Ramjan
-
విశాఖ: హలీం.. రుచికి సలాం
రంజాన్ మాసం ప్రారంభమైందంటే చాలు ముస్లింలకు ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలే కాదు.. అనేక పోషక విలువలున్న హలీం గుర్తుకొస్తుంది. మాంసంతో పాటు అనేక రకాల ఆహార పదార్థాలను మిళితం చేసి గంటల కొద్దీ ఉడకబెట్టి తయారు చేసే హలీంకు ఎంతో ప్రత్యేకత ఉంది. కొన్నేళ్లుగా విశాఖలో హాలీం వంటకాన్ని ప్రజలకు అందిస్తున్నారు. నెల రోజుల పాటు నగరంలోని జగదాంబ, జ్యోతి థియేటర్ జంక్షన్, అక్కయ్యపాలెం, రేసపువానిపాలెం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్టాళ్లు ఏర్పాటు చేసి అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో పాటు మసీదుల వద్ద కూడా హలీమ్ విక్రయిస్తున్నారు. ఉపవాస దీక్షలు జరిగే నెలరోజులు పాటు ముస్లింలే కాకుండా సాధారణ జనాలు సైతం ఈ రుచికి సలాం అంటున్నారు. ఒకప్పుడు కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన ఈ వంటకం తర్వాత అన్ని ప్రాంతాలకు విస్తరించింది. మన విశాఖలో జగదాంబ సెంటర్, లీలామహల్ జంక్షన్‌తో పాటు పలు ప్రాంతాల్లో హలీం సెంటర్లు వెలిశాయి. ముఖ్యంగా హైదరాబాద్ రుచులను విశాఖ వాసులకు చూపించేందుకు అక్కడ నుంచి హలీం తయారు చేసే నిపుణులను ఇక్కడకు తీసుకొచ్చారు. ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో తెల్లవారుజాము 4 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సుమారు 14 గంటలకు పైగా ఉపవాస దీక్షలో ఉంటారు. ఆ సమయంలో ఆహారంతో పాటు ఎటువంటి ద్రవ పదార్థాలు తీసుకోరు. ఉపవాస దీక్ష ముగించే సరికి శరీరానికి తగిన శక్తి అవసరమవుతుంది. సాధారణంగా డ్రై ఫ్రూట్స్‌తో ఉపావాస దీక్ష విరమించిన ఆ తర్వాత తీసుకునే ఆహారంలో హలీంకు ప్రాధాన్యమిస్తారు. హలీంలో మంచి పోషక విలువలతో పాటు తేలికగా జీర్ణమయ్యే గుణం ఉండడమే ఇందుకు కారణం. కేవలం సాయంత్రం లభించే హలీం రుచులను ఆస్వాదించడానికి నగర ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ముస్లింలే కాకుండా మిగిలిన వారు కూడా ఈ రుచికి సలాం అంటున్నారు. హలీం పుట్టింది అరబ్ దేశాల్లో అయినా ప్రాచూర్యం పొందింది మాత్రం హైదారాబాద్‌లోనే అని చెప్పుకొవచ్చు. అలాంటి ఈ వంటకం నేడు అన్ని ప్రాంతాలకు విస్తరించింది. తయారీ ప్రత్యేకమే.. సంప్రదాయక వంటలతో పోలిస్తే హలీం తయారీ ఆద్యంతం ప్రత్యేకమే. దీనికి కనీసం 8 గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్ లేదా చికెన్, గోధుమలు, అన్ని పప్పులు, బాస్మతి బియ్యం, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లి, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు తదితర 18 రకాల మసాలా దినుసులు, కొత్తిమీర, పొదీనా ఆకులు, నూనె, బాదం, పిస్తా, జీడిపప్పు తదితర డ్రైఫ్రూట్స్, ఎండు గులాబీ రేకులు, జాఫ్రాన్, సొంపు, పాలు తదితర వాటిని వినియోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. తగిన నెయ్యి, డాల్డా తీసుకుని గరమసాలన్నీ వేయించాక.. కడిగిన గోధుమ రవ్వను సమపాళ్లలో నీరు, పాలు వేసి కలుపుతారు. ఆ మిశ్రమాన్ని ఒకే ఉష్ణోగ్రతలో ఉడికిస్తారు. అప్పటికే ఉడికిన మాసం వేసి మిశ్రమాన్ని పెద్ద తెడ్డులాంటి కర్రతో రుబ్బుతూనే ఉంటారు. ఇలా ఉదయం ఎనిమిది గంటలకు మొదలు పెడితే.. సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. ఆ మిశ్రమం అంతా ముద్దగా తయారై హాలీంగా మారుతుంది. చికెన్‌తో అయితే మిశ్రమం తయారీకి సమయం తక్కువగా ఉంటుంది. మటన్‌తో అయితే సమయం ఎక్కుగా తీసుకుంటుంది. చికెన్ హలీంను హరీస్గా పిలుస్తారు. హలీం రుచికే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఒక కప్పు హలీంలో 365 క్యాలరీలు, కొవ్వు నుంచి లభించే క్యాలరీలు 150 లభిస్తాయి. కద్దూ–ఖా–ఖీర్ కద్దూ–కా– ఖీర్ హలీం తర్వాత స్వీకరించే అత్యంత రుచికరమైన స్వీట్. ఆనపకాయ, సెమీయా, సగ్గు బియ్యం, పంచదారతో ఈ తియ్యని పదార్థాన్ని (పాయసం) తయారు చేస్తారు. ఉపవాస దీక్ష ఆచరించిన వారికి శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఈ పాయసం ఎంతో ఉపయోగపడుతుంది. కూలింగ్‌లో పెట్టుకుని.. హలీం తర్వాత ఈ స్వీట్ తింటే మధురానుభూతి పొందుతారు. -
పాకిస్తాన్ బ్యాటర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 34 పరుగులు! వీడియో వైరల్
రంజాన్ మాసం సందర్భంగా జరుగుతున్న ఘనీ రంజాన్ టోర్నీలో పాకిస్తాన్ బ్యాటర్ ఉస్మా మీర్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో జీఐసీ జట్టుకు ఉస్మా మీర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే సోమవారం కరాచీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మా మీర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 20 బంతులు ఎదుర్కొన్న మీర్ 7 సిక్స్‌లు, 2 ఫోర్లు సాయంతో 66 పరుగులు చేశాడు. ముఖ్యంగా జీఐసీ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన బిలాల్‌కు మీర్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో అతడు.. 5 సిక్స్‌లు, 1 ఫోర్ సాయంతో ఏకంగా 34 పరుగులు రాబట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఉస్మా మీర్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా జీఐసీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 236 పరుగులు చేసింది. కాగా ప్రతీ ఏడాది రంజాన్ నెల సమయంలో పాకిస్తాన్లో ఘనీ టోర్నమెంట్‌ను నిర్వహిస్తారు. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఒక్కొక్క జట్టులో ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లకు అవకాశం కల్పిస్తారు. ఇక ఉస్మా మీర్ పాక్ తరుపున ఇప్పటివరకు మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. చదవండి: IPL 2023: యువ బౌలర్‌కు క్లాస్ పీకిన ధోని.. ఏం జరిగిందంటే?వీడియో వైరల్ Usama mir on 🔥🔥🔥🔥 He scored 34 runs with 5 sixes and one 4 in an over.... What a bowler and what a clean hitter he is... Usama mir the real future of Pakistan cricket 😍❤️🙌🙌🙌🙌 Vc: @geosupertv@iamusamamir#PakistanCricket #ramzancricket pic.twitter.com/mwcxtVvPcy — Qadir Khawaja (@iamqadirkhawaja) April 2, 2023 -
పండుగ నాడు ఫొటోల కోసం సానియా మీర్జా తంటాలు
భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్‌తో కలిసి రంజాన్ పర్వదిన వేడుక చేసుకుంది. ఈ సందర్భంగా తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంది. ‘ఫొటోలు దిగేప్పుడు ఎన్ని కష్టాలో’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ ఐదు ఫొటోలు పంచుకుంది. ఆ ఫొటోలను చూస్తే మొదటి ఫొటో బాగానే రాగా.. మిగతా నాలుగు ఫొటోలు బ్లర్ కావడం.. షేక్ అవడం వంటివి జరిగాయి. దీంతో ఆ ఫొటోలు సక్రమంగా రాలేదు. ఇదే విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా చెప్పింది. అనంతరం తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కలిసి సముద్రపు ఒడ్డున సరదాగా నడయాడుతున్న ఫొటోలను కూడా సానియా మీర్జా పంచుకుంది. దీంతో పాటు ట్విటర్లో కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత తక్కువ మంది ప్రార్థనల్లో పాల్గొనండి. ఈ భారం నుంచి అల్లా ఈ భూమిని రక్షిస్తాడు’ అని కరోనా మహమ్మారి విషయమై పేర్కొంది. ప్రస్తుతం టోక్యో ఒలంపిక్స్ కోసం సానియా మీర్జా సిద్ధమవుతోంది. నాలుగేళ్ల తర్వాత ఒలంపిక్స్‌లో పాల్గొననున్నది. చదవండి: టోక్యో ఒలింపిక్ప్‌కు సానియా మీర్జా అర్హత View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
రంజాన్ ప్రార్థనలకు మసీదులకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను తప్పకుండా పాటించాలని వక్ఫ్ బోర్డు సీఈవో స్పష్టం చేశారు. ఈ నెల 24 లేదా 25వ తేదీల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుందని, ఈ సమయంలో ప్రతీ ఒక్కరు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ప్రార్థనల కోసం మసీదులు, దర్గాల వద్దకు రావొద్దన్నారు. ఎవరింట్లో వాళ్లు ప్రార్థనలు చేసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టాలని పిలుపునిచ్చారు. అలాగే మసీదులు, దర్గాల వద్ద లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని వక్ఫ్ బోర్డు సీఈవో శుక్రవారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: పారాసిటమాల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత -
రాధే.. రారాదే
కరోనా దెబ్బకు బాలీవుడ్ ఇండస్ట్రీ బాక్సాఫీసు లెక్కలు, విడుదల తేదీలు గాడి తప్పాయి. ఇప్పటికే అక్షయ్‌కుమార్ ‘సూర్యవన్షీ’, రణ్‌వీర్‌సింగ్ ‘83’ వంటి సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. తాజాగా ఈ రంజాన్ పండక్కి విడుదల కావాల్సిన సల్మాన్ ఖాన్ ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడుతుందనే వార్తలు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్క 2013లో తప్ప 2009 నుంచి 2019 వరకు ప్రతి ఏడాది ‘వాటెండ్’ (2009), ‘దబాంగ్’ (2010), ‘బాడీగార్డ్’ (2011), ‘ఏక్తా టైగర్’ (2012), ‘కిక్’ (2014), ‘భజరంగీ భాయిజాన్ ’ (2015), ‘సుల్తాన్’ (2016), ‘ట్యూబ్‌లైట్’ (2017), ‘రేస్ 3’ (2018), ‘భారత్’ (2019)) సల్మాన్ ఖాన్ సినిమాలు రంజాన్ పండక్కి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇప్పుడు సల్మాన్ నటిస్తున్న ‘రాధే...’ విడుదల వాయిదా పడటంతో సల్మాన్ అభిమానులు రంజాన్‌కి భాయ్ రాడేమోనని బాధపడుతున్నారు. ‘రాధే... రారాదే’ అనుకుంటున్నారు. మరి.. పండక్కి భాయ్ వస్తాడా? చూడాలి. -
కొండెక్కిన చందమామ
ధారూరు వికారాబాద్ : రంజాన్ మాసం ప్రారంభంలో చందమామ కొండెక్కింది. కొండెక్కిన చందమామ పైన కుడివైపున పెద్ద నక్షత్రం అనుసరించడం ధరల పెరుగుదలకు సూచనగా ప్రజల భావన. కుడివైపునకు పెరిగితే ధరలు పెరుగుతాయని, ఎడమ వైపునకు పెరిగితే ధరలన్నీ తగ్గుతాయని గ్రామీణుల విశ్వాసం. చందమామ కొండెక్కింది. ఇంకా ధరలు ఏ మోతాదులో పెరుగుతాయో అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తంచేశారు. ఒకే నెలలో మూడుసార్లు పెట్రోల్, డీజిల్ చార్జీలు పెరగడమే ఇందుకు కారణం. గురువారం రాత్రి చందమామ కొండెక్కిన చిత్రాన్ని సాక్షి తన కెమెరాలో బంధించింది -
పుణ్యప్రాప్తికి చిరునామా తరావీహ్ నమాజ్
రమజాన్ కాంతులు ఆచరణకు అసలు ప్రేరణ అల్లాహ్, ఆయన ప్రవక్త (స)ను విశ్వసించడం. అయితే ఈ లక్షణంతో చేసే సదాచారాలన్నీ విశ్వాసం, చిత్తశుద్ధితో చేసినట్టే అవుతుంది. ఇక హదీసు భావం ఏమిటంటే, ఎవరయితే అల్లాహ్‌ను, ఆయన ప్రవక్త(స)ను విశ్వసించామని, వారు చూపించిన మార్గాన్ని ఎంచుకున్నామని, ఖుర్ ఆన్, హదీసుల్లో తరావీహ్ నమాజు చేయడం పుణ్యప్రదం అని పేర్కొనడం జరిగింది కాబట్టి ఆ పుణ్యాన్ని పొందేందుకు తరావీహ్ నమాజ్ చేస్తున్నానని భావించి చేస్తే అలాంటి వారు గతంలో చేసిన పాపాలు క్షమించబడతాయి. అయితే తరావీహ్కు సంబంధించి కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొందరు రమజాన్ రాగానే చాలా ఉత్సాహంగా తరావీహ్ నమాజు చేస్తారు. వారి ఉత్సాహం కొద్ది రోజులు మాత్రమే కనబడుతుంది. . ఆ తరువాత మానేస్తారు. మరికొందరు ఐదారు రోజుల్లోనే ఖుర్ఆన్ను పూర్తిగా వింటారు. ఇక తమకు తరావీహ్ నమాజు చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. ఇలాంటి వారు గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ఇక్కడ రెండు సున్నత్లు వేర్వేరుగా ఉన్నాయి. ఖుర్ఆన్ను పూర్తిగా తరావీహ్ నమాజ్‌లో వినడం ఒక సున్నత్. రమజాన్ మాసం మొత్తం తరావీహ్ నమాజ్ చేయడం మరో సున్నత్. అంటే ఐదారు రోజుల్లో తరావీహ్ నమాజ్ చేసి మానేసిన వారు ఒక సున్నత్‌ను మాత్రమే పాటించి, మరో సున్నత్‌ను వదిలి పెడుతున్నారన్నమాట. ఎవరయితే ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారో లేదా పనుల వల్ల ఒకేచోట తరావీహ్ నమాజు చేయలేకపోతుంటారో అలాంటివారు కొన్ని రోజులలో ఖుర్ఆన్ను పూర్తిగా తరావీహ్‌లో వినాలి. ఆ తరువాత ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తరావీహ్ నమాజు చేస్తుండాలి. ఇలా రెండు సున్నత్లు కూడా ఆచరించినట్టే అవుతుంది. పనులకు కూడా భంగం కలగదు. పుణ్యం ప్రాప్తిస్తుంది. రమజాన్ మాసంలోనే కాదు... తరావీహ్ నమాజ్ వీలున్నప్పుడల్లా చేయడం పుణ్యప్రదం. -
మీఠా రమజాన్
ఒక నెల రోజులు...ఎంగిలి కూడా మింగకుండా అల్లాని ధ్యానించారు. మరి... పండగొచ్చినప్పుడు నోరూరే మిఠాయిలు చేసుకోవద్దా?చలో... జషన్ మనాయేంగే!మీఠా మీఠా జషన్ మనాయేంగే! ఈద్ ముబారక్!! షీర్ ఖుర్మా కావల్సినవి: సేమ్యా – 100 గ్రాములు; నెయ్యి – టేబుల్ స్పూన్; పాలు – 3 లీటర్లు; పంచదార – 200 గ్రాములు; బియ్యప్పిండి – 10 టేబుల్ స్పూన్లు;ఏలకుల పొడి – చిటికెడు; పాలపొడి – కప్పు;ఎండు ఖర్జూరం – 100 గ్రాములు(కొన్ని నీళ్లు పోసి రాత్రి పూట నానబెట్టి, మరుసటి రోజు సన్నగా తరగాలి);బాదంపప్పు – 50 గ్రాములు;పిస్తాపప్పు – 50 గ్రాములు;పచ్చికొబ్బరి ముక్కలు – 50 గ్రాములు; కెవ్రా (మార్కెట్లో లభిస్తుంది) – టీ స్పూన్ తయారీ:∙పెద్ద గిన్నెను స్టౌ మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి∙అందులో సేమ్యా వేసి సన్నని మంట మీద ముదురు గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించాలి ∙గిన్నెలో నుంచి సేమ్యాని మరొక పాత్రలోకి తీసుకోవాలి ∙స్యేమ్యా వేయించిన గిన్నెలోనే పాలు పోసి మరిగించాలి ∙బియ్యప్పిండిలో కొద్దిగా చల్లని పాలు కలిపి, ఆ మిశ్రమాన్ని, పంచదార, ఏలకుల పొడిని మరుగుతున్న పాలలో పోసి కలిపి సన్నని మంట మీద ఉడికించాలి ∙అందులో తరిగిన ఖర్జూరం, బాదంపప్పు, కిస్మిస్, పిస్తాపప్పు, కొబ్బరి ముక్కలు వేసి కలపాలి ∙సేమ్యావేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. కద్దూ కా మీఠా కావలసినవి: సొరకాయ తురుము – 2 కప్పులు; పాలు – 1 లీటరు; పంచదార – 2 కప్పులు; కోవా – 2 కప్పులు; సగ్గుబియ్యం – అర కప్పు; బాదం పప్పులు – అర కప్పు; పిస్తా – అర కప్పు; మిల్క్‌మేడ్ – కప్పు; పైనాపిల్ ముక్కలు – అర కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు, కిస్మిస్: పది తయారీ ∙సొరకాయ తురుమును ఉడికించి నీళ్ళు వడకట్టి పక్కన పెట్టుకోవాలి ∙బాదం, పిస్తా పప్పులను నెయ్యిలో వేయించాలి ∙అడుగు మందంగా వున్న పాత్రలో పాలు మరగబెటి,్ట సగ్గుబియ్యం కలిపి ఉడికాక కోవా కలపాలి ∙ఈ మిశ్రమం చిక్కబడిన తరువాత పంచదార కలిపి కరిగాక స్టౌపై నుంచి దించేయాలి ∙ఈ మిశ్రమాన్ని చల్లబరచి ఉడికించిన సొరకాయ తురుమును కలుపుకోవాలి ∙చివరిగా పైనాపిల్ ముక్కలు, వేయించి ఉంచిన బాదం, పిస్తా పలుకులు, కిస్మిస్ కలుపుకోవాలి. చావల్ కా మీఠా కావలసినవి: బాస్మతి బియ్యం రవ్వ – కప్పు; పాలు – 2 కప్పులు; కోవా – కప్పు; జీడిపప్పు పేస్ట్ – అర కప్పు; రోజ్‌వాటర్ – టీ స్పూను; బాదం, కిస్మిస్ – అరకప్పు తయారీ :అడుగు మందంగా వున్న పాత్రలో పాలు మరిగించి బాస్మతి బియ్యం రవ్వ కలిపి ఉడికించాలి ∙రవ్వ ఉడికిన తరువాత కోవా, పంచదార కలిపి ఐదు నిమిషాలుంచి పిస్తా, రోజ్‌వాటర్ కలిపి స్టౌ పైనుంచి దించేయాలి ∙చావల్ కా మీఠాను మట్టిపాత్రలో వుంచితే తేమని పీల్చుకుని మరింత రుచిగా వుంటుంది. బాదం, కిస్మిస్తో గార్నిష్ చేయాలి. ఖుబాని కా మీఠా కావలసినవి: ఖుబాని (డ్రై ఆప్రికాట్లు) – 1 కప్పు పంచదార – ఒకటిన్నర కప్పు రాస్బెర్రి ఎసెన్స్ – అర టీ స్పూను డ్రైఫ్రూట్స్ : గార్నిషింగ్‌కి తయారీ: ఖుబానీలను 10 గంటలు నానబెట్టుకోవాలి విత్తనాలు తీసేసి ఒక గంట ఉడకబెట్టాలి .ఖుబానీలు మెత్తబడగానే పంచదార కలపాలి .తరువాత మరో అరగంట పాటు ఉడికించి చివరిగా రాస్బెర్రి ఎసెన్స్ కలిపి దించాలి. చివరగా డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి. డబుల్ కా మీఠా కావలసినవి: బ్రెడ్ – 4 స్లైసెస్; పాలు – 1 కప్పు; పంచదార – 1 కప్పు; జీడిపప్పు – అర కప్పు; పిస్తా పప్పు – అరకప్పు; బాదంపప్పు – అర కప్పు; నెయ్యి – అర కప్పు; నీళ్ళు – 3 టీస్పూన్లు; ఏలకులపొడి – అర టీ స్పూను తయారీ: బ్రెడ్‌ని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి, నెయ్యిలో వేయించి పక్కన ఉంచాలి ∙బాదం, పిస్తా, జీడిపప్పులను కూడా ఆ నెయ్యిలో వేయించాలి ∙ఓ పాత్రలో పాలు మరగబెట్టాలి ∙బ్రెడ్ ముక్కలను మరిగిన పాలలో వేసి కలుపుకోవాలి ∙పంచదారలో నీళ్ళు పోసి కలిపి పాకం పట్టి, బ్రెడ్ ను వేయించగా మిగిలిన నెయ్యిని కలుపుకోవాలి ∙దీంట్లో బ్రెడ్ మిశ్రమాన్ని, పిస్తా, బాదం, జీడిపప్పు, ఏలకులపొడి చల్లి మంట తీసేయాలి ∙దీనిని వేడిగానూ, చల్లగానూ సర్వ్ చేయవచ్చు. కేసర్ సేమ్యా మీఠా కావల్సినవి:సేమ్యా – 10 గ్రాములు పాలు – కప్పుపంచదార – 200 గ్రాములుకోవాల లేదా కలాకండ్ – 100 గ్రాములుజీడిపప్పు – 50 గ్రాములు కేసరి కలర్ – చిటికెడు కుంకుమపువ్వు – 10 రేకలు తయారీ: కడాయిలో నెయ్యి వేసి, సేమ్యాని వేయించి తీయాలి ∙మరొక పాత్రలో పాలు మరిగించి అందులో పంచదార, ఏలకుల పొడి, కేసరి రంగు, కోవా, కుంకుమపువ్వు వేసి కలపాలి దీంట్లో సేమ్యా కలపాలి ∙సేమ్యా ఉడికాక, దించి, జీడిపప్పుతో అలంకరించి సర్వ్ చేయాలి. -
వదులుకోజాలని అవకాశం!
రమజాన్ కాంతులు ఒక వ్యక్తి దైవం కోసం, దైవ ప్రసన్నత కోసం, దైవాదేశాలకనుగుణంగా, దైవ ప్రవక్త సాంప్రదాయ విధానం ప్రకారం పాటించినట్లయితే, తప్పకుండా అతనిలో సుగుణాలు జనించి తీరవలసిందే. నిజానికి నమాజ్, రోజా, జకాత్, హజ్ లాంటి ఆరాధనల ద్వారా మనిషి సంపూర్ణ మానవతావాదిగా, మానవ రూపంలోని దైవదూత గుణసంపన్ను గా పరివర్తన చెందాలన్నది అసలు ఉద్దేశ్యం. అందుకే దైవం సృష్టిలో ఏ జీవరాశికీ ఇవ్వనటువంటి ప్రత్యేకత, బుద్ధికుశలత, విచక్షణాజ్ఞానం ఒక్క మానవుడికే ప్రసాదించాడు. కాని మానవుడు తన స్థాయిని గుర్తించక, దైవ ప్రసాదితమైన బుద్ధీజ్ఞానాలను, శక్తియుక్తులను దుర్వినియోగ పరుస్తూ, ఇచ్ఛానుసార జీవితం గడుపుతూ, కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. దైవాదేశాలను విస్మరించి ఇష్టానుసార జీవితం గడుపుతున్నప్పటికీ ఇహలోక జీవితం సుఖవంతంగా, నిరాటంకగా సాగిపోతోందంటే, ఇక ఏం చేసినా చెల్లిపోతుందని కాదు. ఏదో ఒకనాడు వీటన్నిటికీ ఫలితం అనుభవించవలసి ఉంటుంది. ఇహలోకంలో కాకపోయినా పరలోకంలోనైనా దైవానికి సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. అందుకని మనిషి తన స్థాయిని గుర్తించాలి. మానవ సహజ బలహీనత వల్ల జరిగిన తప్పును తెలుసుకోవాలి. పశ్చాత్తాపంతో దైవం వైపునకు మరలి సత్కార్యాల్లో లీనం ఈవాలి. దైవభీతితో హృదయం కంపించి పోవాలి. ఈ విధంగా దైవానికి దగ్గర కావడానికి, సత్కార్యాల్లో ఇతోధికంగా పాలుపంచుకోడానికి పవిత్ర రమజాన్‌కు మించిన అవకాశం మరొకటి లేదు. –హసీనా షేక్ -
అనుబంధాన్ని పెంచుకోవాలి
రమజాన్ కాంతులు ప్రతి ముస్లిమూ ఈ పవిత్రమైన మాసంలో ఖురాన్‌తో సంబంధాన్ని పెంచుకోవాలి. మానవ మనుగడ కోసం దైవం ఈ ప్రపంచంలో చేసిన ఏర్పాట్లన్నీ ఒక ఎత్తయితే, పవిత్రఖురాన్ అవతరణ మరోఎత్తు. మానవులకు జీవితంలోని అన్నిరంగాల్లో మార్గదర్శకం చేసింది ఖురాన్. సామాజిక, సాంస్కృతిక, కౌటుంబిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ... సమస్తరంగాల్లో మానవుడు ఎలాంటి జీవన విధానాన్ని అవలంబించాలో తెలియజేసింది. మానవుడు పుట్టింది మొదలు మరణించే వరకు సంభవించే వివిధ దశల్లోమార్గం చూపింది. మానవజీవితం ఎలా ఉండాలి? ఎలాసంపాదించాలి, ఎలా ఖర్చుపెట్టాలి? కుటుంబం, సమాజం, బంధుమిత్రులతో ఎలా మసలుకోవాలి?... వంటి విషయాలన్నీ దివ్యఖురాన్ చర్చించింది. అందుకే ఈ మాసంలో ఖురాన్‌ను అధ్యయనం చేయడానికి, అర్థంచేసుకోడానికి, ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. – మదీహా అర్జుమంద్ -
మహత్తరం... మార్గదర్శకం
రమజాన్ కాంతులు రమజాన్‌మాసంలో అవతరించ బడిన దైవగ్రంథం దివ్యఖురాన్. మానవ జీవన రంగాలన్నింటినీ సృజించింది. మానవ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించి, మానవాళికి స్పష్టమైన మార్గదర్శకం చేసింది. మనిషి జీవనం నుండి మరణం వరకు జీవన గమనానికి చుక్కానిని అందించింది. మనిషి జీవితంలోని లోతుపాతులను చర్చించి, లోటుపాటులను సవరించింది. మనిషి అంతరంగాన్ని కడిగి, మస్తిష్కాన్ని సంస్కరించింది. స్పష్టమైన విధి విధానాలను రూపొందించింది. విచక్షణ, వివేకం, విజ్ఞానం ఆధారంగా కార్యక్రమాలను రూపొందించుకుని ముందు చూపుతో వ్యవహరించమని తెలిపింది. కుటుంబ విధివిధానాలను నిర్దేశించింది. మనిషి సజ్జనుడుగా, సౌశీల్యవంతుడిగా మసలుకోవాలని, ఉత్తమ పౌరునిగా సామాజిక బాధ్యతలను నెరవేర్చాలని ఆదేశాలిచ్చింది. ఆర్థిక విధివిధానాలను రూపొందించి సామాజిక సమతౌల్యం పాటించాలని వివరించింది. శిక్షాస్మృతిని ఖరారు పరచి శ్రేయోసమాజానికి బాట వేసింది. ఇలా ఇన్ని విధాల ప్రత్యేకతలున్న కట్టకడపటి దైవగ్రంథం పవిత్ర ఖురాన్? – ఎస్. మాహెజబీన్ -
హయత్ నగర్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హయత్‌నగర్‌లోని హయత్బక్షీ బేగం మసీదుతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపడుతున్నారు. గంగా జమున తహజీబ్‌కు ఎలాంటి ఆటంకం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. -
స్వర్గ ప్రసాద మార్గం
రమజాన్ కాంతులు హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (ర) ప్రకారం, ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా చెప్పారు. ‘రోజా’, ఖురాన్’ – ఇవి రెండూ దాసుని కోసం సిఫారసు చేస్తాయి. అంటే, పగలంతా రోజా పాటించి, రాత్రులు నమాజుల్లో ఖురాన్ పఠించడం, లేక వినడం చేసిన దాసుల కోసం, రోజా ఇలా అంటుంది. ‘ప్రభూ! నేనితన్ని ఆకలిదప్పులు, మనోవాంఛలు తీర్చుకోకుండా ఆపి ఉంచాను. కనుక ప్రభూ ఇతని విషయంలో నా సిఫారసును స్వీకరించు’. ఖురాన్ ఇలా అంటుంది. ‘దేవా! నేనితణ్ణి రాత్రులు నిద్రకు, విశ్రాంతికి దూరంగా ఉంచాను. కనుక పరాత్పరా! ఇతని విషయంలో ఈ రోజు నా సిఫారసును అంగీకరించు. దయాగుణంతో ఇతనికి మన్నింపును ప్రసాదించు’. ఈ విధంగా దాసుని విషయంలో రోజా, ఖురాన్‌ల సిఫారసును ఆమోదించడం జరుగుతుంది. అతనికి మన్నింపును, స్వర్గాన్ని ప్రసాదించాలని నిర్ణయం జరుగుతుంది. ప్రత్యేక అనుగ్రహంతో అతన్ని సత్కరించడం జరుగుతుంది. రోజాలు ఆచరించి, నఫిల్ మొదలగు వాటిలో వారు స్వయంగా పఠించిన, లేక విన్న ఖురాన్, రోజాల సిఫారసుకు అర్హులైన పుణ్య పురుషులు, స్త్రీలు ఎంత అదృష్టవంతులో కదా! అంతటి మహాభాగ్యాన్ని పొందిన ఆ క్షణాలు... వారు ఆనందం, హర్షాతిరేకాలతో పొంగిపోయే ఆనంద ఘడియలు. అల్లాహ్ మనందరికీ అలాంటి మహదానుగ్రహభాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం. రోజా, ఖురాను నీకు చేస్తాయట సహాయం ఆదరించు ఈరెంటిని ఎంతమంచి ఉపాయం ! వస్తుందో రాదో మరి మరోసారి అవకాశం ఆచరించు ఆరాధన అల్లాహ్ ప్రేమ అపారం !! – యండి.ఉస్మాన్ ఖాన్ -
రంజాన్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: రంజాన్ పర్వదిన సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మీరాలం ఈద్గా, సికింద్రాబాద్ ఈద్గాల వద్ద ఉదయం 8 గంటల నుంచి 11.30 వరుకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మీరాలం మీదుగా నడిచే వాహనాలను పురానాపూల్, కామాటిపురా, కిషన్ బాగ్ , బహదూర్ పురా క్రాస్ రోడ్ ల మీదుగా దారి మళ్లింపు చేస్తామని చెప్పారు. ఈద్గా మీదుగా బహదూర్ పురా క్రాస్ రోడ్ వైపుగా నడిచే వాహనాలను కిషన్ బాగ్, కామాటిపురల వద్ద దారి మళ్లిస్తారు. ఇద్గా క్రాస్ రోడ్స్ నుంచి ఇద్గా వరకు ఆటోలను అనుమతించరు. ప్రార్థనల కోసం శివరాంపల్లి, ఎన్పీఏ నుంచి వచ్చే వాహనాలను ఈద్గా దారిలో అనుమతిస్తారు. ఇతర వాహనాలను దానమ్మ హట్స్ టీ జంక్షన్ వద్ద దారి మళ్లించి అలియాబాద్ వయా అన్సారీ రోడ్డు, జహనుమ, బాయ్స్ టౌన్ స్కూల్ నుంచి అనుమతిస్తారు. ఈద్గా ప్రార్థనలు ముగియగానే పురానాపూల్ నుంచి వచ్చే వాహనాలను సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. మీరాలం వద్ద అందరూ వెళ్లిపోయిన తర్వాత ట్రాఫిక్‌ను యధావిధిగా పంపిస్తారు. -
మేకింగ్ ఆఫ్ హలీం...
-
భక్తిశ్రద్ధలతో రంజాన్
మాన్వి /లింగసూగూరు, న్యూస్‌లైన్ : మాన్వి పట్టణంతో పాటు తాలూకాలో ముస్లింలు శుక్రవారం పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లింలు ఉదయం నుంచే పట్టణంలోని ప్రధాన కుబా, జామియా, హుదా మసీదులతో పాటు అన్ని మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్ చేశారు. స్థానిక సింధనూరు రోడ్డులోని నమాజ్‌గేరి కొండపై ఉన్న ఈద్గా మైదానానికి ఊరేగింపుగా వెళ్లారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రముఖులు డాక్టర్ గులాం జిలానీ ఖురాన్ పఠించగా, జీశాంత్ మౌలానా సామూహిక నమాజ్ నిర్వహించారు. అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హంపయ్య నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ గఫూర్‌సాబ్, అయ్యన గౌడ జంబలదిన్ని, జెడ్పీ స్థాయీ సమితి అధ్యక్షుడు హనుమేష్ మద్లాపూర్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ తాలూకా అధ్యక్షుడు జీ.సమదాని నాయక్, ఆ పార్టీ నాయకులు శంకరయ్యస్వామి సువర్ణగిరిమఠ, బీకే అమరేశప్ప, సీ.గురునాథ్, మల్లనగౌడ నక్కుంది, హుసేనప్ప జగ్లి, జీ.నాగరాజ్, మల్లికార్జునగౌడ గణేకల్, జే.సుధాకర్, రాజశేఖర్‌గౌడ జానేకల్, పురసభ సభ్యులు సబ్జలీసాబ్, ఎన్.మల్లికార్జున, యల్లయ్య నాయక్, మహాంతేశస్వామి రౌడూరు, లచమయ్య నాయక్, ఎస్.మహ్మద్, వివిధ పార్టీల నాయకులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. లింగసూగూరులో...: పట్టణంలో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. మహ్మద్ యూసూన్ కరడకల్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఖుతుబాత్ చదివారు. తంజీముల్ ముస్లిమన్ కమిటీ ఉపాధ్యక్షుడు లాల్ అహ్మద్సాబ్, ఖాదర్‌పాషా, ఇక్బాల్ హవల్దార్, హరూన్, చాంద్పటేల్, నసీర్‌మియా, హుసేన్‌సాబ్, మెహబూబ్ అలీ, మెహబూబ్ హుసేన్, మహ్మద్ రఫీ, బాబా ఖాజీ, అనీస్పాషా, ఫయాజ్అహ్మద్, హుసేన్‌సాబ్, అక్బర్, ఫైసల్, మహ్మద్ ఖాజాహుసేన్, అహ్మద్ పాషా, జిలానిపాషా, రఫీక్, షమీన్, అమీన్, షఫీక్, ఇంతియాజ్, అక్తర్, రాజా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మానప్ప వజ్జల్ ఈద్గా మైదానంలో ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. జేడీఎస్ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గిరిమల్లనగౌడ, అధ్యక్షుడు శివానంద ఐదనాళ, శరణగౌడ, వీరనగౌడ లెక్కిహాళ, శరణప్ప, హనుమంతు తదితరులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాయుచూరు సిటీ:రాయుచూరు జిల్లాలో ముస్లింలు రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఈద్గా మైదానంలో ముస్లింలు నమాజు చేసి, సామూహిక ప్రార్థనలు చేశారు. నగరంలోని జామియూ, వుక్కా, మోతి, ఏక్ మినార్ తదితర వుసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేసి, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా మైదానంలో రాయుచూరు ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, గ్రామీణ శాసన సభ్యుడు తిప్పరాజు, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ యాసిన్, నగరసభ సభ్యులు తివ్మూరెడ్డి, శివవుూర్తి, శ్రీనివాస్ రెడ్డి, శాంతప్ప, రుద్రప్ప, జిల్లాధికారి నాగరాజు, ఎస్పీ బిస్నళ్లి, జెడ్పీ సీఈఓ ముద్దు మోహన్, డీఎస్పీ దివ్య, నగరసభ మాజీ అధ్యక్షుడు మారెప్ప, కాంగ్రెస్ నాయకులు బసవరాజ్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వసంత్‌కుమార్, జేడీఎస్ అధ్యక్షుడు మహ ంతేష్ పాటిల్ ముస్లింలుకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేవదుర్గలో దేవదుర్గ శాసన సభ్యుడు వెంకటేష్ నాయక్, మాజీ వుంత్రి శివనగౌడ నాయుక్ ముస్లింలుకు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు. -
పండగ రోజూ...అదే హోరు
పండగరోజూ జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యమ జోరు.. హోరు కొనసాగింది. పదోరోజైన శుక్రవారం ఆందోళనలకు విరామం ఇవ్వాలని జేఏసీ నిర్ణయిం చినా స్వచ్ఛంద ఆందోళనలు వెల్లువెత్తాయి. రంజాన్ పవిత్ర పర్వదినాన్ని జరుపుకొనే తరుణంలోనూ ముస్లింలు ప్రత్యక్ష ఆందోళనల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాక్షి, విజయవాడ : రంజాన్ పండగ రోజు కావడంతో ప్రత్యక్ష ఆందోళనలకు విరామం ఇవ్వాలని జేఏసీ నిర్ణయించినా జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉన్న మంత్రి పార్థసారథి శుక్రవారం తన నియోజకవర్గంలో పర్యటించారు. సమైక్య ఆందోళనలకు మద్దతు ప్రకటించి, సమైక్యవాదినేనని చెప్పుకున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేలా కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి కేంద్ర మంత్రులను నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తన అభిమతమని తెలిపారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రజల వాదనను ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. తన రాజీనామా విషయంపై మాత్రం నోరు మెదపలేదు. పెరుగుతున్న మద్దతు... ఏపీ ఎన్జీవోలు ప్రకటించిన సమ్మెకు మద్దతు పెరుగుతోంది. గ్రంథాలయ ఉద్యోగులు సంఘం సమైక్యాంధ్రకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. వారు కూడా 12 అర్ధరాత్రి నుంచి నిర్వహించ తలపెట్టిన నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు తెలిపారు. జేఏసీ పిలుపు మేరకు సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల ఎంపీడీఓలు 630 మంది నిరవధిక సమ్మెకు వెళుతున్నారని రాష్ట్ర ఎంపీడీఓల అసోసియేషన్ అధ్యక్షుడు వై హరిహరనాథ్ ప్రకటించారు. విజయవాడ చిట్టినగర్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరగా, గజల్ శ్రీనివాస్ వాటికి మద్దతు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు తమ నిరసన కార్యక్రమాలను చట్టాలకు లోబడే చేసుకోవాలని ఒకవేళ వాటిని అతిక్రమించి రైళ్ల రాకపోకలను అడ్డుకునేందుకు రైలు పట్టాలపైకి వెళ్తే నాన్‌బెయిలబుల్ కేసులు ఎదుర్కోవడంతో పాటు జైలుకు వెళ్లవలసి వస్తుందని విజయవాడ రైల్వే ఎస్పీ డాక్టర్ సీహెచ్ శ్యామ్‌ప్రసాద్ హెచ్చరించారు. రహదారిపై భజనలు.. పెనుగంచిప్రోలులో సమైక్యాంద్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినూత్నంగా రహదారిపై కూర్చుని భజనలు చేశారు. భజనల్లో శ్రీఅయ్యప్ప, అమ్మవారు, శివ దీక్షా స్వాములు పాల్గొని మద్దతు తెలిపారు. తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలేదీక్షలు ప్రారంభమయ్యాయి. సమైక్యాంధ్ర కోరుతూ పామర్రులో ముస్లింలు ధర్నా చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ఎమ్మెల్యే డీవై దాసు మద్దతు తెలిపారు. మైలవరంలోనూ ముస్లీంలు భారీ ర్యాలీ నిర్వహించారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. కలిదిండి ప్రధాన సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో 20 మంది రిలే దీక్షలు చేపట్టారు. అవనిగడ్డలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన విషయంలో సోనియా మనసు మారాలని కోరుతూ ఉయ్యూరు శివాలయంలో యాగం నిర్వహించారు. ఉయ్యూరు సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో ఒంటికాలిపై నిరసన జపం చేశారు. కేసీపీ కార్మికులు, ఉయ్యూరు దళితవాడ వాసులు రిలేదీక్షల్లో పాల్గొని సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యమించారు. కంకిపాడు ఈద్గా నుంచి ముస్లిం సోదరులు ప్రదర్శనగా కంకిపాడు సెంటరుకు చేరుకుని మానవహారం నిర్వహించారు. ఈడుపుగల్లు-గోసాల సెంటరులో రైతులు, కూలీలు, ముస్లిం సోదరులు వరి నారు చేత బట్టి ఆందోళన జరిపారు. కంకిపాడులో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నూజివీడు జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక చిన్నగాంధీబొమ్మ సెంటరులో రిలేనిరాహారదీక్షలు జరిగాయి. ట్యాక్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో కార్ల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన అనేది కేవలం సోనియాగాంధీ తన కుమారుడిని ప్రధానమంత్రిని చేయాలన్న స్వార్థంతోనే జరుగుతోందని పేర్కొంటూ పట్టణంలోని కుమార్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన వీధినాటిక ప్రజలను ఆకట్టుకుంది. -
రంజాన్ సందర్బంగా ఖవ్వాలి