‘రాధే’ రావడం మరోసారి వాయిదా పడ్డట్లేనని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. గత ఏడాది ఈద్‌కు విడుదల కావాల్సిన ‘రాధే’ సినిమా అప్పటి కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రంజాన్‌కు రావడానికి రెడీ అయింది. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను చిత్రబృందం మరోసారి వాయిదా వేసిందని బాలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి.
అయితే కొన్ని రోజుల క్రితం ‘రాధే’ సినిమా ఈ రంజాన్ కు విడుదల కాకపోతే బక్రీద్ సందర్భంగా జూలై 21న విడుదలవుతుందని బాలీవుడ్‌లో ప్రచారం సాగింది. కానీ మహారాష్ట్రలో థియేటర్స్ మూసివేత, ఢిల్లీ థియేటర్లలో ముపై శాతం సీటింగ్ సామర్థ్యం వంటి కారణాలతో ‘రాధే’ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేయాకూడదని అనుకుంటున్నారట నిర్మాతలు. గత ఏడాది వచ్చిన 200 కోట్ల ఓటీటీ ఆఫర్ వద్దనుకుని పంపిణీదారులు, థియేటర్ అధినేతల విజ్ఞప్తుల మేరకు ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తామని సల్మాన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో.. ‘రాధే’ ఓటీటీకి వచ్చే అవకాశం లేదు. మరి.. తాజా పరిస్థితుల దృష్ట్యా చిత్రనిర్మాతలు మనసు మార్చుకుంటారేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment