
‘‘రాధే’ చిత్రాన్ని థియేటర్స్ కోసం రూపొందించాం. ఇది థియేటర్స్‌లోనే విడుదలవుతుంది’’ అన్నారు దర్శకుడు ప్రభుదేవా. సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా తెరకెక్కించిన చిత్రం ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ అన్నది క్యాప్షన్. ఇందులో దిశా పటానీ కథానాయిక. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు సల్మాన్ ఖాన్. ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. వాటిని కొట్టి పారేశారు దర్శకుడు ప్రభుదేవా. ఈ విషయం గురించి మాట్లాడుతూ– ‘‘రాధే’ చిత్రానికి సంబంధించి 3–4 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపు పూర్తయింది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్‌కు జనాలు మళ్లీ వస్తారా లేదా అనే ఆందోళ అందరిలోనూ ఉంది. కానీ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే స్టార్ సల్మాన్ మాత్రమే. థియేటర్స్ ఎప్పుడు తెరిస్తే అప్పుడు మా సినిమా విడుదలవుతుంది. అది దీపావళి అయినా క్రిస్మస్ అయినా రిపబ్లిక్ డే అయినా సరే’’ అన్నారు ప్రభుదేవా.
Comments
Please login to add a commentAdd a comment