Main centers
-
ఇళ్ల అమ్మకాలు పెరిగాయ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనమిది ప్రధాన నగరాల్లో జూలై–సెప్టెంబర్ కాలంలో ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 59 శాతం వృద్ధి నమోదై 55,907 యూనిట్లు విక్రయమయ్యాయి. 2021 ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే క్రితం త్రైమాసికంలో మూడు రెట్లకుపైగా డిమాండ్ రావడం గమనార్హం. హౌసింగ్ బ్రోకరేజ్ కంపెనీ ప్రాప్‌టైగర్.కామ్ ప్రకారం.. 2020 జూలై–సెపె్టంబర్లో ఈ సంఖ్య 35,132 యూనిట్లుగా ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఇళ్లకు డిమాండ్ అధికమైంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం, ఇళ్ల ధరలు అందుబాటులోకి రావడం, కోవిడ్ నేపథ్యంలో సొంత ఇల్లు ఉండాలని కోరుకోవడం వంటివి ఈ డిమాండ్‌కు కారణం. మొత్తం అమ్మకాల్లో రూ.45 లక్షలలోపు విలువ చేసే ఇళ్ల వాటా 40 శాతంగా ఉంది. రూ.45–75 లక్షల విలువ గలవి 28 శాతం వాటా దక్కించుకున్నాయి. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు రెండింతలకుపైగా అధికమై 3,260 నుంచి 7,812 యూనిట్లకు చేరాయి. -
తొలి దశలో రెండువేల 5జీ టవర్ల నిర్మాణం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో 5జీ టవర్లను నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ టవర్స్ లిమిటెడ్ (ఏపీటీఎల్) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోవిడ్–19 దెబ్బతో 5జీ సేవలు అందుబాటులోకి రావడానికి ఆలస్యం కానుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తొలి దశలో కనీసం 2,000 టవర్లను ఏదైనా ఒక భాగస్వామ్య సంస్థతో నిర్మించి వాటిని టెలికాం ఆపరేటర్లకు లీజుకు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఏపీటీఎల్ ఎండీ ఆర్. పవనమూర్తి తెలిపారు. భూమి లీజుదారులు, టెలికాం ఆపరేటర్ల మధ్య ఏపీటీఎల్ ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తుందన్నారు. దీనివల్ల ఒకే టవర్‌ను అనేక ఆపరేటర్లు వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. కాగా, ఈ సంవత్సరాంతానికి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రావాల్సి ఉండగా..ప్రధాని మోదీ ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా చైనా పరికరాలు కాకుండా దేశీయ పరికరాలే వాడాలని పేర్కొనడంతో ఆలస్యమవుతోంది. ఇప్పటికే సీడాట్, టెక్ మహీంద్రా వంటి దేశీయ సంస్థలు సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. (తిరుపతి శిల్పారామానికి రూ.10 కోట్లు) -
రూట్ మ్యాప్ ఖరారు
విజయవాడ : కృష్ణా పుష్కర యాత్రీకుల సౌకర్యార్థం అధికారులు రూట్ మ్యాప్‌లు ఖరారు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సులభంగా ఘాట్లకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు, దేవాలయాలకు వెళ్లేందుకు వీలుగా ఈ ర్యూట్ మ్యాప్‌లు రూపొందించారు. ఈ రూట్ మ్యాప్‌లను నగరపాలక సంస్థ అధికారులు విజయవాడకు నలువైపులా, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేశారు. జాతీయ రహదారులు, ప్రధాన మార్గాల్లో వచ్చే యాత్రికులు ఎలా వెళ్లాలి... ఎక్కడ పుష్కరనగర్లు ఉన్నాయి.. ఏయే ప్రాంతాల్లో ఎటువంటి వసతులు ఉన్నాయి... తదితర వివరాలను ఆ మ్యాప్‌లలో వివరించారు. రూట్ మ్యాప్‌ల ఏర్పాటు ఇలా.. – ఏలూరు నుంచి వచ్చే భక్తులు నగరంలోకి ప్రవేశించగానే కనిపించే విధంగా రామరవప్పాడు రింగ్ వద్ద రూట్ మ్యాప్ బోర్డులు ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లే మార్గాలను యారో మార్కుల ద్వారా సూచించారు. ఆ తర్వాత అదే రూట్లో వచ్చే వారికి కనిపించే విధంగా ప్రభుత్వాస్పత్రి జంక్షన్ వద్ద మరో రూట్ మ్యాప్‌ను పెట్టారు. అదే మార్గంలో రమేష్ ఆస్పత్రి జంక్షన్, బెంజిసర్కిల్ వద్ద కూడా రూట్ మ్యాప్‌లు ఏర్పాటుచేశారు. – మచిలీపట్నం వైపు నుంచి 65వ నంబరు జాతీయ రహదారిలో వచ్చే భక్తులకు తెలిసేలా సిటీ జంక్షన్లో రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. – జాతీయ రహదారి మీదుగా గుంటూరు వైపు నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం కనకదుర్గ వారధి వద్ద రూట్ మ్యాప్‌లు పెట్టారు. ప్రకాశం బ్యారేజీ వద్దకు వెళ్లకుండానే ఘాట్లకు చేరుకునే విధంగా మ్యాప్‌ను రూపొందించారు. – హైదరాబాద్ నుంచి జాతీయ రహదారి మీదుగా వచ్చే వారికి అర్థమయ్యే విధంగా ఇబ్రహీంపట్నం జంక్షన్ వద్ద రూట్ మ్యాప్ ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ఎవరు ఏ ఘాట్లకు వెళ్లాలి... ఎలా చేరుకోవాలి... నగరంలో చూడదగిన ప్రదేశాలకు ఎలా వెళ్లాలి.. అనే వివరాలను ఆ రూట్æమ్యాప్‌లో వివరించారు. -
నగరంపై ‘నిఘా’ నేత్రాలు
ఖమ్మం క్రైం: నగరంలో నేరాలకు చెక్ పెట్టేందుకు, నేరగాళ్లు.. అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే నగరంపై సీసీ కెమెరాలతో నిఘా వేస్తోంది. నగరంలోని ప్రధాన కేంద్రాలలో ఈ కెమెరాలు నిరంతరం ఓ కన్నేసి ఉంచుతాయి. 20కి పైగా కేంద్రాలలో... నగరంలో వ్యాపార కూడళ్లు, అపార్ట్మెంట్లు, పెట్రోల్ బంక్‌ల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటయ్యూయి. పోలీస్ శాఖ కూడా నగరంలోని 20కి పైగా కేంద్రాలలో సీసీ కెమెరాలను అతి త్వరలో ఏర్పాటు చేయనుంది. ఈ కెమెరాలు మంగళవారం డీజీపీ కార్యాలయం నుంచి నగరానికి వచ్చాయి. నగరానికి చేరిన ఈ సీసీ కెమెరాలు అత్యంత నాణ్యమైనవని పోలీస్ శాఖ చెబుతోంది. వీటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందనే అంశంపై ఎస్పీ షానవాజ్ ఖాసిం ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచి డీఎస్పీ అశోక్‌కుమార్ కసరత్తు చేస్తున్నారు. పలువురి అభిప్రాయూలను ఆయన తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రాలలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరగడంతో వీటికి పాల్పడే వారు తాము నేరం చేసిన తర్వాత పారిపోవడం, వారిని గుర్తించడంలో పోలీస్ శాఖ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ఈ మేరకు ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల నేరం చేసిన వారు ఎక్కడికి వెళ్లారనేది.. ఏవైపు ప్రయాణించారనేది సీసీ టీవీ పుటేజీల ద్వారా తెలిసిపోవడంతోపాటు నేరానికి పాల్పడిన వారు సైతం పోలీస్‌శాఖకు దొరికే అవకాశం తప్పక ఉంటుంది. నేరగాళ్లను పట్టుకోవడం తేలిక - సీసీ కెమెరాల ఏర్పాటుతో ఎన్నో ప్రయోజనాలున్నారుు. ప్రధానంగా నేరగాళ్లను గుర్తించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నారుు. - నగరంలోని జడ్పీ సెంటర్లో గత సంవత్సరం నిషాంత్ అనే బాలుడిని అతని బాబాయి చింతగుండ్ల మధు తీసుకెళ్లి చంపేశాడు. బాలుడిని మధు తీసుకెళుతున్న దృశ్యం సీసీ కెమెరాలో నమోదైంది. పోలీసుల దర్యాప్తులో ఈ కెమెరా ఫుటేజీ కీలకంగా మారింది. హంతకుడు మధును పోలీసులు పట్టుకున్నారు. - నగరంలోని మయూరి సెంటర్‌లోగల ఓ బార్లో.. ఓ వ్యక్తిని మద్యంలో విషం కలిపి కొందరు హత్య చేశారు. ఇక్కడ కూడా నేరస్తులను పట్టిచ్చింది సీసీ కెమెరాలే. - గత సంవత్సరం సత్తుపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో చోరీలు చేసిన దొంగలను అప్పటి డీఎస్పీ అశోక్‌కుమార్ పట్టుకుని దాదాపు రూ.90లక్షలకు పైగా సొత్తును తిరిగి రాబట్టారు. ఈ కేసు దర్యానప్తులో అక్కడి సీసీ కెమెరా ఫుటేజీ దోహదపడింది.