Bollywood Actor Salman Khan Radhe Movie Rights Sold To Zee Studios | రిలీజ్‌కు ముందే 230 కోట్లు - Sakshi
Sakshi News home page

రిలీజ్‌కు ముందే 230 కోట్లు

Published Thu, Jan 7 2021 9:51 AM | Last Updated on Thu, Jan 7 2021 10:20 AM

Salman Khan Radhe Movie Rights Catched By Zee Studios For 230 Crores - Sakshi

సల్మాన్‌ ఖాన్‌ క్రేజ్‌ కరోనా వచ్చినా తగ్గలేదు లాగుంది. అతడి తాజా చిత్రం ‘రాధే’ను జీ 5 మొత్తం 230 కోట్లకు కొనుగోలు చేసింది. శాటిలైట్, డిజిటల్, థియేట్రికల్‌ రిలీజ్‌ కోసం ఈ మొత్తానికి డీల్‌ కుదిరింది. ప్రభుదేవా డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా ఈ మేలో రంజాన్‌ పండగ సందర్భంగా రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. ‘మే 22న రిలీజ్‌ అనుకుంటున్నాం. ఇంకా ఫైనల్‌ కాలేదు. ఈ కరోనా భయం వెళ్లి అందరూ సేఫ్‌గా థియేటర్లకు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఉంటేనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నాము. ( ఆరేళ్లకు మళ్లీ! )

అప్పటికి ఆ పరిస్థితి పోతుందని కూడా అనుకుంటున్నాము’ అన్నాడు సల్మాన్‌ ఖాన్‌. దిశా పటాని, జాకీ ష్రాఫ్‌ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు. సల్మాన్‌ గత సినిమాలు ‘రేస్‌ 3’, ‘దబాంగ్‌ 3’, ‘భారత్‌’లు జీలో టెలికాస్ట్‌ అయ్యాయి. ఇప్పుడు ‘రాధే’ కూడా ఈ చానల్‌ సొంతమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement