రాధే.. రారాదే | Salman Khan is Radhe Movie Release Postpone | Sakshi
Sakshi News home page

రాధే.. రారాదే

Mar 24 2020 12:44 AM | Updated on Mar 24 2020 12:44 AM

Salman Khan is Radhe Movie Release Postpone - Sakshi

సల్మాన్ ఖాన్

కరోనా దెబ్బకు బాలీవుడ్‌ ఇండస్ట్రీ బాక్సాఫీసు లెక్కలు, విడుదల తేదీలు గాడి తప్పాయి. ఇప్పటికే అక్షయ్‌కుమార్‌ ‘సూర్యవన్షీ’, రణ్‌వీర్‌సింగ్‌ ‘83’ వంటి సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. తాజాగా ఈ రంజాన్ పండక్కి విడుదల కావాల్సిన సల్మాన్ ఖాన్ ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ సినిమా రిలీజ్‌ కూడా వాయిదా పడుతుందనే వార్తలు బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.

ఒక్క 2013లో తప్ప 2009 నుంచి 2019 వరకు ప్రతి ఏడాది ‘వాటెండ్‌’ (2009), ‘దబాంగ్‌’ (2010), ‘బాడీగార్డ్‌’ (2011), ‘ఏక్తా టైగర్‌’ (2012), ‘కిక్‌’ (2014), ‘భజరంగీ భాయిజాన్ ’ (2015), ‘సుల్తాన్’ (2016), ‘ట్యూబ్‌లైట్‌’ (2017), ‘రేస్‌ 3’ (2018), ‘భారత్‌’ (2019)) సల్మాన్ ఖాన్ సినిమాలు రంజాన్  పండక్కి బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. ఇప్పుడు సల్మాన్‌ నటిస్తున్న ‘రాధే...’ విడుదల వాయిదా పడటంతో సల్మాన్‌ అభిమానులు రంజాన్‌కి భాయ్‌ రాడేమోనని బాధపడుతున్నారు. ‘రాధే... రారాదే’ అనుకుంటున్నారు. మరి.. పండక్కి భాయ్‌ వస్తాడా? చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement