
నేటి జనభేరి రూట్‌మ్యాప్ ఇదీ..
- బంటుమిల్లి నుంచి ప్రారంభం
- పెడన, కైకలూరు, విజయవాడ సెంట్రల్‌లో రోడ్‌షోలు, సభలు
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో మూడోరోజైన గురువారం జనభేరి యాత్ర కొనసాగించనున్నారు. పెడన, కైకలూరు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. బుధవారం రాత్రికి యాత్ర ముగించుకొని బంటుమిల్లి వెళ్లి రాత్రికి బస చేస్తారు. గురువారం ఉదయం 9.30 గంటలకు పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లిలో జనభేరి యాత్ర ప్రారంభించి రోడ్‌షోగా ప్రధాన సెంటర్‌కు చేరుకుని ప్రసంగిస్తారు.
అక్కడ నుంచి జానకిరామయ్యపురం, జయపురం, పెద్దతుమ్మిడి, మలపరాజుగూడెం, కొత్తపల్లి అడ్డరోడ్డు, సింగరాయపాలెం, శ్రీహరిపురం, ముదినేపల్లి, కానుకొల్లు, లింగాల, చెరికెగూడెం, మండవల్లి గ్రామాల్లో రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం కైకలూరు చేరుకొని అక్కడ రోడ్‌షో నిర్వహించి సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి విజయవాడ నగరానికి చేరుకొని సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్‌షో, సభ నిర్వహిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘరామ్‌లు ఒక సంయుక్త ప్రకటనలో వివరించారు.