మహత్తరం... మార్గదర్శకం
రమజాన్ కాంతులు
రమజాన్‌మాసంలో అవతరించ బడిన దైవగ్రంథం దివ్యఖురాన్. మానవ జీవన రంగాలన్నింటినీ సృజించింది. మానవ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించి, మానవాళికి స్పష్టమైన మార్గదర్శకం చేసింది. మనిషి జీవనం నుండి మరణం వరకు జీవన గమనానికి చుక్కానిని అందించింది. మనిషి జీవితంలోని లోతుపాతులను చర్చించి, లోటుపాటులను సవరించింది. మనిషి అంతరంగాన్ని కడిగి, మస్తిష్కాన్ని సంస్కరించింది. స్పష్టమైన విధి విధానాలను రూపొందించింది.
విచక్షణ, వివేకం, విజ్ఞానం ఆధారంగా కార్యక్రమాలను రూపొందించుకుని ముందు చూపుతో వ్యవహరించమని తెలిపింది. కుటుంబ విధివిధానాలను నిర్దేశించింది. మనిషి సజ్జనుడుగా, సౌశీల్యవంతుడిగా మసలుకోవాలని, ఉత్తమ పౌరునిగా సామాజిక బాధ్యతలను నెరవేర్చాలని ఆదేశాలిచ్చింది. ఆర్థిక విధివిధానాలను రూపొందించి సామాజిక సమతౌల్యం పాటించాలని వివరించింది. శిక్షాస్మృతిని ఖరారు పరచి శ్రేయోసమాజానికి బాట వేసింది. ఇలా ఇన్ని విధాల ప్రత్యేకతలున్న కట్టకడపటి దైవగ్రంథం పవిత్ర ఖురాన్?
– ఎస్. మాహెజబీన్