బరేలీ: తాము చెప్పిన పాఠం గుర్తుంచుకోలేదని, తిరిగి ఒప్పజెప్పలేకపోయాడని ఓ పదేళ్ల బాలుడిని 170 బస్కీలు తీయించారు. ఈ ఘటన బరేలీలో చోటుచేసుకుంది. అక్కడి మదర్సాలో మౌల్వీ అనే పదేళ్ల బాలుడు చదువుతున్నాడు. అతడు ఖురాన్లోని ఓ చాప్టర్ కంఠస్తం చేయలేకపోయాడు. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన మదర్సాలో బోధించే టీచర్ ఆ పిల్లాడితో 170 బస్కీలు తీయించాడు. అంతటితో ఆగకుండా కర్ర తీసుకుని ఎడపెడా కొట్టాడు. నేల మీద పడేసి పిల్లాడి ఛాతీపై కూర్చొని అతడి జుట్టును చేతిలోకి తీసుకొని ఇష్టమొచ్చినట్లుగా పీకేశాడు. అనంతరం గుర్రుమని గాండ్రిస్తూ బయటికిపో అంటూ మదర్సా నుంచి తోసి పడేశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన మౌల్వీ ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.