పుష్కరఘాట్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయండి
సంగమేశ్వరంలో పుష్కరఘాట్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
సంగమేశ్వరం(కొత్తపల్లి): సంగమేశ్వరంలో పుష్కరఘాట్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కపిలేశ్వరంలో అన్నిశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతుండటంతో దిగువప్రాంతాల్లోని పుష్కరఘాట్లు మునిగి అవకాశం ఉందన్నారు. దీన్ని దష్టిలో పెట్టుకొని ఎగువప్రాంతాల్లోని పుష్కరఘాట్లను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద మరుగుదొడ్లు, దుస్తువుల మార్చుకునేందుకు గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాల కోసం పార్కింVŠ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఆయన సంగమేశ్వరంలో జరుగుతున్న పుష్కర పనులను పరిశీలించారు. ఎగువప్రాంతం నుంచి వరద ఉద్ధతి తగ్గకపోతే∙రెండు రోజుల్లో సంగమేశ్వరం గుడి మునిగిపోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జేసీ హరికిరణ్, ప్రత్యేక కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆర్డీఓ రఘుబాబు, అడిషనల్ ఎస్పీ చంద్రశేఖరరెడ్డి, తహసీల్దారు నరసింహులు, సీఐ దివాకర్‌రెడ్డి, ఎసై ్స శివశంకర్‌నాయక్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.