జిల్లాలో ఈనెల 31 నుంచి జరగనున్న గోదావరి అంత్య పుష్కరాలకు 12 మంది డిప్యూటీ కలెక్టర్లను ఘాట్ల ఇన్‌చార్‌్జలుగా నియమిస్తూ కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎ.శ్రీరామచంద్రమూర్తిని రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్‌కు, పి.శ్రీరామచంద్రమూర్తికి పుష్కర్ ఘాట్‌కు, టీవీఎస్‌జీ కుమార్‌ను టీటీడీ ఘాట్‌కు, ఎన్.సుగుణ కుమారిని మార్కెండేయస్వామి దేవాలయం ఘాట్‌కు, ఎస్.మల్లిబాబును శారదానంద ఘాట్‌కు, ఎస్.భీమానంద్‌ను పద్మావతి ఘాట్‌కు ుఇన్‌చార్జులుగా నియమించారు. అలాగే జీవీ సత్యవాణిని సరస్వతి ఘాట్, వీవీఐపీ ఘాట్‌కు, డీఎస్ సునితాను గౌతమీ ఘాట్‌కు నియమించారు. ధవళేశ్వరం రామపాదాల రేవుకు హెచ్‌వీ ప్రసాద్‌రావును, కోటిపల్లి పుష్కర్ ఘాట్, కోటిపల్లి పుష్కర్ «ఘాట్–1,2లకు రామచంద్రపురం ఆర్‌డీఓ కె.సుబ్బారావును, దేవీపట్నంలోని పోచమ్మగండి ఘాట్‌కు డీవీఎల్‌ఎం ఎల్లారమ్మను, అంతర్వేది, వాడపల్లి, అప్పనపల్లి ఘాట్‌లకు ఇన్‌చార్జి అధికారిగా అమలాపురం ఆర్‌డీఓ జి.గణేష్ కుమార్‌ను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారులతో సమీక్ష