CONTROLROOM
-
విద్యుత్ సమస్యలు తలెత్తనీయొద్దు
– కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలి – ఇందన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ కర్నూలు(రాజ్‌విహార్): రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ సమస్య తలెత్తనీయకుండా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ఇందన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన విజయవాడ నుంచి స్థానిక అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయన్నారు. ఈ కారణంగా విద్యుత్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, కండక్టర్లు, ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించేందుకు సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. సబ్‌స్టేషన్లలోకి నీళ్లు వస్తే వాటిని తోడేసేందుకు అవసరమైన జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వినియోగదారుల సమస్యలు తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో జాప్యం లేకుండా చూడాలని, లైన్‌లాస్‌ను నియంత్రించేందుకు మీటర్ సేల్స్ పెంచాలని చెప్పారు. సమావేశంలో సీఈ పీరయ్య, ఎస్ఈ భార్గవ రాముడు, డీఈటీ మహమ్మద్ సాధిక్, ఏడీఈటీ శేషాద్రి పాల్గొన్నారు. -
పుష్కరాల కంట్రోల్‌రూమ్‌ను సందర్శించిన కలెక్టర్
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కష్ణా పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందుల రాకుండా చర్యలు తీసుకునేందుకు జిల్లా స్థాయిలో సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ టీకేశ్రీదేవి గురువారం సందర్శించారు. కంట్రోల్ రూమ్ నుంచి∙పుష్కర ఘాట్లను పర్యవేక్షించి రద్దీ నివారణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పుష్కరాల నిర్వహణపై తయారు చేసిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన స్క్రీన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జేసి రాంకిషన్, ఏజేసీ బి.రంజిత్ ప్రసాద్, డిఆర్వో భాస్కర్, జడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ ఏఓ నర్సయ్య, మీసేవా సూపరింటెండెంట్ బక్క శ్రీనివాసులు, కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు. వలంటీర్ల శిబిరం ప్రారంభం.. మహబూబ్‌నగర్ న్యూటౌన్: కష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించేందుకు వెళ్తున్న వలంటిర్ల శిబిరాలను గురువారం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పుష్కరాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ అధ్యక్షుడు అనంతరెడ్డి, ఉపాద్యక్షుడు నటరాజ్, ఎంవీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్, పాండరంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో వాలంటీర్ల బందాలు పుష్కర ఘాట్ల వద్ద విధులు నిర్వహించేందుకు బయలుదేరాయి.