ఖురాన్ కాపాడుతుంది: రామ్ గోపాల్ వర్మ
ఏ అంశం అయినా తనదైన శైలిలో స్పందించే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఢాకా కాల్పులపై పేలాడు. ఢాకా కాల్పుల తర్వాత అన్ని స్కూళ్లలో ఖురాన్ చదివించడం ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తోందంటూ వర్మ ట్వీట్ చేశాడు. రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు ఢాకాలో నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే.
దానిపై మంగళవారం వర్మ స్పందిస్తూ.. ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవడానికి అన్ని స్కూళ్లలో ఖురాన్ చదివించడం ఒక్కటే దారి అన్నాడు. హిందూ అయినా, క్రిస్టియన్ అయినా ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవాలంటే ఖురాన్ నేర్చుకోవాల్సిందేనని, వారిని వారి మతం కాపాడలేకపోయినా, ఖురాన్ కాపాడుతుందని ట్వీట్ చేశాడు.
Christians n Hindus also should learn Quran to escape being killed by terrorists .if their own religions can't protect them maybe Quran will
— Ram Gopal Varma (@RGVzoomin) 5 July 2016