కంట్రోల్ రూమ్‌లో స్క్రీన్‌లో వెబ్‌సైట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ తదితరులు
పుష్కరాల కంట్రోల్‌రూమ్‌ను సందర్శించిన కలెక్టర్
Published Fri, Aug 12 2016 12:59 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కష్ణా పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందుల రాకుండా చర్యలు తీసుకునేందుకు జిల్లా స్థాయిలో సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ టీకేశ్రీదేవి గురువారం సందర్శించారు. కంట్రోల్ రూమ్ నుంచి∙పుష్కర ఘాట్లను పర్యవేక్షించి రద్దీ నివారణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పుష్కరాల నిర్వహణపై తయారు చేసిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన స్క్రీన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జేసి రాంకిషన్, ఏజేసీ బి.రంజిత్ ప్రసాద్, డిఆర్వో భాస్కర్, జడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ ఏఓ నర్సయ్య, మీసేవా సూపరింటెండెంట్ బక్క శ్రీనివాసులు, కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.
వలంటీర్ల శిబిరం ప్రారంభం..
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించేందుకు వెళ్తున్న వలంటిర్ల శిబిరాలను గురువారం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పుష్కరాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ అధ్యక్షుడు అనంతరెడ్డి, ఉపాద్యక్షుడు నటరాజ్, ఎంవీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్, పాండరంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో వాలంటీర్ల బందాలు పుష్కర ఘాట్ల వద్ద విధులు నిర్వహించేందుకు బయలుదేరాయి.
Advertisement