అనుబంధాన్ని పెంచుకోవాలి
రమజాన్ కాంతులు
ప్రతి ముస్లిమూ ఈ పవిత్రమైన మాసంలో ఖురాన్‌తో సంబంధాన్ని పెంచుకోవాలి. మానవ మనుగడ కోసం దైవం ఈ ప్రపంచంలో చేసిన ఏర్పాట్లన్నీ ఒక ఎత్తయితే, పవిత్రఖురాన్ అవతరణ మరోఎత్తు. మానవులకు జీవితంలోని అన్నిరంగాల్లో మార్గదర్శకం చేసింది ఖురాన్. సామాజిక, సాంస్కృతిక, కౌటుంబిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ... సమస్తరంగాల్లో మానవుడు ఎలాంటి జీవన విధానాన్ని అవలంబించాలో తెలియజేసింది. మానవుడు పుట్టింది మొదలు మరణించే వరకు సంభవించే వివిధ దశల్లోమార్గం చూపింది.
మానవజీవితం ఎలా ఉండాలి? ఎలాసంపాదించాలి, ఎలా ఖర్చుపెట్టాలి? కుటుంబం, సమాజం, బంధుమిత్రులతో ఎలా మసలుకోవాలి?... వంటి విషయాలన్నీ దివ్యఖురాన్ చర్చించింది. అందుకే ఈ మాసంలో ఖురాన్‌ను అధ్యయనం చేయడానికి, అర్థంచేసుకోడానికి, ఆచరించడానికి ప్రయత్నం చేయాలి.
– మదీహా అర్జుమంద్