రూట్‌ మ్యాప్‌ ఖరారు | Krishna Pushkara Route Map Ready | Sakshi
Sakshi News home page

రూట్‌ మ్యాప్‌ ఖరారు

Published Mon, Aug 1 2016 6:46 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

రూట్‌ మ్యాప్‌ ఖరారు

రూట్‌ మ్యాప్‌ ఖరారు

విజయవాడ : కృష్ణా పుష్కర యాత్రీకుల సౌకర్యార్థం అధికారులు రూట్‌ మ్యాప్‌లు ఖరారు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సులభంగా ఘాట్లకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు, దేవాలయాలకు వెళ్లేందుకు వీలుగా ఈ ర్యూట్‌ మ్యాప్‌లు రూపొందించారు. ఈ రూట్‌ మ్యాప్‌లను నగరపాలక సంస్థ అధికారులు విజయవాడకు నలువైపులా, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేశారు. జాతీయ రహదారులు, ప్రధాన మార్గాల్లో వచ్చే యాత్రికులు ఎలా వెళ్లాలి... ఎక్కడ పుష్కరనగర్‌లు ఉన్నాయి.. ఏయే ప్రాంతాల్లో ఎటువంటి వసతులు ఉన్నాయి... తదితర వివరాలను ఆ మ్యాప్‌లలో వివరించారు. 
 
రూట్‌ మ్యాప్‌ల ఏర్పాటు ఇలా..
– ఏలూరు నుంచి వచ్చే భక్తులు నగరంలోకి ప్రవేశించగానే కనిపించే విధంగా రామరవప్పాడు రింగ్‌ వద్ద రూట్‌ మ్యాప్‌ బోర్డులు ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లే మార్గాలను యారో మార్కుల ద్వారా సూచించారు. ఆ తర్వాత అదే రూట్‌లో వచ్చే వారికి కనిపించే విధంగా ప్రభుత్వాస్పత్రి జంక్షన్‌ వద్ద మరో రూట్‌ మ్యాప్‌ను పెట్టారు. అదే మార్గంలో రమేష్‌ ఆస్పత్రి జంక్షన్, బెంజిసర్కిల్‌ వద్ద కూడా రూట్‌ మ్యాప్‌లు ఏర్పాటుచేశారు. 
– మచిలీపట్నం వైపు నుంచి 65వ నంబరు జాతీయ రహదారిలో వచ్చే భక్తులకు తెలిసేలా సిటీ జంక్షన్‌లో రూట్‌ మ్యాప్‌ ఏర్పాటు చేశారు. 
– జాతీయ రహదారి మీదుగా గుంటూరు వైపు నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం కనకదుర్గ వారధి వద్ద రూట్‌ మ్యాప్‌లు పెట్టారు. ప్రకాశం బ్యారేజీ వద్దకు వెళ్లకుండానే ఘాట్లకు చేరుకునే విధంగా మ్యాప్‌ను రూపొందించారు.
 – హైదరాబాద్‌ నుంచి జాతీయ రహదారి మీదుగా వచ్చే వారికి అర్థమయ్యే విధంగా ఇబ్రహీంపట్నం జంక్షన్‌ వద్ద రూట్‌ మ్యాప్‌ ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ఎవరు ఏ ఘాట్‌లకు వెళ్లాలి... ఎలా చేరుకోవాలి... నగరంలో చూడదగిన ప్రదేశాలకు ఎలా వెళ్లాలి.. అనే వివరాలను ఆ రూట్‌æమ్యాప్‌లో వివరించారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement