ఎమ్మెల్సీ బాలసాని దంపతుల పుష్కరస్నానం | mlc balasani couple pushkara bath | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ బాలసాని దంపతుల పుష్కరస్నానం

Published Thu, Aug 11 2016 12:30 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

గోదావరికి పూజలు నిర్వహిస్తున్న బాలసాని దంపతులు - Sakshi

గోదావరికి పూజలు నిర్వహిస్తున్న బాలసాని దంపతులు

భద్రాచలం గోదావరి స్నానఘట్టాల రేవులో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బుధవారం సతీ సమేతంగా పుష్కర స్నానమాచరించారు. తీరంలో ప్రత్యేక పూజలనంతరం ఆయన స్నానం చేసి రామాలయాన్ని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ తాయారు అమ్మవారు, అభయాంజనేయస్వామి వారి ఆలయాలనూ దర్శించుకున్నారు. ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, టీఆర్‌ఎస్‌నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మానె రామకృష్ణ, యశోద నగేష్‌ తదితరులు ఎమ్మెల్సీ వెంట ఉన్నారు.            – భద్రాచలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement