
మీఠా రమజాన్
ఒక నెల రోజులు...ఎంగిలి కూడా మింగకుండా అల్లాని ధ్యానించారు. మరి... పండగొచ్చినప్పుడు నోరూరే మిఠాయిలు చేసుకోవద్దా?చలో... జషన్ మనాయేంగే!మీఠా మీఠా జషన్ మనాయేంగే! ఈద్ ముబారక్!!
షీర్ ఖుర్మా
కావల్సినవి: సేమ్యా – 100 గ్రాములు; నెయ్యి – టేబుల్ స్పూన్; పాలు – 3 లీటర్లు; పంచదార – 200 గ్రాములు; బియ్యప్పిండి – 10 టేబుల్ స్పూన్‌లు;ఏలకుల పొడి – చిటికెడు; పాలపొడి – కప్పు;ఎండు ఖర్జూరం – 100 గ్రాములు(కొన్ని నీళ్లు పోసి రాత్రి పూట నానబెట్టి,
మరుసటి రోజు సన్నగా తరగాలి);బాదంపప్పు – 50 గ్రాములు;పిస్తాపప్పు – 50 గ్రాములు;పచ్చికొబ్బరి ముక్కలు – 50 గ్రాములు;
కెవ్రా (మార్కెట్‌లో లభిస్తుంది) – టీ స్పూన్
తయారీ:∙పెద్ద గిన్నెను స్టౌ మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి∙అందులో సేమ్యా వేసి సన్నని మంట మీద ముదురు గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించాలి ∙గిన్నెలో నుంచి సేమ్యాని మరొక పాత్రలోకి తీసుకోవాలి ∙స్యేమ్యా వేయించిన గిన్నెలోనే పాలు పోసి మరిగించాలి ∙బియ్యప్పిండిలో కొద్దిగా చల్లని పాలు కలిపి, ఆ మిశ్రమాన్ని, పంచదార, ఏలకుల పొడిని మరుగుతున్న పాలలో పోసి కలిపి సన్నని మంట మీద ఉడికించాలి ∙అందులో తరిగిన ఖర్జూరం, బాదంపప్పు, కిస్‌మిస్, పిస్తాపప్పు, కొబ్బరి ముక్కలు వేసి కలపాలి ∙సేమ్యావేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాలు ఉంచి తీయాలి.
కద్దూ కా మీఠా
కావలసినవి: సొరకాయ తురుము – 2 కప్పులు; పాలు – 1 లీటరు; పంచదార – 2 కప్పులు; కోవా – 2 కప్పులు; సగ్గుబియ్యం – అర కప్పు; బాదం పప్పులు – అర కప్పు; పిస్తా – అర కప్పు; మిల్క్‌మేడ్ – కప్పు; పైనాపిల్ ముక్కలు – అర కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు, కిస్‌మిస్: పది
తయారీ ∙సొరకాయ తురుమును ఉడికించి నీళ్ళు వడకట్టి పక్కన పెట్టుకోవాలి ∙బాదం, పిస్తా పప్పులను నెయ్యిలో వేయించాలి ∙అడుగు మందంగా వున్న పాత్రలో పాలు మరగబెటి,్ట సగ్గుబియ్యం కలిపి ఉడికాక కోవా కలపాలి ∙ఈ మిశ్రమం చిక్కబడిన తరువాత పంచదార కలిపి కరిగాక స్టౌపై నుంచి దించేయాలి ∙ఈ మిశ్రమాన్ని చల్లబరచి ఉడికించిన సొరకాయ తురుమును కలుపుకోవాలి ∙చివరిగా పైనాపిల్
ముక్కలు, వేయించి ఉంచిన బాదం, పిస్తా పలుకులు, కిస్‌మిస్ కలుపుకోవాలి.
చావల్ కా మీఠా
కావలసినవి: బాస్మతి బియ్యం రవ్వ – కప్పు; పాలు – 2 కప్పులు; కోవా – కప్పు; జీడిపప్పు పేస్ట్ – అర కప్పు; రోజ్‌వాటర్ – టీ స్పూను; బాదం, కిస్‌మిస్ – అరకప్పు
తయారీ :అడుగు మందంగా వున్న పాత్రలో పాలు మరిగించి బాస్మతి బియ్యం రవ్వ కలిపి ఉడికించాలి ∙రవ్వ ఉడికిన తరువాత కోవా, పంచదార కలిపి ఐదు నిమిషాలుంచి పిస్తా, రోజ్‌వాటర్ కలిపి స్టౌ పైనుంచి దించేయాలి ∙చావల్ కా మీఠాను మట్టిపాత్రలో వుంచితే తేమని పీల్చుకుని మరింత రుచిగా వుంటుంది. బాదం, కిస్‌మిస్‌తో గార్నిష్ చేయాలి.
ఖుబాని కా మీఠా
కావలసినవి: ఖుబాని (డ్రై ఆప్రికాట్లు) – 1 కప్పు పంచదార – ఒకటిన్నర కప్పు రాస్‌బెర్రి ఎసెన్స్ – అర టీ స్పూను డ్రైఫ్రూట్స్ : గార్నిషింగ్‌కి
తయారీ: ఖుబానీలను 10 గంటలు నానబెట్టుకోవాలి విత్తనాలు తీసేసి ఒక గంట ఉడకబెట్టాలి .ఖుబానీలు మెత్తబడగానే పంచదార కలపాలి .తరువాత మరో అరగంట పాటు ఉడికించి చివరిగా రాస్‌బెర్రి ఎసెన్స్ కలిపి దించాలి. చివరగా డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి.
డబుల్ కా మీఠా
కావలసినవి: బ్రెడ్ – 4 స్లైసెస్; పాలు – 1 కప్పు; పంచదార – 1 కప్పు; జీడిపప్పు – అర కప్పు; పిస్తా పప్పు – అరకప్పు; బాదంపప్పు – అర కప్పు; నెయ్యి – అర కప్పు; నీళ్ళు – 3 టీస్పూన్లు; ఏలకులపొడి – అర టీ స్పూను
తయారీ: బ్రెడ్‌ని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి, నెయ్యిలో వేయించి పక్కన ఉంచాలి ∙బాదం, పిస్తా, జీడిపప్పులను కూడా ఆ నెయ్యిలో వేయించాలి ∙ఓ పాత్రలో పాలు మరగబెట్టాలి ∙బ్రెడ్ ముక్కలను మరిగిన పాలలో వేసి కలుపుకోవాలి ∙పంచదారలో నీళ్ళు పోసి కలిపి పాకం పట్టి, బ్రెడ్ ను వేయించగా మిగిలిన నెయ్యిని కలుపుకోవాలి ∙దీంట్లో బ్రెడ్ మిశ్రమాన్ని, పిస్తా, బాదం, జీడిపప్పు, ఏలకులపొడి చల్లి మంట తీసేయాలి ∙దీనిని వేడిగానూ, చల్లగానూ సర్వ్ చేయవచ్చు.
కేసర్ సేమ్యా మీఠా
కావల్సినవి:సేమ్యా – 10 గ్రాములు పాలు – కప్పుపంచదార – 200 గ్రాములుకోవాల లేదా కలాకండ్ – 100 గ్రాములుజీడిపప్పు – 50 గ్రాములు కేసరి కలర్ – చిటికెడు కుంకుమపువ్వు – 10 రేకలు
తయారీ: కడాయిలో నెయ్యి వేసి, సేమ్యాని వేయించి తీయాలి ∙మరొక పాత్రలో పాలు మరిగించి అందులో పంచదార, ఏలకుల పొడి, కేసరి రంగు, కోవా, కుంకుమపువ్వు వేసి కలపాలి దీంట్లో సేమ్యా కలపాలి ∙సేమ్యా ఉడికాక, దించి, జీడిపప్పుతో అలంకరించి సర్వ్ చేయాలి.