ఏడాదైంది.. సాయం ఏదీ?
ఏడాదైంది.. సాయం ఏదీ?
Published Thu, Jul 21 2016 10:20 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
పుష్కరాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితుడు
సీఎం, కలెక్టర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
రాజమహేంద్రవరం క్రైం: గత ఏడాది పుష్కరాల తొమ్మిదవ రోజున సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీ హనుమాన్ కూల్ కార్నర్ యజమాని గొర్రెల సుబ్రహ్మణ్యం కోరారు. ఆయన గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో తన గోడు వెళ్లబోసుకున్నారు. గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్దVýæల మున్సిపల్ కాంప్లెక్స్‌లో తాను నిర్వహిస్తున్న శ్రీ హనుమాన్ కూల్ కార్నర్ షాపు ç22.7.2015 రాత్రి తొమ్మిది గంటల సమయంలో సంభవించిన అగ్నిప్రమాదంలో కాలిపోయిందన్నారు. ఆ అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 1.75 లక్షల నగదు కాలి బూడిదైపోయిందని, ఫ్రిజ్‌లు, మిక్సీలు, కౌండర్‌లు, ఫర్నిచర్ సర్వం బూడికుప్పగా మారిందని వాపోయారు. ఆ ప్రమాదంలో సుమారు రూ. 20 లక్షల వరకూ నష్టం వాటిల్లిందన్నారు. ఆ అగ్ని ప్రమాదంలో తాను కూడా గాయాల పాలై ప్రభుత్వఆస్పత్రిలో చికిత్స పొందానని తెలిపారు. ఆ సమయంలో సంఘటన స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులను ఆదుకొంటామని హామీ ఇచ్చారన్నారు. హాస్పటల్‌కు వచ్చిన కలెక్టర్ అరుణ్ కుమార్ బీసీ కార్పొరేషన్ ద్వారా రూ. 1లక్ష సబ్సిడీ రుణం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఏడాది అయినప్పటికీ నష్టపరిహారం గాని, బీసీ కార్పొరేషన్ రుణం కానీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తాను ఏ పనీ చేసుకోలేని స్థితిలో ఉన్నానని, కుటుంబ పోషణ చేసుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సుబ్రహ్మణ్యం భార్య, కుమారులు కూడా పాల్గొన్నారు.
Advertisement
Advertisement