ఈ మాసం... ప్రత్యేకతలకు ఆవాసం | Ramazan month started | Sakshi
Sakshi News home page

ఈ మాసం... ప్రత్యేకతలకు ఆవాసం

Published Thu, Jun 1 2017 11:10 PM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

ఈ మాసం... ప్రత్యేకతలకు ఆవాసం

ఈ మాసం... ప్రత్యేకతలకు ఆవాసం

రమజాన్‌ కాంతులు

అల్లాహ్‌ సమస్త జీవరాశుల కోసం సంవత్సరంలోని పదకొండు నెలలు కేటాయించి, ఈ ఒక్క రమజాను మాసాన్ని మాత్రం తనకోసం అట్టే పెట్టుకున్నాడు. అందుకే ఆరాధనల్లో అత్యధిక భాగం ఈ నెలలోనే నిర్వహించ వలసి ఉంటుంది. దైవవాణి దివ్య ఖుర్‌ ఆన్‌ ఈ నెలలోనే కడపటి ప్రవక్త అయిన హజ్రత్‌ ముహమ్మద్‌ (స) పై అవతరించింది. ఈ నెలలోనే రోజా (ఉపవాసం) విధిగా చేయబడింది. తరావీహ్‌ నమాజులు ఈ మాసంలోనే నిర్వహించబడతాయి.

వేయి రాత్రులకంటే శ్రేష్ఠమయిన రాత్రి లైలతుల్‌ ఖద్ర్‌ ఈ మాసంలోనే ఉంది. జకాత్, సదకా, ఫిత్రా వంటి దానాలు చేయటం, ఖురాన్‌ పారాయణం చేయడం ఈ మాస ప్రత్యేకతలు. ఇంకా ఈ మాసంలోనే ఇబ్రాహీం ప్రవక్తకు సహీఫాలు, మూసాప్రవక్తకు తౌరాత్‌ గ్రంథం, దావూద్‌ ప్రవక్తకు జబూర్‌ గ్రంథం, ఈసా (ఏసుక్రీస్తు) ప్రవక్తకు బైబిల్‌ గ్రంథం ప్రసాదించబడింది.
– షేఖ్‌ అబ్దుల్‌ హఖ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement