Bharat Nyay Yatra: రాహుల్‌ గాంధీ యాత్ర.. ఫోకస్‌ అంతా అక్కడే! | Rahul Gandhi Bharat Nyay Yatra Likely To Be focus On UP Gujarat | Sakshi
Sakshi News home page

Bharat Nyay Yatra: రాహుల్‌ గాంధీ యాత్ర.. ఫోకస్‌ అంతా అక్కడే!

Published Tue, Jan 2 2024 11:09 AM | Last Updated on Tue, Jan 2 2024 1:20 PM

Rahul Gandhi Bharat Nyay Yatra Likely To Be focus On UP Gujarat - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ‘భారత్‌ న్యాయ యాత్ర’ జనవరి 14 నుంచి మణిపూర్‌లోని ఇంపాల్‌లో ప్రారంభం కానుంది. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లను మీదుగా.. ఈ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో సాగనుంది. రాబోయే 2024 సాధారణ పార్లమెంట్‌లో గెలుపే లక్ష్యంగా రాహుల్‌ గాంధీ చేపట్టబోయే యాత్రకు ప్రాధాన్యత సంతరించుకుంది.

రాహుల్‌ గాంధీ తన ‘భారత్‌ న్యాయ యాత్ర’ద్వారా ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలను ఫోకస్‌ చేయనున్నట్లు తెలుసోంది. వీలైనన్ని ఎక్కువ రోజులు ఈ రెండు రాష్ట్రాలను యాత్ర కొనసాగిస్తారని సమాచారం. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒకే ఎంపీ స్థానంలో గెలుపొంది. సోనియా గాంధీ రాయ్‌బరేలి సెగ్మెంట్‌లో గెలుపొందారు.

అదే విధంగా గుజరాత్‌లో గత రెండు సాధారణ పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ పార్టీ కనీసం కనీసం ఒక్కసీటు కూడా గెలవకపోవటం గమనార్హం. అయితే పార్టీ గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ పాగా వేయడానికి రాహుల్‌ గాంధీ యాత్రను ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఈసారి స్థానిక నేతల అభ్యర్థనలు, పార్టీ రాజకీయ ప్రయోజనాలు, 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యం వంటి అంశాల నేపథ్యంలో యూపీ, గుజరాత్‌లో రాహుల్‌ ‘భారత్‌ న్యాయ యాత్ర’ సుమారు వారంరోజుల సాగనుంది తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ కూడా యూపీ, గుజరాత్‌లో రాహుల్‌ యాత్ర కొనసాగాలని భావిస్తున్నట్లు కార్యకర్తల్లో చర్చ మొదలైంది. అయితే గతంలో రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ గుజరాత్‌ అడుగు పెట్టలేదు. ఉత్తరప్రదేశ్‌లో తగిన ప్రాధాన్యం  ఇవ్వకుండా కేవలం మూడు రోజులు మాత్రమే రాహుల్‌ గాంధీ యాత్ర కొనసాగించారు.

మణిపూర్‌లో యాత్ర ప్రారంభమై నాగాలాండ్‌లో ఒకరోజు, ఆస్సాంలో 3 లేదా 4 రోజులు రోజుల పాటు యాత్ర కొనసాగి పశ్చిమ బెంగాల్‌లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్‌లో సైతం కాంగ్రెస్‌ పార్టీ గత పార్లమెంట్‌ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమైతమైనంది. బెంగాల్‌లోని ఉత్తర బెంగాల్‌ ప్రాంతంలో యాత్ర ఫోకస్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. నార్త్‌ బెంగాల్‌లో ఉన్న మూడు స్థానాలు రిజర్వడ్‌ కాగా.. అక్కడ కాంగ్రెస్‌ బలమైన ఓటు  బ్యాంక్‌ ఉండటం విశేషం. 

గత యాత్రలో యాత్రలో రాహుల్‌ గాంధీ గుజరాత్‌ పర్యటించకపోవటనికి కారణం రూట్‌ సమస్యలేనని, కానీ ‘భారత్‌ న్యాయ యాత్ర’లో గుజరాత్‌లో చాలా ప్రాంతాల్లో రాహుల్‌ యాత్ర కొనాసాగుతుందని ఓ కాంగ్రెస్‌ నేత తెలిపారు. 14 రాష్ట్రాల్లో చేపట్టబోయే రాహుల్‌ ‘భారత్ న్యాయ యాత్ర’ 358 ఎంపీ నియోజకవర్గాల కుండా సాగుతుంది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌పార్టీ రాహుల్‌ గాంధీ యాత్రకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ముంబైలో ముగిసే రాహుల్‌ ‘భారత్‌ న్యాయ యాత్ర’కు సంబంధించిన అధికారిక ఫైనల్‌ రూట్‌ మ్యాప్‌ సిద్ధం కాలేదు.

చదవండి:    కాంగ్రెస్ కు పరీక్షా కాలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement