మాన్వి పట్టణంతో పాటు తాలూకాలో ముస్లింలు శుక్రవారం పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
భక్తిశ్రద్ధలతో రంజాన్
Published Sat, Aug 10 2013 3:24 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
మాన్వి /లింగసూగూరు, న్యూస్‌లైన్ : మాన్వి పట్టణంతో పాటు తాలూకాలో ముస్లింలు శుక్రవారం పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లింలు ఉదయం నుంచే పట్టణంలోని ప్రధాన కుబా, జామియా, హుదా మసీదులతో పాటు అన్ని మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్ చేశారు. స్థానిక సింధనూరు రోడ్డులోని నమాజ్‌గేరి కొండపై ఉన్న ఈద్గా మైదానానికి ఊరేగింపుగా వెళ్లారు.
ఈ సందర్భంగా ముస్లిం ప్రముఖులు డాక్టర్ గులాం జిలానీ ఖురాన్ పఠించగా, జీశాంత్ మౌలానా సామూహిక నమాజ్ నిర్వహించారు. అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హంపయ్య నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ గఫూర్‌సాబ్, అయ్యన గౌడ జంబలదిన్ని, జెడ్పీ స్థాయీ సమితి అధ్యక్షుడు హనుమేష్ మద్లాపూర్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ తాలూకా అధ్యక్షుడు జీ.సమదాని నాయక్, ఆ పార్టీ నాయకులు శంకరయ్యస్వామి సువర్ణగిరిమఠ, బీకే అమరేశప్ప, సీ.గురునాథ్, మల్లనగౌడ నక్కుంది, హుసేనప్ప జగ్లి, జీ.నాగరాజ్, మల్లికార్జునగౌడ గణేకల్, జే.సుధాకర్, రాజశేఖర్‌గౌడ జానేకల్, పురసభ సభ్యులు సబ్జలీసాబ్, ఎన్.మల్లికార్జున, యల్లయ్య నాయక్, మహాంతేశస్వామి రౌడూరు, లచమయ్య నాయక్, ఎస్.మహ్మద్, వివిధ పార్టీల నాయకులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
లింగసూగూరులో...:
పట్టణంలో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. మహ్మద్ యూసూన్ కరడకల్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఖుతుబాత్ చదివారు. తంజీముల్ ముస్లిమన్ కమిటీ ఉపాధ్యక్షుడు లాల్ అహ్మద్‌సాబ్, ఖాదర్‌పాషా, ఇక్బాల్ హవల్దార్, హరూన్, చాంద్‌పటేల్, నసీర్‌మియా, హుసేన్‌సాబ్, మెహబూబ్ అలీ, మెహబూబ్ హుసేన్, మహ్మద్ రఫీ, బాబా ఖాజీ, అనీస్‌పాషా, ఫయాజ్‌అహ్మద్, హుసేన్‌సాబ్, అక్బర్, ఫైసల్, మహ్మద్ ఖాజాహుసేన్, అహ్మద్ పాషా, జిలానిపాషా, రఫీక్, షమీన్, అమీన్, షఫీక్, ఇంతియాజ్, అక్తర్, రాజా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మానప్ప వజ్జల్ ఈద్గా మైదానంలో ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. జేడీఎస్ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గిరిమల్లనగౌడ, అధ్యక్షుడు శివానంద ఐదనాళ, శరణగౌడ, వీరనగౌడ లెక్కిహాళ, శరణప్ప, హనుమంతు తదితరులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
రాయుచూరు సిటీ:రాయుచూరు జిల్లాలో ముస్లింలు రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఈద్గా మైదానంలో ముస్లింలు నమాజు చేసి, సామూహిక ప్రార్థనలు చేశారు. నగరంలోని జామియూ, వుక్కా, మోతి, ఏక్ మినార్ తదితర వుసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేసి, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా మైదానంలో రాయుచూరు ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, గ్రామీణ శాసన సభ్యుడు తిప్పరాజు, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ యాసిన్, నగరసభ సభ్యులు తివ్మూరెడ్డి, శివవుూర్తి, శ్రీనివాస్ రెడ్డి, శాంతప్ప, రుద్రప్ప, జిల్లాధికారి నాగరాజు, ఎస్పీ బిస్నళ్లి, జెడ్పీ సీఈఓ ముద్దు మోహన్, డీఎస్‌పీ దివ్య, నగరసభ మాజీ అధ్యక్షుడు మారెప్ప, కాంగ్రెస్ నాయకులు బసవరాజ్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వసంత్‌కుమార్, జేడీఎస్ అధ్యక్షుడు మహ ంతేష్ పాటిల్ ముస్లింలుకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేవదుర్గలో దేవదుర్గ శాసన సభ్యుడు వెంకటేష్ నాయక్, మాజీ వుంత్రి శివనగౌడ నాయుక్ ముస్లింలుకు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు.
Advertisement
Advertisement