
రంజాన్ మాసం సందర్భంగా జరుగుతున్న ఘనీ రంజాన్ టోర్నీలో పాకిస్తాన్ బ్యాటర్ ఉస్మా మీర్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో జీఐసీ జట్టుకు ఉస్మా మీర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే సోమవారం కరాచీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మా మీర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 20 బంతులు ఎదుర్కొన్న మీర్ 7 సిక్స్‌లు, 2 ఫోర్లు సాయంతో 66 పరుగులు చేశాడు.
ముఖ్యంగా జీఐసీ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన బిలాల్‌కు మీర్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్‌లో అతడు.. 5 సిక్స్‌లు, 1 ఫోర్ సాయంతో ఏకంగా 34 పరుగులు రాబట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఉస్మా మీర్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా జీఐసీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 236 పరుగులు చేసింది.
కాగా ప్రతీ ఏడాది రంజాన్ నెల సమయంలో పాకిస్తాన్‌లో ఘనీ టోర్నమెంట్‌ను నిర్వహిస్తారు. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఒక్కొక్క జట్టులో ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లకు అవకాశం కల్పిస్తారు. ఇక ఉస్మా మీర్ పాక్ తరుపున ఇప్పటివరకు మూడు వన్డేలు మాత్రమే ఆడాడు.
చదవండి: IPL 2023: యువ బౌలర్‌కు క్లాస్ పీకిన ధోని.. ఏం జరిగిందంటే?వీడియో వైరల్
Usama mir on 🔥🔥🔥🔥
— Qadir Khawaja (@iamqadirkhawaja) April 2, 2023
He scored 34 runs with 5 sixes and one 4 in an over....
What a bowler and what a clean hitter he is...
Usama mir the real future of Pakistan cricket 😍❤️🙌🙌🙌🙌
Vc: @geosupertv@iamusamamir#PakistanCricket #ramzancricket pic.twitter.com/mwcxtVvPcy
Comments
Please login to add a commentAdd a comment