
ధారూరు వికారాబాద్ : రంజాన్ మాసం ప్రారంభంలో చందమామ కొండెక్కింది. కొండెక్కిన చందమామ పైన కుడివైపున పెద్ద నక్షత్రం అనుసరించడం ధరల పెరుగుదలకు సూచనగా ప్రజల భావన. కుడివైపునకు పెరిగితే ధరలు పెరుగుతాయని, ఎడమ వైపునకు పెరిగితే ధరలన్నీ తగ్గుతాయని గ్రామీణుల విశ్వాసం. చందమామ కొండెక్కింది.
ఇంకా ధరలు ఏ మోతాదులో పెరుగుతాయో అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తంచేశారు. ఒకే నెలలో మూడుసార్లు పెట్రోల్, డీజిల్ చార్జీలు పెరగడమే ఇందుకు కారణం. గురువారం రాత్రి చందమామ కొండెక్కిన చిత్రాన్ని సాక్షి తన కెమెరాలో బంధించింది