించబడతాయి. మరెవరైతే నిర్లక్ష్యం వహించి ఆ మహా రాత్రిని పోగొట్టుకుంటారో వారికి మించిన దౌర్భాగ్యులు మరెవరూ ఉండరని ప్రవక్త వారి ప్రవచనాల ద్వారా మనకు అర్థమవుతోంది. కనుక ఈ పవిత్రమాసం చివరి పదిరోజుల్లో మామూలుకంటే ఎక్కువగా ఆరాధనలు, సత్కార్యాలు ఆచరించి దైవప్రసన్నత పొందాలి. అల్లాహ్ మనందరికీ రమజాన్ శుభాలను సమృద్ధిగా పొందే భాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మహత్తరం... మార్గదర్శకం
రమజాన్ కాంతులు రమజాన్‌మాసంలో అవతరించ బడిన దైవగ్రంథం దివ్యఖురాన్. మానవ జీవన రంగాలన్నింటినీ సృజించింది. మానవ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించి, మానవాళికి స్పష్టమైన మార్గదర్శకం చేసింది. మనిషి జీవనం నుండి మరణం వరకు జీవన గమనానికి చుక్కానిని అందించింది. మనిషి జీవితంలోని లోతుపాతులను చర్చించి, లోటుపాటులను సవరించింది. మనిషి అంతరంగాన్ని కడిగి, మస్తిష్కాన్ని సంస్కరించింది. స్పష్టమైన విధి విధానాలను రూపొందించింది. విచక్షణ, వివేకం, విజ్ఞానం ఆధారంగా కార్యక్రమాలను రూపొందించుకుని ముందు చూపుతో వ్యవహరించమని తెలిపింది. కుటుంబ విధివిధానాలను నిర్దేశించింది. మనిషి సజ్జనుడుగా, సౌశీల్యవంతుడిగా మసలుకోవాలని, ఉత్తమ పౌరునిగా సామాజిక బాధ్యతలను నెరవేర్చాలని ఆదేశాలిచ్చింది. ఆర్థిక విధివిధానాలను రూపొందించి సామాజిక సమతౌల్యం పాటించాలని వివరించింది. శిక్షాస్మృతిని ఖరారు పరచి శ్రేయోసమాజానికి బాట వేసింది. ఇలా ఇన్ని విధాల ప్రత్యేకతలున్న కట్టకడపటి దైవగ్రంథం పవిత్ర ఖురాన్? – ఎస్. మాహెజబీన్ -
ఈ మాసం... ప్రత్యేకతలకు ఆవాసం
రమజాన్ కాంతులు అల్లాహ్ సమస్త జీవరాశుల కోసం సంవత్సరంలోని పదకొండు నెలలు కేటాయించి, ఈ ఒక్క రమజాను మాసాన్ని మాత్రం తనకోసం అట్టే పెట్టుకున్నాడు. అందుకే ఆరాధనల్లో అత్యధిక భాగం ఈ నెలలోనే నిర్వహించ వలసి ఉంటుంది. దైవవాణి దివ్య ఖుర్ ఆన్ ఈ నెలలోనే కడపటి ప్రవక్త అయిన హజ్రత్ ముహమ్మద్ (స) పై అవతరించింది. ఈ నెలలోనే రోజా (ఉపవాసం) విధిగా చేయబడింది. తరావీహ్ నమాజులు ఈ మాసంలోనే నిర్వహించబడతాయి. వేయి రాత్రులకంటే శ్రేష్ఠమయిన రాత్రి లైలతుల్ ఖద్ర్ ఈ మాసంలోనే ఉంది. జకాత్, సదకా, ఫిత్రా వంటి దానాలు చేయటం, ఖురాన్ పారాయణం చేయడం ఈ మాస ప్రత్యేకతలు. ఇంకా ఈ మాసంలోనే ఇబ్రాహీం ప్రవక్తకు సహీఫాలు, మూసాప్రవక్తకు తౌరాత్ గ్రంథం, దావూద్ ప్రవక్తకు జబూర్ గ్రంథం, ఈసా (ఏసుక్రీస్తు) ప్రవక్తకు బైబిల్ గ్రంథం ప్రసాదించబడింది. – షేఖ్ అబ్దుల్ హఖ్ -
స్వర్గ ప్రసాద మార్గం
రమజాన్ కాంతులు హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (ర) ప్రకారం, ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా చెప్పారు. ‘రోజా’, ఖురాన్’ – ఇవి రెండూ దాసుని కోసం సిఫారసు చేస్తాయి. అంటే, పగలంతా రోజా పాటించి, రాత్రులు నమాజుల్లో ఖురాన్ పఠించడం, లేక వినడం చేసిన దాసుల కోసం, రోజా ఇలా అంటుంది. ‘ప్రభూ! నేనితన్ని ఆకలిదప్పులు, మనోవాంఛలు తీర్చుకోకుండా ఆపి ఉంచాను. కనుక ప్రభూ ఇతని విషయంలో నా సిఫారసును స్వీకరించు’. ఖురాన్ ఇలా అంటుంది. ‘దేవా! నేనితణ్ణి రాత్రులు నిద్రకు, విశ్రాంతికి దూరంగా ఉంచాను. కనుక పరాత్పరా! ఇతని విషయంలో ఈ రోజు నా సిఫారసును అంగీకరించు. దయాగుణంతో ఇతనికి మన్నింపును ప్రసాదించు’. ఈ విధంగా దాసుని విషయంలో రోజా, ఖురాన్‌ల సిఫారసును ఆమోదించడం జరుగుతుంది. అతనికి మన్నింపును, స్వర్గాన్ని ప్రసాదించాలని నిర్ణయం జరుగుతుంది. ప్రత్యేక అనుగ్రహంతో అతన్ని సత్కరించడం జరుగుతుంది. రోజాలు ఆచరించి, నఫిల్ మొదలగు వాటిలో వారు స్వయంగా పఠించిన, లేక విన్న ఖురాన్, రోజాల సిఫారసుకు అర్హులైన పుణ్య పురుషులు, స్త్రీలు ఎంత అదృష్టవంతులో కదా! అంతటి మహాభాగ్యాన్ని పొందిన ఆ క్షణాలు... వారు ఆనందం, హర్షాతిరేకాలతో పొంగిపోయే ఆనంద ఘడియలు. అల్లాహ్ మనందరికీ అలాంటి మహదానుగ్రహభాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం. రోజా, ఖురాను నీకు చేస్తాయట సహాయం ఆదరించు ఈరెంటిని ఎంతమంచి ఉపాయం ! వస్తుందో రాదో మరి మరోసారి అవకాశం ఆచరించు ఆరాధన అల్లాహ్ ప్రేమ అపారం !! – యండి.ఉస్మాన్ ఖాన్ -
ఖురాన్ కాపాడుతుంది: రామ్ గోపాల్ వర్మ
ఏ అంశం అయినా తనదైన శైలిలో స్పందించే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఢాకా కాల్పులపై పేలాడు. ఢాకా కాల్పుల తర్వాత అన్ని స్కూళ్లలో ఖురాన్ చదివించడం ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తోందంటూ వర్మ ట్వీట్ చేశాడు. రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు ఢాకాలో నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. దానిపై మంగళవారం వర్మ స్పందిస్తూ.. ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవడానికి అన్ని స్కూళ్లలో ఖురాన్ చదివించడం ఒక్కటే దారి అన్నాడు. హిందూ అయినా, క్రిస్టియన్ అయినా ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవాలంటే ఖురాన్ నేర్చుకోవాల్సిందేనని, వారిని వారి మతం కాపాడలేకపోయినా, ఖురాన్ కాపాడుతుందని ట్వీట్ చేశాడు. Christians n Hindus also should learn Quran to escape being killed by terrorists .if their own religions can't protect them maybe Quran will — Ram Gopal Varma (@RGVzoomin) 5 July 2016 -
ఇస్లాంలో యేసు
మానవజాతికి సన్మార్గం చూపడానికి దైవం అనేకమంది దైవప్రవక్తల్ని ప్రభవింపజేశారు. ఎన్నో దైవగ్రంథాలను అవతరింపజేశారు. ఉదాహరణకు పవిత్ర ఖురాన్ గ్రంథంలోని కొంతమంది ప్రవక్తల పేర్లు గమనించండి. 1. ఆదం అలైహిస్సలాం (ఆదాము) 2. ఇబ్ర హీం (అ) అబ్రాహాము 3. ఇస్మాయీల్ (ఇస్మాయేలు) 4. ఇస్హాఖ్ (ఇస్సాకు) 5. నూహ్ (నోవా) 6. ఇద్రీస్ (హానోక్) 7. లూత్ (లోతు) 8. యాఖూబ్ (యాకోబు) 9. యూసుఫ్ (యోసేపు) 10. అయ్యూబ్ (యోబు) 11. యూనుస్ (యోనా) 12. ఇలియాస్ (ఏలియా) 13. దావూద్ (దావీదు) 14. జక్రియా (జకర్యా) 15. అల్ ఎసా (ఎలీషా) 16. మూసా (మోషె) 17. ఈసా (ఏసు) 18. ముహమ్మద్ (స) వీరందరిపై దేవుని శాంతి, కారుణ్యం వర్షించుగాక: అలాగే తౌరాత్, జబూర్, ఇన్సీల్ (బైబిల్) ఖురాన్... దైవగ్రంథాలు... మరెన్నో సహీఫాలు. సృష్టికర్త ఈ విధంగా దైవప్రవక్తల్ని, గ్రంథాలను అవతరింపజేసిన అసలు ఉద్దేశ్యం... మానవాళికి సన్మార్గ పథాన్ని అవగతం చేయడం, స్వర్గమార్గాన్ని సుస్పష్టంగా తెలియజేయడం. సత్యాసత్యాలను, ధర్మాధర్మాలను, మంచీ చెడులను విడమరచి వారిని శాశ్వత సాఫల్యానికి అర్హులుగా చేయడం. నిజానికి ప్రారంభంలో మానవులంతా ఒకే ధర్మాన్ని అనుసరిస్తూ, ఒకే మార్గాన నడుస్తూ ఉండేవారు. ఆ తరువాత వారిలో వారికి విభేదాలు వచ్చాయి. అప్పుడు దైవం వారి వద్దకు శుభవార్తలు తెలియజేసే (సన్మార్గ దర్శకులను) పంపుతూ వచ్చాడు. ‘సత్యం’ గురించి ప్రజల్లో వచ్చిన విభేదాలను పరిష్కరించడానికి ఆయన ప్రవక్తలపై సత్యపూరిత గ్రంథాలను కూడా అవతరింపజేశాడు (2-212). ఇందులో భాగంగానే ఈసా ప్రవక్తను కూడా ఆయన పంపాడు. ఆయనపై ఇన్జీల్ (బైబిల్ ) గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈసా (అ) గొప్ప దైవప్రవక్త. ఆయన పవిత్ర జననం గురించి పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది. ‘‘అప్పుడు దైవదూతలు మర్యంతో... (ఈసా ప్రవక్త మాతృమూర్తి) మర్యం! దైవం నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను పరిశుద్ధపరిచాడు. యావత్ ప్రపంచ మహిళల్లో నీకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, తన సేవకోసం నియమించుకున్నాడు. కనుక మర్యం! నువ్వు ఇక నీ ప్రభువుకు విధేయురాలివై ఉండు. ఆయన దివ్య సన్నిధిలో సాష్టాంగపడుతూ ఉండు. మోకరిల్లే వారితో నువ్వు కూడా వినమ్రంగా తలవంచి ప్రార్థన చెయ్యి.’ ‘మర్యం! దేవుడు నీకు తన వైపు నుండి ఒక వాణికి సంబంధించిన శుభవార్త అందజేస్తున్నాడు. అతని పేరు మర్యం కుమారుడైన ఈసా మసీహా. అతను ఇహలోకంలోనూ, పరలోకంలోనూ గౌరవనీయుడవుతాడు. దైవసాన్నిధ్యం పొందిన వారిలో ఒకడవుతాడు. అంతేకాదు, తల్లి ఒడిలో ఉన్నప్పుడూ, తరువాత పెరిగి పెద్దవాడైనప్పుడూ, అతను ప్రజలతో మాట్లాడతాడు. ఒక సత్పురుషుడిగా వర్థిల్లుతాడు.’ మర్యం ఈ మాటలు విని కంగారు పడుతూ ‘ప్రభూ! నాకు పిల్లాడు ఎలా కలుగుతాడు? నన్ను ఏ పురుషుడూ తాకనైనా తాకలేదే!’ అన్నది. ‘ఇది అలాగే జరిగి తీరుతుంది. దైవం తాను తలచిన దాన్ని చేయగలడు. ఆయన ఒక పని చేయాలనుకున్నప్పుడు ‘అయిపో’ అంటే చాలు. అది వెంటనే అయిపో తుంది. దైవం అతనికి (మర్యం కుమారు డైన యేసుకు) గ్రంథజ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాత్, ఇన్జీల్ గ్రంథాల జ్ఞానాన్ని కూడా నేర్పుతాడు’’ అన్నారు దైవదూతలు. (పవిత్ర ఖురాన్ - 3 - 42, 48) తరువాత దైవం అతన్ని (యేసును) తన ప్రవక్తగా నియమించి ఇస్రాయీల్ సంతతి ప్రజల వద్దకు పంపిస్తాడు. అతను దైవసందేశ హరునిగా వారి వద్దకు వెళ్లి ఇలా అంటాడు...‘‘నేను మీ ప్రభువు వద్దనుండి మీకోసం కొన్ని సూచనలు తెచ్చాను. ఇప్పుడు మీ ముందు మట్టితో పక్షి ఆకారం గల బొమ్మను చేసి అందులో (గాలి) ఊదుతాను. అది దైవాజ్ఞతో సజీవ పక్షిగా మారిపోతుంది. నేను దేవుని ఆజ్ఞతో పుట్టుగుడ్డికి చూపును ప్రసాదిస్తాను. కుష్టురోగికి స్వస్థతనిస్తాను. మృతుల్ని కూడా బతికిస్తాను. మీరు ఏమేమి తింటారో, మీ ఇళ్లలో ఏమేమి నిల్వ చేసి ఉంచుకుంటారో అంతా మీకు తెలియజేస్తాను. మీరు విశ్వసించేవారైతే, ఇందులో మీకు గొప్ప గొప్ప నిదర్శనాలున్నాయి (3-49). ఈ విధంగా దైవం ఈసా (అ) అంటే క్రీస్తు మహనీయులవారి ద్వారా అద్భుతాలు చేయించాడు. మహిమలు చూపించాడు. తద్వారానైనా ప్రజలు తనను శుద్ధంగా విశ్వసించి, సదాచరణలు ఆచరించి, సమాజ సంక్షేమానికి పాటుపడుతూ, సాఫల్యం పొందుతారని, ఎందుకంటే అసలు ఆరాధ్యుడు ఏకైక దైవం మాత్రమే. ఆయన తప్ప మరొక దైవం లేడు. ఆయన నిత్య సజీవుడు, ఎప్పటికీ నిద్రించనివాడు. కనీసం కునుకుపాట్లు కూడా పడనివాడు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అనుమతి లేకుండా ఆయన సన్నిధిలో ఎవరూ సిఫారసు చేయలేరు. వారి (కళ్ల) ముందున్నదేమిటో, వారికి కనపడకుండా గుప్తంగా ఉన్నదేమిటో అంతా ఆయనకు తెలుసు. ఆయన తలచుకుంటే తప్ప, ఆయనకున్న జ్ఞానసంపదలోని ఏ విషయమూ ఎవరికీ తెలియదు. ఆయన రాజ్యాధికారం భూమ్యాకాశాలను పరివేష్టించి ఉంది. వాటి రక్షణ ఆయనకు ఏ మాత్రం కష్టమైన పని కాదు. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు. మానవులారా! మీ ఆరాధ్యుడు ఒక్కడే. కరుణామయుడు, కృపాసాగరుడు అయిన ఆ దైవం తప్ప మీకు మరో దేవుడు లేనే లేడు. భూమ్యాకాశాల సృజనలో, రేయింబవళ్ల చక్రభ్రమణంలో, సముద్రాలలో పయనిస్తూ, మానవులకు ప్రయోజనం చేకూర్చే ఓడలలో, దేవుడు పైనుండి కురిపించే వర్షపు నీటిలో - తద్వారా ఆయన మృతి భూమికి ప్రాణ ం పోసే (చెట్లూ చేమల్ని పచ్చదనం చేసే పనిలో) పుడమిపై పలు విధాల జీవరాశుల్ని విస్తరింపజేసే ఆయన సృష్టి నైపుణ్యంలో వాయువుల సంచారంలో. నేలకు నింగికి మధ్య నియమబద్ధంగా సంచరించే మేఘమాలికల్లో బుద్ధిజీవులకు అసంఖ్యాక నిదర్శనాలున్నాయి. (2.163-164). ఈ విధంగా సృష్టికర్త అయిన దైవం మానవుల మార్గదర్శనం కోసం, వారి ఇహ పర సాఫల్యాల కోసం అనేక ఏర్పాట్లు చేశాడు. ఆ ఏర్పాట్లలో భాగమే ప్రవక్తల ప్రభవన. గ్రంథాల అవతరణ. దైవాదేశాల ప్రకారం, దైవప్రవక్తల, దైవగ్రంథాల మార్గదర్శకంలో, ఎలాంటి హెచ్చు తగ్గులకు, అతిశయాలకు తావు లేకుండా నడుచుకుంటే తప్పకుండా ఇహలోకంలోనూ, పరలోకంలోనూ సాఫల్యం పొందవచ్చు. అమర సుఖాల శాశ్వత స్వర్గసీమను సొంతం చేసుకోవచ్చు. - ఎండీ ఉస్మాన్‌ఖాన్ -
జమ్మూకాశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్తత
జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో శుక్రవారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు తమ పవిత్ర గ్రంధం ఖురాన్‌ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు ముస్లింలు నిరసనలు తెలిపేందుకు భారీ సంఖ్యలో భదేర్ వాహ్ వీధుల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా పలు దుకాణాలు మూతపడగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. విద్యాసంస్థలను మూసివేశారు. కొందరు ముస్లిం యువకులు వీధుల్లోకి వచ్చి టైర్లు వేసి నిప్పంటించారు. రహదారులను దిగ్భందించారు. విజయదశమి సంబురాల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తమ ఖురాన్ లోని కొన్ని పేజీలను తగులబెట్టారని అక్కడి ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. -
అగ్గిపెట్టెలో ఇమిడే... ఖురాన్
కావలి: ముస్లింల పవిత్రగ్రంథం ఖురాన్. అయితే అన్ని ఖురాన్లు పెద్దపాటి గ్రంథాలుగా ఉండటం సహజం. కానీ అగ్గిపెట్టెలో పట్టేంత సైజులో ఉంటే ఆశ్చర్యమే కదా.. అలాంటి ఖురాన్ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని షేక్ మహబూబ్‌బాషా వద్ద ఉంది. బాషా చికెన్ దుకాణంలో పనిచేస్తూ రోజూ ఐదు పూటలా నమాజ్ చేస్తారు. 40 ఏళ్ల కిందట తన పాత పెంకుటిల్లు పడగొట్టి కొత్త ఇంటి నిర్మాణం కోసం పునాదులు తీస్తుండగా అగ్గిపెట్టె కంటే చిన్నపాటి పెట్టె కనిపించింది. అందులో అంగుళం కంటే చిన్నపాటి ఖురాన్ కనిపించింది. అందులో 6,666 వాక్యాలు ఉన్నాయి. ఈ పవిత్ర గ్రంథాన్ని ఆ అల్లా తమకు ఇచ్చాడని భావించి అప్పటి నుంచి భద్రపరిచారు. ఖురాన్లో చెప్పినట్లు మానవ జీవితం ఒక ఆట, ఒక వినోదం, మనం కేవలం నిమ్మిత్త మాత్రులం... అల్లా ఎలా చెబితే అలా నడుచుకోవాల్సిందేనని అంటున్నారు మహబూబ్ బాషా. -
అహం.. ఓ దుర్గుణం
రుజుమార్గం గర్వం, అహంకారం అన్నవి బహు చెడ్డ దుర్గుణాలు. మానవులకు ఏ విధంగానూ శోభించని లక్షణాలు. నిజానికి ఇవి సైతాన్ గుణాలు. దైవం మానవుణ్ణి సృష్టించిన తరువాత అందరూ అతనికి సజ్దా (సా ష్టాంగ ప్రణామం) చెయ్యాలని ఆదేశించాడు. ఫరిష్తా లతో సహా అందరూ ఆదిమానవుడికి సాష్టాంగ అభి వాదం చేశారు. కాని సైతాన్ చెయ్యలేదు. దైవాదేశాన్ని ధిక్కరించాడు. దీనిక్కారణం వాడిలోని అహమే అం టోంది పవిత్ర ఖురాన్. అహం అంటే ఏమిటి? తానే గొప్పవాడినని భావించడం. ఇతరులను తక్కువగా, హీనంగా చూడ డం. సైతాన్ ఇక్కడ రెండు తప్పులు చేశాడు. ఒకటి: దైవాదేశాన్ని తిరస్కరించాడు. రెండు: ఆదిమానవుణ్ణి తన కన్నా తక్కువ వాడుగా, నీచుడిగా చూశాడు. అంటే తన సృజన అగ్నితో జరిగింది కాబట్టి మట్టితో సృష్టించబడిన వాడి కంటే తానే గొప్పవాడినన్న అహం అతడి సత్య తిరస్కారానికి కారణమైంది. ఈ విధంగా వాడు తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. ఎవరి మనసులోనైతే ఇలాంటి ‘అహం’ ఉంటుం దో అలాంటి వారి మనస్తత్వం దేవుని విధేయతకు, సత్యాంగీకారానికి సిద్ధమవ్వడం అసంభవం. సత్యా న్ని సత్యంగా అంగీకరించాలంటే, ఇతరులను గౌరవ దృష్టితో చూడగలగాలంటే, ‘అందరి’ కన్నా గొప్పవాడయిన సృష్టికర్త ఆదే శాలను పాలించగలగాలి. కాని అత నిలోని అహం మరెవ్వరినీ తన కన్నా గొప్పవాడుగా అంగీకరించడానికి ఒప్పుకోదు. ఈ విధంగా అహంకారి సమాజంలో తనకో గొప్ప స్థానం ప్రాప్తం కావాలని కోరుకుంటాడు. మరెవరూ తన స్థాయికి, కనీసం తన దరిదాపుల్లోకి రావడాన్నీ అతడు సహించలేడు. అంతా తన పెత్తనమే సాగాలని అభిలషిస్తాడు. ఈ వైఖరి సరయినది కానప్పటికీ ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికీ అతనిలోని ‘అహం’ తప్పుడు వైఖరి గురించి ఆలోచించే అవకాశమే ఇవ్వదు. మంచి అనేది ఉంటే అది తనలోనే ఉందని, ఇతరులు చేరుకోక ముందే తాను దాన్ని అందిపుచ్చుకుంటానని భావిస్తాడు. ఎదు టివారిలోని ఏ నైతిక సుగుణాన్నీ అతను అంగీ కరించడు. ఇలాంటి వారిని ఎవరైనా సంస్కరించడానికి ప్రయత్నిస్తే లేక ఎవరైనా తమ తప్పులు ఎత్తిచూపితే సహించలేరు. తమను తాము సంస్కరించుకోడానికి ఏ మాత్రం ఒప్పుకోరు. ఇలాంటి వారు తమ అహంకా రవైఖరి కారణంగా తమను తామే నష్టపరుచుకుం టారు తప్ప మరొకటి కాదు. ఇదంతా దైవాదేశాలను కాదన్న ఫలితం. ఇలాంటి వారిని గురించి పవిత్ర ఖురాన్ ఇలా అంటోంది. కొందరు తమ వద్ద ఎలాం టి ప్రమాణం లేకపోయినా దేవుని సూక్తుల విషయం లో వితండవాదం చేస్తారు. వారి మనసులో తామేదో గొప్పవాళ్లమన్న అహంకారం తిష్టవేసుకొని ఉంటుం ది. కాని ఆ గొప్పదనానికి వారు ఎన్నటికీ చేరుకోలేరు. కనుక నీవు అల్లాహ్ శరణు వేడుకో. ఆయన అన్నీ విం టున్నాడు, చూస్త్తున్నాడు. (41-56). గర్వం, అహంకారం లాంటి దుర్లక్షణాల నుండి దైవం అందరినీ కాపాడాలని కోరుకుందాం. - యండి. ఉస్మాన్ ఖాన్